ఇలకోడి
ఇలకోడి | |
---|---|
ఇలకోడి కీటకం | |
Scientific classification | |
Kingdom: | |
Phylum: | |
Class: | |
Order: | |
Suborder: | |
Superfamily: | |
Family: | Gryllidae Bolívar, 1878
|
ఇలకోడి అనగా ఒక కీటకం. దీనిని ఈలకోడి అని కూడా అంటారు. ఇవి బయటి ప్రదేశాలతో పాటు ఇళ్ళలో కూడా ఈల శబ్దం చేస్తుంటాయి, అందువలనే దీనిని ఈలకోడి అంటారు. ఇది ఒక చిన్న జీవి. ఇవి ఇళ్లలో చీకుగా ఉన్న చోట్ల నక్కి సదా రొదచేస్తుంటాయి, ఒక్కొక్కసారి వీటి శబ్దం వినాలనిపిస్తుంది కూడా. ఒకసారి ఇవి చేసే శబ్దం వింటే అదే శబ్దం మరికొంత సమయం చెవులలో మారుమ్రోగుతున్నట్లుగా ఉంటుంది. ఇవి ఎక్కువగా జోడి కోసం ఈ శబ్దం చేస్తుంటాయి. ఒక్కొక్కసారి ఇవి అనేకం కొద్దికొద్ది దూరంలో ఉండి శబ్దం చేస్తుంటాయి. ఇలకోడిని ఆంగ్లంలో క్రికెట్ అంటారు. ఇలకోడి యొక్క రకాలు 900 పైగానే ఉన్నాయి. ఇవి కొంతవరకు చదునుగానే ఎక్కువ ఎగుడుదిగుడులు లేకుండా వుంటాయి, పొడవైన రెండు స్పర్శశృంగాలను (మీసాల వంటివి) కలిగి ఉంటాయి. తరచుగా వీటిని మిడతలగా తికమకపడతారు, ఎందుకంటే ఇవి మిడతల లాగా కాళ్ళతో ఎగరడం సహా ఒకే రకమైన శరీర ఆకృతిని కలిగి ఉంటాయి. ఇలకోడి వలన మానవులకు ప్రమాదమేమిలేదు.
ఆకర్షించేందుకు
[మార్చు]మగ ఇలకోడులు ఆడ ఇలకోడులను ఆకర్షించేందుకు పిలుపుగానం (ఈలశబ్దం) చేస్తాయి, ఇతర మగవాటిని దూరంగా పోయేలా చాలా బిగ్గరగా ఈలశబ్దం చేస్తాయి.