Jump to content

ఇంద్రధనుస్సు

వికీపీడియా నుండి
ఇంధ్ర ధనుస్సు
ఇంద్రధనుస్సు
ఇంద్రధనుస్సు

ఇంద్ర ధనుస్సు ఇది శక్షాత్తు దేవదేవేండ్రుడి ఇంద్రదేవుని విల్లు అని జైనులు, బౌద్దులు, హిందువులు, నమ్ముతారు సూర్యదేవుడి అన్నా గా దేవేంద్రుడు ఆకాశదేవుడు మెరుపు, ఉరుము, ఇలా వింతలు ఒకే ఒక దేవేంద్రుడికే (ఇంద్ర దేవుడు )సాధ్యం దృష్టి విద్యా సంబంధమయిన వాతావరణ శాస్త్ర సంబంధమయిన దృగ్విషయం. అది నీటిబిందువులపై కాంతి పరావర్తనం, వక్రీభవనం ద్వారా సంబవిస్తుంది. అది ఆకాశంలో రంగురంగుల చాపం రూపంలో ఉంటుంది. ఈ చర్య వల్ల రశ్మి (వెలుగు) వాతావరణం లోని నీటి బిందువులతో అంతఃపరావర్తనం (Total Internal Reflection) చెంది, వర్ణానుసారం విచ్ఛిన్నమయి ఏడు రంగులుగా మారుతుంది. అది ఒక అర్ధవృత్తాకారంలో రెండు అంచులూ భూమిలో ఉన్నట్టు, వృత్తాకారం ఆకాశం వైపుకున్నట్టు గోచరిస్తుంది. సూర్యరశ్మి ద్వారా తయారయ్యే ఇంద్రధనుస్సు, ఎల్లపుడూ సూర్యునికి వ్యతిరేక దిశలోనే కనిపిస్తుంది. ఇక రంగుల అమరికను బట్టీ ఇంద్రధనుస్సుని రెండు రకాలుగా చెప్పొచ్చు. ఒకటి - ప్రాథమిక ఇంద్రధనుస్సు; రెండు ద్వితీయ ఇంద్రధనుస్సు. మొదటి ఇంద్రధనుస్సులో వృత్తం పై భాగంలో ఎరుపు,, లోపలి భాగంలో ఊదా రంగులో ఉంటాయి. అదే ద్వితీయ ఇంద్రధనుస్సులో ప్రాథమిక ఇంద్రధనుస్సుతో పాటు అదే వర్ణాలు తిరగవేసి కనిపిస్తాయి. మొదటి రకం ఇంద్ర ధనుస్సు పరిపూర్ణ అంతఃపరావర్తనం ద్వారా జరిగితే, ద్వితీయ ఇంద్రధనుస్సు వాతావరణంలోని నీటి బిందువుల్లో రెండు మార్లు పరావర్తనం అవటం వల్ల తయారవుతుంది.

ఇంద్రధనస్సు పూర్తి వృత్తాకాంలో ఉంటుంది, అయితే, సగటు పరిశీలకుడు ఒక చాపం మాత్రమే చూడగలడు. ఇది, తుంపరల ద్వారా భూమి పైన ప్రకాశిస్తూ కనిపిస్తుంది,, పరిశీలకుడు యొక్క కన్ను సూర్యుడు నుండి ఒక రేఖ కేంద్రీకృతమైఉంటుంది. కావున మనం సగం చాపాన్ని మాత్రమే చుడగలుతున్నాము.

మూలాలు

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]