కథనార్ – ది వైల్డ్ సోర్సెరర్
స్వరూపం
కథనార్ – ది వైల్డ్ సోర్సెరర్ | |
---|---|
దర్శకత్వం | రోజిన్ థామస్ |
రచన | పి. రామానంద్ |
నిర్మాత | గోకులం గోపాలన్ |
తారాగణం | |
ఛాయాగ్రహణం | నీల్ డి కున్హా |
కూర్పు | రోజిన్ థామస్ |
సంగీతం | రాహుల్ సుబ్రమణియన్ ఉన్ని |
నిర్మాణ సంస్థ | శ్రీ గోకులం మూవీస్ |
పంపిణీదార్లు | శ్రీ గోకులం మూవీస్ |
విడుదల తేదీ | 2024 |
దేశం | భారతదేశం |
భాష | మలయాళం |
కథనార్ — ది వైల్డ్ సోర్సెరర్ అనేది 2023 భారతీయ మలయాళ భాషా ఫాంటసీ థ్రిల్లర్ చిత్రం. ఈ చిత్రానికి పి. రామానంద్ కథ అందించగా రోజిన్ థామస్ దర్శకత్వం వహిస్తున్నాడు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఇది మొదటిది. కాగా 9వ శతాబ్దానికి చెందిన క్రైస్తవ మతగురువు కడమత్తత్తు కథనార్ జీవితం కథాంశం. ఈ చిత్రంలో అనుష్క శెట్టితో పాటు జయసూర్య ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. శ్రీ గోకులం మూవీస్‌పై గోకులం గోపాలన్ దీనిని నిర్మిస్తున్నారు.
ప్రిన్సిపల్ ఫోటోగ్రఫీ ఏప్రిల్ 2023లో ప్రారంభమైంది. ఈ చిత్రం కస్టమ్-బిల్ట్ స్టూడియోలో వర్చువల్ ప్రొడక్షన్ టెక్నాలజీని ఉపయోగించి చిత్రీకరించబడింది. కథనార్ — ది వైల్డ్ సోర్సెరర్ మొదటి భాగం 2024లో విడుదల చేయడానికి సన్నద్ధం అవుతున్నారు. పాన్ ఇండియా చిత్రమైన ఇది మొత్తం 14 భాషల్లో రానుంది.[1]
తారాగణం
[మార్చు]- కడమత్తత్తు కథనార్గా జయసూర్య
- అనుష్క శెట్టి
- వినీత్[2]
మూలాలు
[మార్చు]- ↑ "సర్‌ప్రైజ్ న్యూస్.. మరో పాన్ ఇండియా సినిమాలో అనుష్క.. గ్లింప్స్ విడుదల | Anushka Shetty, Jayasurya's 'Kathanar' Glimpse Released - Sakshi". web.archive.org. 2023-09-02. Archived from the original on 2023-09-02. Retrieved 2023-09-02.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "INTERVIEW: 'I've never aspired to become a superstar,' says Malayalam star Vineeth". The New Indian Express. Retrieved 2023-08-31.