Jump to content

ఇటుక

వికీపీడియా నుండి

ఇటుక (Brick) కట్టడాల నిర్మాణానికి ఉపయోగించు ఒక ముఖ్యమైన పదార్ధము. ఇటుకలను ఒక వరుసలో పేర్చుకొనుచూ, మధ్య నీటితో కలపబడిన సిమెంటును వేసి పూడ్చడం ద్వారా ఇంటికి కావలసిన గోడ ల నిర్మాణము చేస్తారు.

ఇటుక బట్టి, తమిళనాడు, భారతదేశం
విశాఖ జిల్లాలో ఒక నిరుపయోగ ఇటుక బట్టీ

ఇటుకలు - రకాలు

[మార్చు]
కీసర గుట్ట పుణ్యక్షేత్రంలో బయల్పడిన పురాతన ఇటుకలు
గురుభక్తులకొండ బౌద్ధారామం, రామతీర్థం, విజయనగరం జిల్లా
కీసర గుట్ట పుణ్య క్షేత్రంలో పురావస్తు శాఖ వారి త్రవ్వకాలలో బయల్పడిన శతాబ్ధాల నాటి ఇటుకల భవన పునాదులు

ఇటుకలలో పలు రకాలు ఉన్నాయి.

  • మట్టి ఇటుక
  • కాల్చిన మట్టి ఇటుక
  • తేలికయిన ఇటుక
  • సిమెంట్ ఇటుక
  • ప్లాస్టర్ ఆప్ పారిస్ అను జింక్ పదార్ధపు ఇటుక
  • బొగ్గు బూడిద (ఫ్లై యాష్) ఇటుకలు

ఇలా పలు రకాలు ఉన్నాయి. ఒక్కొక్క ప్రాంతములో ఒక్కొక్క విధమైన ఇటుకలు వాడుతుంటారు

కీసరగుట్ట వద్ద బయల్పడిన పురాతన పెద్ద ఇటుక

ఇటుకల తయారీ

[మార్చు]

పచ్చిఇటుకలు

[మార్చు]

సాధారణంగా పూర్వము ఇటుకలు ఎక్కువగా మట్టితో చేసి వాటినే గృహనిర్మాణాలకు వాడుతుండేవారు. వీటిని పచ్చి ఇటుకలు అనేవారు. వీటి తయారీకి నాలుగు పలకలుగా చెక్కతో చేయబడిన అచ్చులలో మట్టిని నింపి, దానిని ఎండలో శుభ్రపరచబడిన నేలపై బోర్లించేవారు. అలా బోర్లించిన మట్టిముద్ద ఆదే ఆకారంలో గట్టి పడి పోతుంది. తరువాత అవే ఇటుకలను కాల్చడం ద్వారా మరింత గట్టిదనం వస్తుందని తెలిసింది. అప్పటి నుండి ఇటుకలను కాల్చి వాడటం మొదలు పెట్టారు.

ఇటుక బట్టీలు

[మార్చు]
తయారయిన ఇటుకలను ఎండబెట్టిన దృశ్యము. చిత్తూరు జిల్లా సదుం. వద్ద తీసిన చిత్రము

మట్టితో తయారు చేసిన ఇటుకలను కాల్చడానికి అదే ఇటుకలతో ప్రత్యేకంగా తయారు చేసుకున్న బట్టీని (పొయ్యి) ఇటుక బట్టీ అంటారు.

కొన్ని వేల ఇటుకలను ఒక చోట పెద్ద గుట్టగా, లేదా పిరమిడ్ లా మధ్య కాళీలను వదులుతూ పేర్చి వాటి మధ్య ఊక లేదా ధాన్యం పొల్లు, నేలబొగ్గు పోసి వాటిని కాల్చేవారు. ఈ గుట్టలను ఇటుక బట్టీలు అంటారు.

ఇప్పటి కొత్త కాంక్రీటు నిర్మాణాల కొరకు సిమెంటు ఇటుకలను తయారు చేస్తున్నారు. బ్రిక్స్ అని పిలువబడే వీటి నిర్మాణము కొరకు జల్లించిన ఇసుక, చిన్న కంకర లాంటివి వాడటం ద్వారా ఖర్చు తగ్గిస్తున్నారు. ఆంధ్రలో తూర్పు గోదావరి జిల్లాలో ఆత్రేయపురం మండలంలో అంకంపాలెం ఇటుక మన్నికలో నాణ్యతలో పేరు పొందింది.

ఇటుకల తయారీ, వాడకము పూర్వ కాలము నుండి ఉన్నదే. పూర్వ కాలం నాటి ఇటుకలు. ఆ నాటి ఇటుకలు పురాతన భవనాల వద్ద కనబడతాయి. ఈ నాటి ఇటుకల పరిమాణము, నాణ్యతకు భిన్నంగా ఆ నాటి ఇటుకలు ఉండేవి. ఆ నాటి ఇటుకలు పరిమాణములో పెద్దవి., చాల మన్నిక గలవి. పూర్వం నీటిపై తేలగలిగిన ఇటుకలు కూడా ఉండేవని తెలుస్తుంది. ఉదాహరణకు రంగారెడ్డి జిల్లా కీసర గుట్ట లో ఉన్న పురాతన కోట పునాదులకు వాడిన పెద్ద ఇటుకలు ఈ నాటికీ చూడవచ్చు. (బొమ్మ చూడుము) కీసరగుట్టపై కూడా మట్టి దిబ్బలలో అనేకమైన పురాతన ఇటుకలు కనిపిస్తాయి. కొన్ని శతాబ్ధాలైనా ఆ ఇటుకలు ఈనాటికీ చాలా గట్టిగా ఉన్నట్టు గ్రహించ వచ్చు.

ఇటుకల తయారీకి ఉపయోగించే అచ్చులు. కల్లూరు వద్ద తీసిన చిత్రము

ప్రస్తుత కాలంలో కూడా తేలికైన ఇటుకలు తయారు చేస్తున్నారు. కాని వాటి ధరలు ఎక్కువగా ఉంటాయి. తేలికైన ఇటుకలను తయారు చేయడానికి ఇటుకలు తయారు చేయు మట్టిలో వరిపొట్టు కలిపి ఇటుకలు చేసి కాల్చగా అందులోని వరిపొట్టు కాలిపోయి ఆ ప్రదేశము ఖాళీగా ఉండి ఆంత పరిమాణం మట్టి తక్కువై ఇటుక తేలికగా ఉంటుంది.

"https://te.wikipedia.org/w/index.php?title=ఇటుక&oldid=2878988" నుండి వెలికితీశారు