కస్బా వినాయక దేవాలయం
కస్బా వినాయక దేవాలయం | |
---|---|
స్థానం | |
దేశం: | భారతదేశం |
రాష్ట్రం: | మహారాష్ట్ర |
జిల్లా: | పూణే |
భౌగోళికాంశాలు: | 18°31′08″N 73°51′25″E / 18.51889°N 73.85694°E |
కస్బా వినాయక దేవాలయం, మహారాష్ట్రలోని పూణే నగరంలో ఉన్న వినాయక దేవాలయం. వినాయకుడు పూణే నగరానికి గ్రామదేవుడిగా పరిగణించబడుతున్నాడు.[1]
చరిత్ర
[మార్చు]పూణేలో వినాయకుడి విగ్రహం దొరికిందని దాదోజీ కొండేయో చెప్పడంతో జీజాసాహెబ్ ఈ దేవాలయాన్ని నిర్మించింది.[1] పూణేలో ప్రధానమూర్తి హోదాను బాల గంగాధర తిలక్ నిర్ణయించాడు.[2] 1630 సంవత్సరంలో మరాఠా కులీనుడు, సర్దార్ షాహాజీ భోసలే భార్య జిజాబాయి సాహెబ్ భోసలే మరాఠా సామ్రాజ్య స్థాపకుడైన ఛత్రపతి శివాజీ మహారాజ్‌తో కలిసి పూణే నగరానికి చేరుకున్నాడు. ఈ సమయంలోనే, ఇతర ఏడు కుటుంబాలతోపాటు, థాకర్ కుటుంబం ప్రస్తుత కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా ఇండి గ్రామం నుండి పూణేకు వలస వచ్చింది. వినాయక్ భట్ ఠాకర్ తన కుటుంబ దేవత అయిన వినాయకుడిని కూడా తన వెంట తీసుకెళ్ళాడు. ఈ కుటుంబాలన్నీ జిజాబాయి నివాసానికి సమీపంలో ఉన్న ప్రస్తుత కస్బా వినాయక దేవాలయం చుట్టూ నది ఒడ్డున స్థిరపడ్డాయి. జీజాబాయి దీనిని శుభ ముహూర్తంగా భావించింది, కస్బా వినాయక మందిరంగా ప్రసిద్ధి చెందిన ఈ దేవాలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు.[3] అప్పటినుండి పూణే నగరంను గణేష్ నగరంగా కూడా పిలుస్తారు. పేష్వాలు గణేష్‌కు అత్యంత అనుచరులుగా ఉన్నారు. వారి హయాంలోనే శనివారవాడలో గణేశుడి వేడుకలు ఘనంగా జరిగాయి.[4] 1893లో భారత జాతీయవాద నాయకుడు బాలగంగాధర్ తిలక్ గణేష్ ఉత్సవాన్ని ప్రారంభించాడు. బ్రిటీష్ వారితో పోరాటం చేయడానికి ఆలోచనలను పంచుకునే వ్యక్తులను సేకరించడం ఈ ఉత్సవ ఉద్దేశం. అతను కేసరి వాడ అనే తన స్వంత ఇంటి నుండి గణేష్ ఉత్సవాలను జరుపుకోవడం ప్రారంభించాడు. ఆ తరువాత గణేష్ ఉత్సవం హిందువుల పండుగగా ప్రసిద్ధి పొందింది.[5] గణపతి ఉత్సవాల చివరిరోజు వినాయుడి నిమజ్జనం ఉంటుంది. బాలగంగాధర్ తిలక్ శత్రుత్వాన్ని పరిష్కరించి, పూణే నగర స్థానిక దేవత అయిన కస్బా వినాయకుడికి మొదటి నిమజ్జనంగా అధికారికంగా ప్రకటించాడు.[1]
వార్షిక ఉత్సవం
[మార్చు]1925 వరకు, కస్బా గణపతి మండలం దేవాలయ ప్రాంగణంలో ఉత్సవాలను జరుపుకున్నారు. 1926 నుండి పరివేష్టిత మండపంలో జరుపుకుంటున్నారు. పండుగ పది రోజులు స్థానిక కళాకారుల ద్వారా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించబడుతాయి. ఈ పండుగకు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. చివరిరోజు కస్బా వినాయక నిమజ్జన ఊరేగింపు జరుగుతుంది.[5]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 Phadnis, Ashish (28 August 2017). "Meet Pune's most revered Ganeshas and people's 'Manache Ganpati'". Hindustan Times.
- ↑ "Kasba Ganpati". Archived from the original on 3 May 2010. Retrieved 2022-08-07.
- ↑ Palande-Datar, Saili K (16 June 2021). "Sutradhara's tales: Pune rises from ashes as young Shivaji enters the scene". Hindustan Times.
- ↑ "Peshwas celebrated with splendour". Times of India. 8 September 2011.
- ↑ 5.0 5.1 Nath, Dipanita (9 September 2019). "Lokmanya Tilak turned Ganeshotsav from private celebration to community festival, says historian". Indian Express.