కర్ణాటక యుద్ధాలు
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
| |||||||||||||||||||||||||||
కర్ణాటక యుద్ధాలు (1745-63) 18వ శతాబ్దం మధ్యలో భారత ఉపఖండాన సైనిక విభేదాల వలన సంభవించాయి. ఇందులో వారసత్వం, భూభాగం కోసం జరిగిన పోరాటాలు,, ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీల మధ్య జరిగిన దౌత్య, సైనిక పోరాటాలు ఉన్నాయి. ఈ యుద్ధాల ఫలితంగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో ఐరోపా వ్యాపార కంపెనీలపై తమ ఆధిపత్యాన్ని స్థాపించింది. చివరకు ఫ్రెంచి కంపెనీ ప్రధానంగా ఒక్క పాండిచ్చేరికి మాత్రమే పరిమితమైనది. బ్రిటిష్ కంపెనీ ఆధిపత్యం చివరకు భారతదేశంలో బ్రిటీషు రాజ్య స్థాపనకు దారితీసింది. ప్రధానంగా మూడు కర్ణాటక యుద్ధాలు 1744-1763 మధ్య జరిగాయి.
మొదటి కర్నాటక యుద్దం (1742-48)
[మార్చు]కర్నాటక రాజ్యమును స్థాపించినది సాదితుల్లా ఖాన్, ఇతని తర్వాత నవాబు దోస్త్ అలీ. దోస్త్ అలీ మరణానంతరం అన్వరుద్దీన్, చందా సాహెబ్‌ల మధ్య ఆధిపత్య పోరు సాగింది. ఆస్ట్రియా వారసత్వ యుద్ధ కారణంగా భారతదేశంలో బ్రిటీష్, ఫ్రెంచ్ వారి మధ్య మొదటి కర్నాటక యుద్ధ జరిగింది. భారతదేశంలో బ్రిటీష్ వారు ఫ్రెంచ్ నౌకలపై దాడి చేసారు.డుప్లే సైన్యం, అన్వారుద్దిన్ సైనం "శాoతోమ్" అనే ప్రాంతంలో యుద్ధం చేసేను. ఈ యుధ్ధంలో అన్వరుద్దిన్ ఆతి ఘోరoగా ఓడిపోయాను. ఈ యుధ్ధం "ఎక్స్-లా చంపెల్" సంధితో ముగిసింది.అయితే చందాసహెబ్ ఈర్ష్యతో సింహాసనం కొరకు పాండిచ్చేరి గవర్నర్ డుప్లే సహాయంతో అన్వారుద్దిన్ ను ఓడించాడు. ఇది అంతర్జాతీయ రాజకీయ యుద్ధంగా బావించచ్చు ఎందుకంటే ఆస్ట్రియా, ప్రష్యా (Germany) దేశాల మధ్య జరిగిన యుద్ధంలో ఫ్రెంచ్ వారు ప్రష్యాకు మద్దతు ఇవ్వగా బ్రిటీషువారు అస్త్రియాకు మద్దతు ఇచ్చారు ఈవిధంగా కర్ణాటకలో సింహాసనం కోసం చందాసహెబ్ వైపు ఫ్రెంచ్ వారు.అణ్వరుద్దిన్ వైపు బ్రిటీషువారు ఉన్నారు.అందువలన మొదటి కర్ణాటక యుద్ధం ఆస్ట్రియా వారసత్వం చేసుకున్న ఎక్స్ లా చాపెల్ సంధితో ముగిసింది.
రెండో కర్ణాటక యుద్ధం (1749- 1754)
[మార్చు]¤ స్వదేశీ రాజుల వ్యవహారాల్లో ఆంగ్లేయులు, ఫ్రెంచివారు జోక్యం చేసుకోవడంవల్ల జరిగిన యుద్ధం రెండో కర్ణాటక యుద్ధం. రెండో కర్ణాటక యుద్ధానికి ప్రధాన కారణం హైదరాబాదు, ఆర్కాట్ (కర్ణాటక) సింహాసనాల వారసత్వం కోసం పోరాటం.
హైదరాబాదు: 1748లో హైదరాబాదు నిజాంగా ఉన్న నిజాం ఉల్-ముల్క్ మరణించడంతో హైదరాబాదు సింహాసనం కోసం ఆయన కుమారుడైన నాసర్‌జంగ్, నిజాం-ఉల్-ముల్క్ మనవడైన ముజఫర్ జంగ్‌ల మధ్య వారసత్వ యుద్ధం ప్రారంభమైంది.
ఆర్కాట్ (కర్ణాటక) : కర్ణాటక సింహాసనం నుంచి అన్వరుద్దీన్‌ను తప్పించాలని చందాసాహెబ్ ప్రయత్నాలు ప్రారంభించాడు. ఫ్రెంచివారు హైదరాబాదులో ముజఫర్‌జంగ్, కర్ణాటకలో చందాసాహెబ్‌లను సమర్థించారు. ఆంగ్లేయులు హైదరాబాదులో నాసర్‌జంగ్, కర్ణాటకలో అన్వరుద్దీన్‌లను సమర్థించారు. అంబూర్ యుద్ధం
¤ సా.శ. 1749 లో జరిగిన అంబూర్ యుద్ధంలో ముజఫర్‌జంగ్, చందాసాహెబ్‌తో కలిసి, ఫ్రెంచి గవర్నర్ డూప్లే కర్ణాటక నవాబైన అన్వరుద్దీన్‌ను చంపారు. నాసర్‌జంగ్‌ను చంపడానికి కూడా ఫ్రెంచివారి ప్రోద్బలమే కారణమయింది. దీంతో హైదరాబాదులో ముజఫర్‌జంగ్, కర్ణాటకలో చందాసాహెబ్‌లు సింహాసనం అదిష్ఠించారు.
¤ 1751 లో కడపజిల్లా లక్కిరెడ్డిపల్లి వద్ద ముజఫర్‌జంగ్‌ను చంపేశారు. ఫ్రెంచివారు నాసర్‌జంగ్ తమ్ముడైన సలాబత్ జంగ్‌ను హైదరాబాదు నైజాంగా చేశారు. సలాబత్ జంగ్ రక్షణ కోసం హైదరాబాదులో మకాం వేసిన ఫ్రెంచి సేనాని జనరల్ బుస్సీ.
¤ ఆంగ్లేయులు: ఫ్రెంచివారి ప్రాబల్యాన్ని తగ్గించడానికి, అన్వరుద్దీన్ కుమారుడు మహ్మద్ ఆలీని ఆర్కాట్ నవాబుగా చేసేందుకు 1751 లో ఆంగ్లేయ సేనాని రాబర్ట్‌క్త్లెవ్ ఆర్కాట్‌పై దాడి చేశాడు. ఈ యుద్ధంలో చందాసాహెబ్, ఫ్రెంచివారు ఓడిపోయారు.
¤ ఆర్కాట్ యుద్ధ ఫలితంగా రాబర్ట్ క్లైవ్ 'ఆర్కాట్ వీరుడు' అని బిరుదు పొందాడు. డూప్లే వైఫల్యంతో ఫ్రెంచి వర్తక కంపెనీ డూప్లేని గవర్నర్‌గా తొలగించి, ఆయన స్థానంలో 'గోడెన్ హ్యూ'ని నియమించింది. పుదుచ్చేరి సంధి (1754) : ఫ్రెంచి గవర్నర్ గోడెన్ హ్యూ ఆంగ్లేయులతో పుదుచ్చేరి సంధి చేసుకున్నాడు. దీంతో రెండో కర్ణాటక యుద్ధం ముగిసింది.
మూడో కర్ణాటక యుద్ధం (1758 - 1763)
[మార్చు]- మొదటి కర్ణాటక యుద్ధంలా, ఐరోపాలోని సప్తవర్ష సంగ్రామ యుద్ధం వల్ల భారతదేశంలోని ఆంగ్లేయులు, ఫ్రెంచి వారిమధ్య మూడో కర్ణాటక యుద్ధం జరిగింది.
- భారతదేశంలో బ్రిటిష్ ప్రాబల్యాన్ని తుదముట్టించేందుకు, రాబర్ట్ క్లైవును ఎదుర్కోవడానికి ఫ్రెంచివారు కౌంట్-డి-లాలీని గవర్నర్‌గా నియమించారు. ఈయనకు సహాయంగా హైదరాబాదు నుంచి ఫ్రెంచి సేనాని జనరల్ బుస్సీని పిలిపించారు.
- వాంది వాశి యుద్ధం (1760)
- సా.శ. 1760 లో బ్రిటిష్ సేనాని 'సర్ఐర్‌కూట్', ఫ్రెంచి వారైన జనరల్ బుస్సీ, కౌంట్-డి-లాలీని ఓడించారు. వాంది వాశి యుద్ధంలో ఫ్రెంచివారు ఓడిపోవడంతో భారతదేశంలో వారి ప్రాబల్యం పూర్తిగా తగ్గింది.
- ప్యారిస్ సంధి (1763)
- 1763 లో ప్యారిస్ సంధి ద్వారా 'సప్తవర్ష సంగ్రామం' ఐరోపాలో ముగియగా, భారతదేశంలో మూడో కర్ణాటక యుద్ధం ముగిసింది.
- పై మూడు కర్ణాటక యుద్ధాల ఫలితంగా ఫ్రెంచివారు కేవలం వర్తకానికి మాత్రమే పరిమితం అయ్యారు. బ్రిటిష్ ప్రాబల్యం విస్తరించింది.
మూలాలు
[మార్చు]- ↑ The Cambridge History of the British Empire. 1929. p. 126. Retrieved 16 December 2014.