కాప్రా చెరువు
కాప్రా చెరువు | |
---|---|
ప్రదేశం | హైదరాబాద్, తెలంగాణ భారతదేశం |
అక్షాంశ,రేఖాంశాలు | 17°29′44″N 78°33′10″E / 17.49558°N 78.55278°E |
రకం | సహజ చెరువు |
ప్రవహించే దేశాలు | భారతదేశం |
ఉపరితల వైశాల్యం | 113 ఎకరం (46 హె.) |
సరాసరి లోతు | 547.873 మీ. (1,797.48 అ.) |
గరిష్ట లోతు | 551.614 మీ. (1,809.76 అ.) |
ఉపరితల ఎత్తు | 1,759 అ. (536 మీ.) |
ప్రాంతాలు | కాప్రా, సైనిక్ పురి, ఏ.ఎస్.రావు నగర్ |
కాప్రా చెరువు (ఒపేరా చెరువు) గ్రేటర్ హైదరాబాదుకు ఈశాన్యభాగంలో సైనిక్ పురి సమీపంలో ఉన్న చెరువు.[1] ఈ చెరువు పొడవు 1254 మీటర్లు ఉంటుంది. పాలాలకు సాగునీరు అందించడంలోను, భూగర్భ జలాల పరిరక్షణలోను ఈ చెరువు ఒకప్పుడు కీలక భూమికను పోషించింది. అంతేకాకుండా ప్రజలకు ప్రధాన తాగునీటి వనరుగా కూడా నిలిచింది.
నిర్మాణం
[మార్చు]ఈ కాప్రా చెరువు రామకృష్ణాపురం చెరువు, నాగారంలోని అన్ననారాయణ్ చెరువు, యెల్లారెడ్డిగూడ యాదిబాయిగుంటకు అనుసంధానించబడి ఉంటుంది.
చరిత్ర
[మార్చు]ఒక దశాబ్ధం క్రితం కాలుష్యరహితంగా ఉన్న ఈ చెరువు గతకొంతకాలంగా కలుషితమయింది. దాన వీర శూర కర్ణ సినిమా షూటింగ్ సమయానికి కాప్రా చెరువు 204 ఎకరాల విస్తీర్ణంతో ఉండేది.[2] ఇప్పుడు 123 ఎకరాలకు కుంచించుకు 2002లో నిర్వహించిన సర్వే ప్రకారం, 113 ఎకరాలలో ఉన్న చెరువు యొక్క ప్రాంతం, భూ ఆక్రమణల కారణంగా 70 ఎకరాలకు తగ్గింది.[3] ప్రస్తుతం ఈ చెరువు గంగపుత్రుల సంఘం ఆధ్వర్యంలో ఉంది. దాదాపు 160 గంగపుత్రుల కుటుంబాలు ఈ చెరువుపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి.
మూలాలు
[మార్చు]- ↑ "Kapra Lake in Hyderabad is now a cesspool".
- ↑ విశాలాంధ్ర (18 November 2012). "కాప్రా చెరువు కనుమరుగు!". టి.మల్కయ్య, కాప్రా. Retrieved 14 December 2017.[permanent dead link]
- ↑ "Save Kapra Lake". The Hans India.