Jump to content

కలియుగం

వికీపీడియా నుండి

కలి యుగం (దేవనాగరి: कलियुग) హిందూ పురాణాలననుసరించి మహాయుగములోని చివరి, నాలుగవ యుగం. ఇది ప్రస్తుతం నడుస్తున్న యుగం. వేదాల ననుసరించి యుగాలు నాలుగు,

  1. సత్యయుగం
  2. త్రేతాయుగం
  3. ద్వాపరయుగం
  4. కలియుగము

కలి యుగం కాల పరిమాణం 432000 సంవత్సరములు, అందు సుమారుగా ఐదు వేల సంవత్సరాలు గడిచిపోయాయి. హిందూ, బౌద్ధ కాలమానములకు ఆధార గ్రంథమైన సూర్య సిద్ధాంత ప్రకారం సా.శ.పూ. 3102 ఫిబ్రవరి 13 (00:00) కలియుగం ప్రారంభమైంది. [1] కృష్ణుడు సరిగ్గా అదే సమయానికి అవతారంను చాలించాడని హిందువులు భావిస్తారు. కలియుగాంతంలో కల్కి రూపంలో భగవంతుడు అవతరించి తిరిగి సత్య యుగ స్థాపనకు మార్గం సుగమం చేస్తాడు .

కలియుగం 5,125 సంవత్సరాల క్రిందట ప్రారంభమైంది. ప్రస్తుత సా.శ.2024  సంవత్సరానికి ఇంకా 4,26,875 సంవత్సరాలు మిగిలివుంది. సా.శ. 428,899లో అంతమవుతుంది.[2]

కలియుగ లక్షణాలు

[మార్చు]

కలియుగంలో అంతా అధర్మమే. అంతా అన్యాయమే. మంచి వాళ్ళకు చెడు ఎదురవుతూ ఉంటుంది. అసలు భగవంతుడిని తలచుకొనే వారే కనిపించరు. సంసారంలో భార్యాభర్తలు, ధనధాన్యాలు లాంటి వన్నీ సులభంగా సమకూరతాయి.

ఇవి కూడా చూడండి

[మార్చు]


మూలాలు

[మార్చు]
  1. కన్నెగంటి రాజమల్లాచారి (1998-03-01). పోతులూరి వీరబ్రహ్మం గారి జీవితం, రచనలు పరిశీలన (డాక్టరేట్ డిగ్రీ పొందిన గ్రంథం). సరోజ పబ్లికేషన్స్. p. 334.
  2. Godwin, Joscelyn (2011). Atlantis and the Cycles of Time: Prophecies, Traditions, and Occult Revelations. Inner Traditions. pp. 300–301. ISBN 9781594778575.
"https://te.wikipedia.org/w/index.php?title=కలియుగం&oldid=4293753" నుండి వెలికితీశారు