ఉపమాలంకారం
ఉపమాలంకారం ఉపమానానికి, ఉపమేయానికి సామ్యమైన సాదృశాన్ని చెప్పే అలంకారం లేదా ఉపమేయంతో ఉపమానాన్ని పోల్చడం. ఇది అర్థాలంకారాల్లో ఒకటి. ఉపమాలంకారము అన్ని అర్థాలంకారాలలోకి ఎక్కువ ఉపయోగించబడుతున్నది. దీనిని ఆంగ్లంలో simile అంటారు.[1]
లక్షణం
[మార్చు]లక్షణం: ఉపమాయత్ర సాదృశ్య లక్ష్మీరుల్లసతి ద్వయోః
వివరణ: ఉపమానానికి, ఉపమేయానికి సామ్యరూపమైన సౌదర్యాన్ని చెప్పడం "ఉపమా" అలంకారం అవుతుంది.
సాంకేతిక పదాలు
[మార్చు]ఉపమాలంకారాన్ని అర్థంచేసుకునేందుకు ఉపకరించే సాంకేతిక పదాలు, వాటి అర్థాలు ఇవి:;[2] ఉపమానం : దేనితో పోలుస్తున్నామో అది ఉపమానం
- ఉపమేయం : దేన్ని పోలుస్తున్నామో అది ఉపమేయం
- సమానధర్మం : ఉపమానానికి, ఉపమేయానికి మధ్యనున్న పోలిక
- ఉపమావాచకం : ఉపమానంతో ఉపమేయాన్ని పోల్చడానికి వాడే పదం
ఉదాహరణ
[మార్చు]చల్లని గాలి కన్నతల్లి స్పర్శలా హాయిని కలిగిస్తుంది.
ఇందులో
ఉపమేయం
'ఉపమానం:
సమానధర్మం:.
ఉపమావాచక
ఇక్కడ వాగర్థాలకు, పరమేశ్వరులకు సామ్యం చెప్పబడింది. శబ్దం లేకుండా అర్థం లేదు, అర్థం లేకపోతే శబ్దానికి విలువలేదు - ఇవి రెండూ ఎప్పుడూ కలిసే ఉంటాయి. అలాగే ఆ పార్వతీపరమేశ్వరులు కూడా కలిసే ఉంటారు. ఇది ఈ రెండు విషయాల మధ్యనా ఉన్న సామ్యం.
ఈ నాలుగు వస్తువులూ ఉన్న ఉపమాలంకారాన్ని పూర్ణోపమాలంకారం అంటాము. కొన్ని సందర్భాలలో వీటిలో కొన్నే ఉండవచ్చును. అప్పుడు దాన్ని లుప్తోపమాలంకారము అంటాము. లుప్తోపమాలంకారములను మనం చలనచిత్ర గీతాల్లో ఎక్కువ చూస్తూ ఉంటాము.
ఉదాహరణలు
[మార్చు]పూర్ణోపమాలంకారము
- ఆమె ముఖము చంద్రబింబము వలె ఉన్నది ఇక్కడ వలె అనునది ఉపమావాచకం. ముఖము ఉపమేయం. చంద్రబింబం ఉపమానం.
- ఆమె కన్నులు కలువ రేకుల వలెనున్నవి
లుప్తోపమాలంకారము
ఆమె చిగురుంకేలు నంటుకొంటివి.
చిగురువలె మెత్తని, కేలు (చేయి అని అర్థము) ఇందులోవలె, అను ఉపమావాచకము లేదు. మెత్తని అను సమానధర్మము లేదు. చిగురు అను ఉపమానము, కేలు అను ఉపమేయము. ఈ రెండే కలవు
మూలాలు
[మార్చు]- ↑ "లిటిల్ మాస్టర్స్ సులభ వ్యాకరణము/అలంకార విభాగము - వికీసోర్స్". te.wikisource.org. Retrieved 2020-08-18.
- ↑ పి., సందీప్ (11 జూలై 2010). "ఉపమాలంకారము (Simile)". మనోనేత్రం. Archived from the original on 7 మార్చి 2016. Retrieved 22 October 2015.