Jump to content

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు

వికీపీడియా నుండి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, సంక్షేమం మొదలైన రంగాలకు వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది.[1]

స్కోచ్ అవార్డు 2021

[మార్చు]

స్కోచ్‌ గ్రూప్‌ 78వ ఎడిషన్‌లో భాగంగా జాతీయ స్థాయిలో 2020-21కి గానూ ప్రకటించిన అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పలు గోల్డ్, సిల్వర్ స్కోచ్ లు వరించాయి. వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ ఆసరా, వైఎస్సార్‌ నేతన్న నేస్తం పథకాలతో పాటు మత్స్యశాఖ ఇటీవల ప్రారంభించిన ‘ఫిష్‌ ఆంధ్రా’కు డొమెస్టిక్‌ ఫిష్‌ మార్కెటింగ్‌ కేటగిరిలో గోల్డ్‌ స్కోచ్‌ వచ్చాయి. మత్స్యశాఖకు ఈ–ఫిష్‌ విభాగంలో,  పశుసంవర్ధక శాఖ తీసుకొచ్చిన పశుసంరక్షక్‌ యాప్‌కు, ఆంధ్రప్రదేశ్‌ విత్తనాభివృద్ధి సంస్థ (ఏపీ సీడ్స్‌)కు, గ్రామ, వార్డు సచివాలయాల విభాగానికి, బయోవిలేజ్, నేచురల్‌ ఫార్మింగ్‌ విభాగంలో విజయనగరం జిల్లాకు సిల్వర్‌ స్కోచ్‌ అవార్డులు దక్కాయి.[2]  

ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ నిర్వహిస్తున్న ప్రభుత్వ భూముల వివరాలు తెలియజేసే ‘మీ భూమి’ పోర్టల్‌కు ఈ-గవర్నెన్స్‌ విభాగం కింద స్కోచ్‌ సంస్థ సిల్వర్‌ మెడల్‌ దక్కింది. కౌలుదారు గుర్తింపు కార్డులు (సీసీఆర్‌), పేద కుటుంబాలకు ఇంటిస్థలాలు, భూశోధక్‌ డిజిటల్‌ ప్రాజెక్టులను ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌ అవార్డులు వరించాయి. స్కోచ్‌ సంస్థ 2022 ఏప్రిల్ మాసంలో నిర్వహించిన వెబినార్‌లో భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌, రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌ ఈ స్కోచ్‌ అవార్డులను స్వీకరించారు.[3]

మూలాలు

[మార్చు]
  1. బుగ్గన, రాజేంద్రనాథ్ (2022). Wikisource link to ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగం 2021-22. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము. వికీసోర్స్. 
  2. "ఏపీకి 'స్కోచ్‌' అవార్డుల పంట". Sakshi. 2022-01-06. Retrieved 2022-01-07.
  3. "'మీ భూమి'కి స్కోచ్‌ అవార్డు". m.andhrajyothy.com (in ఇంగ్లీష్). 2022-04-14. Retrieved 2022-04-14.

ఇతర లింకులు

[మార్చు]