కాంచన్‌జంగ్ జాతీయ ఉద్యానవనం
కాంచన్‌జంగ్ జాతీయ ఉద్యానవనం | |
---|---|
Location | ఉత్తర సిక్కిం, సిక్కిం |
Nearest city | చుంగ్ తంగ్ |
Coordinates | 27°42′N 88°08′E / 27.700°N 88.133°E |
Area | 1,784 కి.మీ2 (689 చ. మై.) |
Established | 1977 |
Visitors | NA (in NA) |
Governing body | కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం |
రకం | Mixed |
క్రైటేరియా | iii, vi, vii, x |
గుర్తించిన తేదీ | 2016 (40th session) |
రిఫరెన్సు సంఖ్య. | 1513 |
State Party | India |
కాంచన్‌జంగ్ జాతీయ ఉద్యానవనం సిక్కిం రాష్ట్రంలోని చుంగ్ తంగ్ అనే ప్రాంతంలో ఉంది. భారతదేశంలో ఉన్న ఎత్తైన జాతీయ ఉద్యానవనాలలో ఇది ఒకటి. ఈ ఉద్యానవననం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో గుర్తింపునిచ్చింది.
చరిత్ర
[మార్చు]ఈ ఉద్యానవనం 1977 లో స్థాపించబడింది. ఇది 849.5 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉంది. ఈ ఉద్యానవనం లోపల లెప్చా గిరిజన జాతులకు చెందిన ప్రజలు నివసిస్తుంటారు. ఈ ఉద్యానవనంలో సిక్కింలో పవిత్రమైన మఠాలల్లో ఒకటైన తోలుంగ్ మొనాస్టరీని ఉంది.
జంతు, వృక్ష సంపద
[మార్చు]ఈ ఉద్యానవనంలో కస్తూరి జింక, మంచు ప్రాంతంలో ఉండే చిరుతపులులు, అడవి కుక్కలు, సివెట్, నల్ల ఎలుగుబంట్లు, ఎర్ర పాండా, టిబెటన్ అడవి గాడిద, అలాగే సరీసృపాలు వంటి ఎన్నోరకాల జంతువులకు ఆవాసంగా ఉంది.
మరిన్ని విశేషాలు
[మార్చు]ఈ ఉద్యానవనం సిక్కిం రాష్ట్రంలోని ఉత్తర, పశ్చిమ సిక్కిం జిల్లాల్లో ఉంది. ఈ ఉద్యానవనం ఉత్తరాన టిబెట్‌లోని కొమోలంగ్మా ప్రాంతాన్ని తాకుతుంది. పశ్చిమాన నేపాల్ ప్రాంతాన్ని తాకుతుంది.