ఇవానా (నటి)
ఇవానా | |
---|---|
జననం | అలీనా షాజీ 2000 ఫిబ్రవరి 25 కేరళ, భారతదేశం |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2012–ప్రస్తుతం |
అలీనా షాజీ (జననం 2000 ఫిబ్రవరి 25) ఇవానాగా ప్రసిద్ధి చెందిన భారతీయ నటి. ఆమె ప్రధానంగా మలయాళం, తమిళ భాషా చిత్రాలలో పని చేస్తుంది.[1] అయితే భారీ వసూళ్లతో దూసుకుపోతున్న ప్రదీప్ రంగనాథన్, ఇవానా జంటగా నటించిన తమిళ సినిమా లవ్ టుడే 2022 నవంబరు 25న తెలుగులోను విడుదల కానుంది. దీంతో తెలుగు ప్రేక్షకులకు ఆమె మరింత దగ్గర కానుంది.[2] 2018లోనే తమిళ డబ్బింగ్ చిత్రం ఝాన్సీతో తెలుగులో పరిచయం అయింది.
కెరీర్
[మార్చు]అలీనా షాజీ మాస్టర్స్ (2012)లో మలయాళ చిత్ర పరిశ్రమలో బాలనటిగా తన వృత్తిని ప్రారంభించింది. సహాయ నటిగా రాణి పద్మిని (2015)లో ఆలరించింది. అనురాగ కరికిన్ వెల్లం (2016)లో ప్రధాన పాత్రకు కుమార్తెగా కీలక పాత్ర పోషించింది.[3]
దీంతో దర్శకుడు బాలా తన తమిళ చిత్రం నాచియార్ (2018)లో జ్యోతిక, జి. వి. ప్రకాష్ కుమార్‌లతో కీలక పాత్రల్లో నటించేందుకు అలీనా షాజీని ఎంచుకున్నాడు. ఈ చిత్రం ఝాన్సీగా తెలుగులో డబ్ చేసారు కూడా.
అలీనా షాజీ తమిళ ప్రేక్షకులకు ఉచ్చరించడానికి సులువుగా తన పేరును ఇవానాగా మార్చుకుంది.[4]
ఫిల్మోగ్రఫీ
[మార్చు]సంవత్సరం | సినిమా పేరు | పాత్ర పేరు | భాష | ఇతర విషయాలు |
---|---|---|---|---|
2012 | మాస్టర్స్ | మలయాళం | గుర్తింపు లేని పాత్రలు | |
2015 | రాణి పద్మిని | మలయాళం | ||
2016 | అనురాగ కరికిన్ వెల్లం | అను రఘు | మలయాళం | |
2018 | నాచియార్ | అరసి | తమిళం | |
2019 | హీరో | మతి | తమిళం | |
2022 | లవ్ టుడే | నికిత | తమిళం | |
2023 | ఎల్‌జీఎం | |||
2023 | సెల్ఫిష్ | చైత్ర | తెలుగు | తెలుగులో మొదటి సినిమా[5] |
అవార్డులు, నామినేషన్లు
[మార్చు]Year | Award | Category | Film | Result | Ref(s) |
---|---|---|---|---|---|
2019 | 8వ SIIMA అవార్డులు | ఉత్తమ అరంగేట్రం | నాచియార్ | నామినేట్ చేయబడింది | [6] |
ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ | ఉత్తమ సహాయ నటి | నామినేట్ చేయబడింది | [7] |
మూలాలు
[మార్చు]- ↑ "Ivana aka Aleena Shaji Latest News & Updates". Mokka Postu.com. Retrieved 2020-05-20.
- ↑ "ఈ సినిమాకి ప్రేక్షకులే హీరోలు." web.archive.org. 2022-11-20. Archived from the original on 2022-11-20. Retrieved 2022-11-20.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Anuraga Karikkin Vellam review". Reelistic Views (in అమెరికన్ ఇంగ్లీష్). 2016-11-18. Archived from the original on 2018-02-23. Retrieved 2018-02-22.
- ↑ Tamil The Hindu (2018-02-21), 'Jyothika helped me to cry' : 'Nachiyaar' Ivana Interview | Tamil The Hindu, retrieved 2018-02-22
- ↑ A. B. P. Desam (22 April 2023). "తెలుగులో బుజ్జి కన్నా - నిర్మాత తనయుడితో 'లవ్ టుడే' హీరోయిన్". Archived from the original on 25 April 2023. Retrieved 25 April 2023.
- ↑ "SIIMA AWARDS | 2018 | winners | |". SIIMA. Archived from the original on 2020-06-04. Retrieved 2022-11-20.
- ↑ "SIIMA AWARDS | 2018 | winners | |". SIIMA. Archived from the original on 2020-06-04. Retrieved 2022-11-20.