Jump to content

ఓబులనాయుడుపాలెం

అక్షాంశ రేఖాంశాలు: 16°19′07″N 80°26′25″E / 16.318492°N 80.440149°E / 16.318492; 80.440149
వికీపీడియా నుండి
ఓబులనాయుడుపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
ఓబులనాయుడుపాలెం is located in Andhra Pradesh
ఓబులనాయుడుపాలెం
ఓబులనాయుడుపాలెం
అక్షాంశరేఖాంశాలు: 16°19′07″N 80°26′25″E / 16.318492°N 80.440149°E / 16.318492; 80.440149
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం గుంటూరు
ప్రభుత్వం
 - సర్పంచి చింతా వీర్లంకమ్మ
పిన్ కోడ్ 522005
ఎస్.టి.డి కోడ్

ఓబులనాయుడుపాలెం గుంటూరు జిల్లా గుంటూరు మండలం లోని రెవెన్యూయేతర గ్రామం.

గ్రామ చరిత్ర

[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.[1]

గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు

[మార్చు]

తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.

గ్రామ పంచాయతీ

[మార్చు]
  1. ఈ గ్రామానికి 2001 - 2006 మధ్య సర్పంచిగా పనిచేసిన శ్రీ మూడావత్ శ్రీనూనాయక్, ఇచ్చిన హామీలను నిలబెట్టిన పరిపాలనాదక్షుడు. ప్రభుత్వ నిధులు సరిపోకపోతే ఇంకా రు.20 లక్షల స్వంతనిధులతో మొత్తం ఈ పనులు పూర్తి చేశారు:- (1) రు.20 లక్షలతో 90 వేల లీటర్ల రక్షితమంచినీటి పథకం. (2) సాధారణ చెరువులను మంచినీటి చెరువులుగా అభివృద్ధి (3) మహిళామండలి భవన నిర్మాణం (4) ప్రధాన రహదారితారు రోడ్డుగా నిర్మాణం, ఎస్.సి.కాలనీ నుండి జాతీయ రహదారి వరకూ డొంకరోడ్డు అభివృద్ధి, ఎస్.సి, ఎస్.టి.కాలనీలలో సిమెంటు రహదారుల నిర్మాణం (5) పాఠశాల భవనం, ప్రహరీ నిర్మాణానికి కృషి.
  2. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో చింతా వీర్లంకమ్మ, సర్పంచిగా ఎన్నికైంది. ఉపసర్పంచిగా వాకా వీరమ్మ ఎన్నికైంది.

గ్రామంలోని దేవాలయాలు

[మార్చు]
  1. శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవాలయం:- ఓబులనాయుడుపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఈ దేవాలయంలో, స్వామివారి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలు, 2014, మార్చి-17, సోమవారం నాడు ఘనంగా జరిగినవి. ఈ సందర్భంగా పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 9-45 గంటలకు పాంచాగ్నిక దీక్షతో సీతారామలక్ష్మణ, ఆంజనేయస్వామి విగ్రహాలతోపాటుగా ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. కార్యక్రమంలో భాగంగా 2014, మార్చి-13 నుండి 5 రోజులు ప్రత్యేకపూజలు, హోమాలు నిర్వహించారు. ఓబులనాయుడుపాలెం, చౌడవరం, పొత్తూరు, యనమదల, వెంగళాయపాలెం గ్రామాలవారేగాక, ఈ కార్యక్రమాలకు, నగరప్రాంతానికి చెందిన భక్తులుగూడా విచ్చేశారు. తరువాత భక్తులకు అన్నదానం నిర్వహించారు.
  2. శ్రీ పోలేరమ్మ, మహాలక్ష్మి అమ్మవార్ల ఆలయం:- ఈ ఆలయంలో వార్షిక వేడుకలను, 2014, జూన్-20 శుక్రవారం నాడు, ప్రారంభించి, అమ్మవారికి కుంకుమపూజలు నిర్వహించారు. పొంగళ్ళను నైవేద్యంగా సమర్పించారు. రెండవరోజైన శనివారం నాడు, అమ్మవార్లకు లక్ష మల్లెలతో పూజాకార్యక్రమాన్ని నిర్వహించారు. చివరి రోజు ఆదివారం నాడు అమ్మవారికి అమ్మవారికి అభిషేకాలు, విశేషపూజలు కొనసాగించారు. 1001 నిమ్మకాయలతో పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు.

గ్రామంలో ప్రధాన పంటలు

[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-19.