ఆవిరి యంత్రంతో నడిచే వాహనాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లండను రోడ్డుపై తిరిగిన స్టీము వాహనము,1803
1831 satire on steam coaches
ఎస్ ఎస్ సవన్నా, మొదటి అవిరి యంత్రపు నౌక
పోర్టబుల్ స్టీము ఇంజను
స్తేఫెన్ సన్ తయరుచేసిన రాకెట్ అనే లోకో
స్తేఫెన్ సన్ యాజమాన్య హక్కులు పొందిన డిజైను

ఆవిరి యంత్రం లేదాస్టీము ఇంజను తో నీటీ ఆవిరినియాంత్రిక శక్తిగా మార్చవచ్చునని కనుగొన్నారు.ఆవిరి యంత్రంతో ఏర్పరచిన, యాంత్రిక శక్తితో నౌకలను, రైలు ఇంజనులను, రోడ్డు వాహనాలను నడిపారు.అంతేకాదు విద్యుత్తును కనుగొన్న మొదటి తరంలో విద్యుతు జనరేటరు యంత్రాలను కూడాఆవిరి యంత్రంతో తిప్పి విద్యుత్తు ఉత్పత్తి చేసారు.

ఆవిరి యంత్రం ఆవిస్కరణ[మార్చు]

1975 లో జేమ్సుఅనే ఇంజనీరు బౌల్టన్ (boultan) ఆర్థిక సహాయంతో వాట్ తక్కువ పీడనంతో పనిచేయు ఆవిరియంత్రాన్ని కనుగొన్నాక[1] ఆవిరి యంత్రాన్ని ఉపయోగించి లొకోమోటివ్ ఇంజనును మొదటగా రిచర్డ్ ట్రేవితిక్ కనుగొన్నాడు.[2] రిచర్డ్ ట్రేవితిక్ ఒక ఇంజనీరు. రిచర్డ్ ట్రేవితిక్ ఒక ఇంజనీరు. కార్నివాల్‌లో పంపింగు ఇంజనులు/బాయిలరుల మీద పనిచేస్తున్న సందర్భంలో ఈయన మొదటగా ఆవిరి యంత్రం ఆధారిత లోకోమోటివ్ (స్టీము యంత్రం ద్వారా స్వయంగా కదిలే బాయిలరు కల్గిన వాహనం) కనుగొన్నాడు,

ఆవిరి యంత్రంతో నడిచే వాహనాల పుట్టుక,అభివృద్ధి చరిత్ర[మార్చు]

1804 లో రిచర్డ్ ట్రేవితిక్ తయారు చేసిన ఆవిరి యంత్రం 25 టన్నుల బరువును గంటకు 8 కిలోమీటర్ల వేగంతో లాగింది. అలా స్టీము యంత్రాన్ని లోకోమోటివ్‌గా వాడుటకు మొదటి అడుగు పడింది.రిచర్డ్ ట్రేవితిక్ మొదట తయారు చేసిన లోకోమోటివ్ పెన్-వై-డార్రేన్.జేమ్స్ వాట్ నీటి ఆవిరిని /స్టీమును వాతావరణం కన్నఎక్కువ పీడనం కల్గించునని గుర్తించగా. 50 పౌండ్లు/చదరపు అంగుళం (50psi) పీడన మున్న స్టీమును శక్తియుత నీటి ఆవిరిగా రిచర్డ్ ట్రేవితిక్ గుర్తించాడు.నీటిఆవిరి పీడన శక్తిని ఉపయోగించి వాహనాలను నడుప వచ్చునని రిచర్డ్ ట్రేవితిక్ నిరూపించాడు.ఆతరువాత స్టీము పీడన ఆధారంగా పనిచేయు అనేక యంత్రాల ఆవిష్కరణలు మొదలైనవి.

స్టీము ఇంజనును కనుగొన్న సమయానికి ఉక్కుసాంకేతిక కూడా కొత్త పుంతలు తొక్కుతూ లోహశాస్త్ర వేత్తలు, ఇంజనీర్లు దృఢమైన నిర్మాణాలలో ప్రావీణ్యం సంపాదించడం వలన ఎక్కువ పీడనం కల్గిన స్టీము వత్తిడి తట్టుకునేలా బాయిలరులు స్టీము యంత్రాల నిర్మాణం సాధ్యమైనది.ఫలితంగా తక్కువ పరిమాణం వున్న సిలిండరు ఆవిరి యంత్రాలలో అధిక పీడనం ఉపయోగింఛి ఎక్కువ శక్తిని పొందే వీలు ఏర్పడినది.

స్టీము యంత్రాన్ని సముద్ర పడవలు/ఓడల్లో, రోడ్డుపై తిరిగే వాహనాల్లో, రైలుఇంజనుల్లో ఉపయోగించడం మొదలైంది.

నౌకలు/ఓడల్లో ఆవిరి యంత్రం వినియోగం[మార్చు]

ఆవిరి యంత్రాన్ని ఉపయోగించిన మొట్టమొదటి మొదటి నౌక అమెరికాలో 1805 నిర్మించారు.ఈ నౌకలోని ఆవిరి ఇంజను తయారి బ్రిటన్&కు చెందిన వాట్ తయారు చేసాడు.ఇందులో వాడిన ఆవిరి యంత్రం ఒక్క సిలిండరు కల్గి 4.5 మీటర్ల వ్యాసమున్నపార్శపెడల్ చక్రాన్ని, క్రాంకు, గేరుల అమరికతో తయారు చేసారు.స్టీమును తయారు చేయు బాయిలరును రాగితో స్థానికంగా చేసారు.స్టీము ఇంజను అమర్చిన ఎస్.ఎస్.సవన్న (SS Savannah) నౌక 1819లోఅట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటింది.ఈ నౌకకు కెప్టను మోసెస్ రోజర్సు (Moses Rogers).[3] ii

రైలు పట్టాలపై ఆవిరి యంత్రం వాహనం పరుగులు[మార్చు]

అలాగే రైలు ఇంజనులలో 1829 నాటికి రైలు ఇంజనుల ఆకారంలో పలు మార్పులుచోటు చేసుకుని.అనేక విఫల ప్రయత్నాల తరువాత ప్రస్తుతం లోకోమోటిక్ అనే పిలవబడే రైలు ఇంజనుతయారు చేసారు.ఇందులో ఆవిరి యంత్రాలు రైలు ఇంజను/బాయిలరు ముందు భాగాన ఇరు పక్కలపక్క అమర్చి, ఆవిరి యంత్రపు కనేక్టింగు రాడ్/ఇరుసును చక్రాలకు కలిపారు.మొదట్లో స్టీము బాయిలరు వేరుగా, ఆవిరి యంత్రాన్ని వేరుగా, ఇంధనం నీరు నిల్వ టాంకులు వేరుగా వుండేవి.

జార్జి స్టేపెనుసన్ [4] మొదటగా వీటన్నింటినీ ఒకేచోటు వుండేలా రాకెట్ అనే తన లోకోమోటివ్ తయారు చేసాడు. ఆతరువాత లోకోమోటివ్ ఇంజను మరింత అభివృద్ధి పరచడంతో తరువాత తరపు లోకోమోటివ్ ఇంజనులు మొదటి తరంకన్నఎంతో ఎక్కువ పీడనం కల్గిన స్టీమును ఉత్త్పత్తి చెయ్యగలగడం, తక్కువ సైజు సిలిండరు ఆవిరి యంత్రంతో ఎక్కువ వేగంగా పిస్టనును చలింప చెయ్యడం వలన లోకో మోటివ్ ఇంజనులు ఎక్కువ బరువు వున్న సరుకులను కల్గిన బోగీలను సునాయాసంగా లేక్కువ వేగంతో గమ్యస్థానానికి చేర్చేవి.

రోడ్ల పై ఆవిరి యంత్రం వాహనం నడకలు[మార్చు]

నికోలస్ జోసెప్ కుగ్నట్ [5] మొదటగా మూడు చక్రాల స్టీము యంత్రంతో నడిచే వాహనాన్ని తయారు చేసాక, చాలామంది రోడ్డు మీద సులభంగా తిప్పగలిగే, తిరుగ గలిగే రోడ్డు వాహనాల తయారు చేయుటకు ప్రయత్నించారు. 1827 వాల్టరు హాన్‌కాక్ ఒక బాయిలరుకు రూపకల్పన చేసి దానిపై యాజమాన్య హక్కులు పొందాడు.ఈ బాయిలరు ఆవిష్కరణతో స్టీముఇంజనుతో రోడ్లమీద వాహన సంచారం మొదలైంది.యాజమాన్య హక్కులు పొందిన కొద్ది సంవత్సరాలకే లండన్ నగరవీధుల్లో గంటకు 19 కిలోమీటర్ల వేగంతో స్టీముఇంజనుతో బండిని నడిపాడు.ఆ తరువాత త్వరలోనే గంటకు 34 కిలోమీటర్ల వేగంతో 20 ప్రయాణికులను తీసుకెళ్ళు స్టీము బస్సును రోడ్లపై నడిపాడు.

ఆవిరి యంత్రంతో పనిచేసిన పొర్టబుల్ యంత్రాలు[మార్చు]

మొదటగా ట్రెవితిక్ మొదటగా ఎక్కువ పీడన స్టీము బాయిలరు, స్టీము ఇంజనును ఒకే యూనిట్ గా లోకోఇంజను తయారు చేసాక, పోర్టబుల్ ఇంజను (అనగా ఒకచోటు నుండి మరో చోటుకు వెళ్ళగలిగే చిన్నఆవిరి యంత్రాలు) కుడా వాడుకలోకి వచ్చాయి. పోర్టబుల్ ఇంజనులు రకరకాలనిర్మాణాలలో రూపు దిద్దుకున్నాయి.1842 లో ట్రాక్షను ఇంజనను అనే స్వయంగా కదిలే స్టీము ఇంజను పలురకాల యంత్రాలను తిప్పగేలిగేలా తయారు చెయ్యబడింది.అయితే రోడ్లు సరిగా లేనందున ఈ రకపు వాహనాలను రోడ్లపై నడపటం కష్టంగా వుండేది.అయితే 1870 నాటికి ఇంజనులో గేర్ బాక్సు అమర్చడం, బాయిలరు మీద అమర్చడం, క్రాంకు షాప్ట్ ను ఫైరు బాక్సు మీద అమర్చడం వంటి లోకోమోటివ్ ఇంజనువంటి మార్పులతో స్టీముఇంజను వాహనాలను రోడ్లమీద నడపడం సులభం అయ్యింది.

ఈ వ్యాసాలు కూడా చదవండి[మార్చు]

మూలాలు/ఆధారాలు[మార్చు]

  1. "Who Invented the Steam Engine?". livescience.com. Archived from the original on 2017-07-05. Retrieved 2018-01-31.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "Richard Trivithick". britannica.com. Archived from the original on 2017-10-26. Retrieved 2018-01-31.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "SS Savannah". robinsonlibrary.com. Archived from the original on 2017-06-12. Retrieved 2018-01-31.
  4. "George Stephenson". history.co.uk. Archived from the original on 2017-06-30. Retrieved 2018-01-31.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  5. "Nicolas-Joseph Cugnot". britannica.com. Retrieved 2018-01-31.