అల్ బర్దాహ్ షరీఫ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అల్ బర్దాహ్ షరీఫ్ నుండి కొన్ని పంక్తులు, ఇవి అలెగ్జాండ్రియాలోని అల్-బుసిరి సమాధి వద్ద గోడపై కనిపిస్తాయి.

క़సీదా అల్ బర్దా షరీఫ్ అబూ అబ్దుల్లా మొహమ్మద్ ఇబ్న్ సాద్ అల్బసిరి అనే ఈజిప్టు కవి రాసిన కవిత్వం. ఈ కవి అరబ్ ప్రపంచంలో ప్రజాదరణ పొందిన కవి. క़సీదా అల్ బర్దా షరీఫ్ అరబ్బీలో వ్రాయబడిన కవిత. ఈ కవితను మొహమ్మద్ ప్రవక్త(ﷺ)ని కీర్తిస్తూ వ్రాసారు. ఈ కవిత అసలు శీర్షిక అల్-కవాకిబ్ అద్-దుర్ర్యా ఫీ మధ్ ఖయ్ర్ అల్-బరీయా(الكواكب الدرية في مدح خير البرية) (అర్ధం: లోకంలోని అత్యంత గొప్ప సృష్టి కీర్తిలో స్వర్గపు కాంతులు). ఇది సున్నీ మొహమ్మదీయులలో చాలా ప్రాముఖ్యత సంతరించుకున్న గీతం. కవి స్వప్న సాక్షాత్కారంలో మొహమ్మద్ ప్రవక్త కనిపించి కవికి ఉన్న పక్షవాతాన్ని నయం చేసి ఒక వస్త్రంతో శరీరాన్నంతా కప్పాడు. అందుకు కృతజ్ఞతగా కవి ఈ కవితను వ్రాస్తాడు.

కవిత్వం తెలుగు తర్జుమాతో

[మార్చు]

మౌలా యా సల్లి వ సల్లిమ్ దాఇమన్ అబదన్
అలా హబీబిక ఖయ్రి ఖల్కి़़ కుల్లిహిమి
ఓ రక్షకుడా (అల్లాహ్ ని సంబోధిస్తూ), నీకిష్టమైన వాడిపై, సృష్టిలోనే అత్యంత అద్భుతమైన వ్యక్తిపై నా ప్రార్థనలు, శాంతికాంక్షలు ఎల్లపుడూ, ఎప్పటికీ పంపించు.

ముహమ్మదున్ సయ్యిదుల్ కవ్నయ్ని వత్-తక़లయ్న్
వల్ ఫరీక़య్ని మిన్ అర్బివ్-వ మిన్ అజమి
ముహమ్మద్ రెండు లోకాలకూ(ఇహలోకం, పరలోకం), రెండు జాతులకూ(మానవులు, జిన్న్‍లు ) నాయకుడు. అరబ్బీ వారికి, అరబ్బీ కాని వారికిరువురికీ మార్గదర్శకుడు.
़़़
నబియ్యునల్ అమిరున్-నహి ఫలా అహదున్
అబర్రా ఫీ క़వ్లి లా మిన్హూ వ లా నాఅమి
అతనే మా ప్రవక్త, మంచి వారిని అజ్ఞాపిస్తూ, చెడ్డవారిని నిషేధిస్తున్నాడు. అతను కాక ఇనెవరూ లేరు.
మాటలకు బదులుగా, ఔను(ఇది మంచిది), కాదు(ఇది నిషిద్ధము) అని చెబుతున్నాడు.

హువల్ హబీబుల్-లజీ తుర్జ షఫా'అతహు
లి కుల్లి హవ్లిమ్-మినల్ అహ్వలి ముకు़తహిమి
అతడు సమస్త మానవ జాతినీ అన్ని రకాల దుఃఖాల నుండి ఉపశమించగలగడంలో మాకు సహాయపడగలవానికి(అల్లాహ్ కు) ప్రియమైనవాడు.

దా'అ ఇల్లాహి ఫల్ ముస్తమ్సి కూన బిహి
ముస్తమ్సి కూన బి హబ్లిన్ గయ్రి మున్ఫసిమి
అతడు మమ్మల్ని అల్లాహ్ మార్గంలోకి పిలిచాడు, అతన్ని నమ్మినవారు దృఢమైన ఎన్నటికీ తెగిపోని అల్లాహ్ తాడును పట్టుకున్నవారై ఉన్నారు.

ఫక़़़న్ నబియ్యిన ఫీ ఖల్కి़़़వ్-వ ఫీ ఖులుకి़़़న్
వ లమ్ యుదానుహు ఫీ ఇల్మివ్-వ ల కరమి
అతడు మిగితా ప్రవక్తల కన్నా బాహ్య సౌందర్యంలోనూ, భావ సౌందర్యంలోనూ ఉత్తముడు. జ్ఞానంలో, కరుణలో అతన్ని అందుకోగలవారు లేరు.

ఫమబ్లగుల్ ఇల్మి ఫీహి అన్నహు బషరున్
వ అన్నహు ఖయ్రు ఖల్కి़़़ల్లాహి కుల్లిహిమి
మాకు తెలిసిన ఉత్తమోత్తమ జ్ఞానం ప్రకారం అతడూ ఒక మానవుడే
అతను అందరిలోకీ ఉత్తముడు, ప్రముఖుడు - మొత్తం సృష్టిలో.