ఆహుతి (1950 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆహుతి
(1950 తెలుగు సినిమా)

సంక్షేమానికి బలియైన ప్రేమికుల కథ
దర్శకత్వం ఆర్. ఎస్. జున్నాకర్
కథ శ్రీశ్రీ
తారాగణం జయసింహ,
శశి,
నిశి బరన్,
జి. షావుకార్
సంగీతం సాలూరి రాజేశ్వరరావు
నేపథ్య గానం రావు బాలసరస్వతి,
ఘంటసాల,
కనకం
గీతరచన శ్రీశ్రీ
నిర్మాణ సంస్థ ‌నవీన ఫిల్మ్స్
భాష తెలుగు

హిందీ చిత్రమైన నీరా ఔర్ నందా ఆధారంగా తెలుగులోకి అనువాదమైన తొలి డబ్బింగ్ సినిమా 1950 సంవత్సరంలో విడుదలైన ఆహుతి.ఈ సినిమాకు మాటలు పాటలు రాయడం ద్వారానే శ్రీ శ్రీ వెండితెరకు పరిచయమయ్యారు. దీని నిర్మాత జయభేరితో ప్రఖ్యాతుడైన నారాయణరావు. మాధవపెద్ది, చదలవాడ, వల్లం, కనకం తదితరులు ఈ చిత్రానికి డబ్బింగ్ చెప్పారు. తారలందరూ హిందీ వారే, చిత్రం అంతా ఔట్ డోర్ లో తీయడం దీని ప్రత్యేకత, పడవ వాళ్ళ కథ. తెలుగు డబ్బింగ్ కు సాలూరు రాజేశ్వరరావు సంగీతం సమకూర్చారు..

పాటలు[మార్చు]

  1. ఓ ప్రియబాలనురా నే మనజాలనురా - రావు బాలసరస్వతి దేవి, ఘంటసాల
  2. జనన మరణ లీల ప్రేమయే మృత్యుపాశమే - ఘంటసాల, రావు బాలసరస్వతి దేవి
  3. హంసవలె ఓ పడవా ఊగుచు రావే అలలమీద - ఘంటసాల, రావు బాలసరస్వతి దేవి బృందం
  4. ప్రేమయే జనన మరణ లీల - ఘంటసాల, రావు బాలసరస్వతి దేవి
  5. పున్నమి వచ్చినదీ పొంగినదీ జలదీ - ఘంటసాల, రావు బాలసరస్వతి దేవి
  6. చిన్నదాని రూపే చూడాలి చినదాని రూపే చూడాలి హాయ్ చినదాని పొందే చేరాలి - కనకం
  7. ఊగీసలాడే నయ్యా పడవా ఊగీసలాడేనయ్యా - రావు బాలసరస్వతీదేవి
  8. ప్రణయమే పోయేనా బలియై ప్రాణ సఖుని వదల వలెనా - రావు బాలసరస్వతీదేవి

వనరులు[మార్చు]