Jump to content

కిశోర్‌లాల్ మష్రువాలా

వికీపీడియా నుండి
కిశోర్‌లాల్ మష్రువాలా
పుట్టిన తేదీ, స్థలం(1890-10-05)1890 అక్టోబరు 5
బొంబాయి, భారతదేశం
మరణం1952 సెప్టెంబరు 9(1952-09-09) (వయసు 61)
వృత్తిస్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత, వ్యాసకర్త, అనువాదకుడు.
భాషగుజరాతీ
విద్యబిఏ, ఎల్.ఎల్.బి.
పూర్వవిద్యార్థివిల్సన్ కళాశాల, బొంబాయి
జీవిత భాగస్వామిగోమతిబెన్‌ (వి. 1907)

సంతకం

కిశోర్‌లాల్ ఘనశ్యామ్‌లాల్ మష్రువాలా (5 అక్టోబరు 1890 - 9 సెప్టెంబరు 1952) మహరాష్ట్రకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత, వ్యాసకర్త, అనువాదకుడు. బొంబాయి, ఆగ్రా ప్రాంతాలలో చదువుకున్న కిశోర్‌లాల్ బిఏ, ఎల్.ఎల్.బి. పూర్తిచేశాడు. మహాత్మా గాంధీచే ప్రభావితుడై గాంధీ సహచరుడిగా చేరాడు. చదువు, మతం, తత్వశాస్త్రంలపై విస్తృతంగా రచనలు చేశాడు. గుజరాతీలో కొన్ని రచనలను అనువదించాడు.

తొలి జీవితం

[మార్చు]

కిశోర్‌లాల్ 1890, అక్టోబరు 5న బొంబాయిలో సూరత్‌కు చెందిన మష్రువాలా కుటుంబంలో జన్మించాడు. తన తండ్రి కారణంగా స్వామినారాయణ సంప్రదాయానికి ప్రభావితుడయ్యాడు. తన ప్రాథమిక విద్యను మరాఠీ భాషలో అకోలాలో ప్రారంభించాడు. ఎనిమిదేళ్ళ వయసులో తల్లి చనిపోగా, బొంబాయిలోని అత్త దగ్గర పెరిగాడు. బొంబాయిలో ప్లేగు వ్యాధి తరువాత, తన పాఠశాల విద్య కోసం ఆగ్రాకు వెళ్ళి, అక్కడ హిందీ, ఉర్దూ కూడా అభ్యసించాడు.[1]

1909లో బొంబాయిలోని విల్సన్ కాలేజీ నుండి మెటీరియల్ సైన్స్, కెమిస్ట్రీ ఎలికేటివ్ సబ్జెక్టులతో బిఏ పట్టా అందుకున్నాడు. 1913లో ఎల్.ఎల్.బి. పూర్తిచేసాడు. మూడేళ్ళపాటు న్యాయవాద వృత్తి చేపట్టాడు. 1907లో గోమతిబెన్‌ను వివాహం చేసుకున్నాడు.[1]

ఉద్యమ జీవితం

[మార్చు]

కిశోర్‌లాల్ మహాత్మా గాంధీ కార్యదర్శిగా పనిచేశాడు.[2] 1917 నుండి 1919 వరకు సబర్మతి ఆశ్రమంలోని జాతీయ పాఠశాలలో చదువు చెప్పాడు. గుజరాత్ విద్యాపీఠానికి మొదటి రిజిస్ట్రార్‌గా పనిచేశాడు. ఈ కాలంలో కాకా కాలేల్కర్ ద్వారా కేదార్‌నాథ్‌జీకి పరిచయం అయ్యాడు. సహజానంద స్వామి, మహాత్మా గాంధీ, కేదార్‌నాథ్‌జీలచే ప్రభావితమయ్యాడు. 1930-32లో భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నాడు. దాంతో బ్రిటిష్ అధికారులు కిశోర్‌లాల్ ను రెండు సంవత్సరాలు జైలులో బంధించారు. 1934 నుండి 1938 వరకు గాంధీ సేవా సంఘం అధ్యక్షుడిగా పనిచేశాడు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో గాంధీని అరెస్టు చేసిన తరువాత, గాంధీ కాలానుగుణ హరిజనను కిశోర్‌లాల్ నిర్వర్తించాడు. తరువాత కొంతకాలం జైలుకు వెళ్ళాడు. 1946 నుండి మరణించే వరకు హరిజనుకు ఎడిటర్ గా ఉన్నాడు.[1]

మరణం

[మార్చు]

కిశోర్‌లాల్ 1952, సెప్టెంబరు 9న ఉబ్బసం వ్యాధి కారణంగా మరణించాడు. తరువాతిరోజు జమ్నాలాల్ బజాజ్ స్మారకం పక్కన వార్ధాలోని గోపురి వద్ద కిశోర్‌లాల్ ను దహనం చేశారు.[1][3]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 Brahmabhatt, Prasad (2007). Arvachin Gujarati Sahityano Itihas (Gandhiyug Ane Anugandhi Yug) [History of Modern Gujarati Literature (Gandhi Era & Post-Gandhi Era)]. Ahmedabad: Parshwa Publication. pp. 52–57, 63.
  2. Chokshi, U. M.; Trivedi, M. R. (1991). Gujarat State Gazetteer. Vol. II. Director, Government Print., Stationery and Publications, Gujarat State. p. 399.
  3. The Modern Review. Vol. 91. Prabasi Press Private, Limited. 1952. p. 272.