Jump to content

ఎర్రమంజిల్ ప్యాలెస్

వికీపీడియా నుండి
Errum Manzil
సాధారణ సమాచారం
రకంRoyal Palace
నిర్మాణ శైలిIndo-European Baroque
ప్రదేశంHyderabad, Andhra Pradesh, India
పూర్తి చేయబడినది1870
ఫకర్ - ఉల్-ముల్క్ II

ఎర్రమంజిల్ ప్యాలెస్ ఒక రాజ ప్రాసాదం. భాగ్యనగరాన్ని పరిపాలించిన కుతుబ్‌షాహీ రాజుల కాలంలో ఇది నిర్మితమైంది. వారి అద్భుత కట్టడాల్లో ఇది ఒకటి. ఖైరతాబాద్, పంజాగుట్ట మార్గంలో ఉన్న దీన్నే ఒకప్పుడు ‘ఎపూరంమంజిల్’ అని కూడా పిలిచేవారు "ఇరం మంజిల్", ఎర్రమంజిల్ గా మారిందంటారు. "ఇరం" అంటే స్వర్గం . నవాబ్ సఫ్దర్ జంగ్ ముషీర్-ఉద్దౌలా ఫక్రూల్ ముల్క్ దీనిని నిర్మించిండు. 1870 నాటికి దీని నిర్మాణం పూర్తయింది. ఇండో-యురోపియన్ శైలిలో ఉన్న ఈ ప్యాలెస్‌ను నవాబులు విందులు, అంతర్గత కార్యక్రమాల కోసం వినియోగించేవారు. ఇందులో 150 గదులు, డ్రాయింగ్ రూమ్, ప్యాలెస్‌కు పక్కన గోల్ఫ్ కోర్స్, పోలో గ్రౌండ్, గుర్రపు శాల, పశువుల శాల ఉండేవి. ప్రస్తుతం దీన్ని అర్ అండ్ బీ చీఫ్ ఇంజనీర్ కార్యాలయంగా వినియోగిస్తున్నారు.[1] హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ (హుడా)చే వారసత్వ కట్టడంగా గుర్తించబడింది.

పేరు

[మార్చు]

ఈ భవంతి ఎర్రగడ్డ అనే కొండపై నెలకొని ఉన్నది. దీనికి నవాబ్ ఫాఖ్రుల్ ముల్క్ "ఇరం మంజిల్" (పర్షియన్ భాషలో 'స్వర్గ భవనం') పాలెస్ గా నామకరణం చేసాడు. పర్షియన్ భాషలో స్వర్గం అని అర్థాన్నిచ్చే 'ఇరం' అనే పదం "ఎర్రం" గా ఉచ్ఛరింపబడుతుంది. ఇది తెలుగుపదమైన "ఎర్ర" తో సమానంగా ఉచ్ఛరింపబడుతుంది. అతడు ఆ భవనానికి ఎరుపు రంగు వేయించాడు. ఆ భవనం ఎర్రగడ్డ కొండపై ఎరుపు రంగులో దర్శనమిస్తుంది. నవాబ్ యొక్క ఈ భవనం రెండు ఇదే రకమైన ఉచ్ఛారణ గల పేర్లతో పిలువబడుతుంది: అవి పర్షియన్ ముస్లింల స్నేహానికి గుర్తుగా "ఇరం మంజిల్" అని, స్థానిక ప్రజల కోసం "ఎర్రం మంజిల్" అని పిలిచారు. తరువాత కాలంలొ ఈ భవనం "ఎర్ర మంజిల్" గ పిలువబడుతుంది.

చరిత్ర

[మార్చు]

ఈ భవనం ఇండో-యూరోపియన్ బరోక్ శైలి లోనిర్మిచబడినది. ఈ భవనంలో 150 గదులు లూయిస్ XVI ఫర్నిచర్తో అమర్చబడి ఉన్నాయి. తొమ్మిది రంధ్రాల గోల్ఫ్ కోర్సు, పోలో గ్రౌండ్, గుర్రపు శాల, పాడి పరిశ్రమ ఉన్నాయి. ఈ రాజభవనం గట్టి, అలంకారమైన పనులతో నిండి ఉంది. ఈ భవనం రాజ విందులకు, ఇతర గ్రాండ్ ఈవెంట్ల కు ఉపయోగించబడింది. తర్వాత, రాజప్రాసాదాన్ని రికార్డుల స్టోర్ గృహంగా ఉపయోగించుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. కొన్నేళ్లుగా ఇది పబ్లిక్ వర్క్స్ డిపార్టుమెంట్ చేతిలోకి బదిలీ చేయబడింది. ప్రస్తుతం ఈ భవనంలో ఇంజనీర్స్ ఇన్ చీఫ్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్, ఇరిగేషన్ / కమాండ్ ఏరియా డెవెలప్మెంట్ డిపార్ట్మెంట్స్ యొక్క చీఫ్ ఇంజనీర్స్ కార్యాలయాలు ఉన్నాయి.

మూలాలు

[మార్చు]
  1. "Vantage location, hoary past". The Hindu. 5 Nov 2003. Archived from the original on 2004-04-22. Retrieved 2011-09-18.

ఇతర లింకులు

[మార్చు]