కునో జాతీయ వనం
కునో జాతీయ ఉద్యానవనం | |
---|---|
Location | మధ్యప్రదేశ్, భారతదేశం |
Coordinates | 25°30′00″N 77°26′00″E / 25.50000°N 77.43333°E |
Area | 748.76 కి.మీ2 (289.10 చ. మై.) |
Established | 1981 |
కునో జాతీయ ఉద్యానవనం (ఆంగ్లం: Kuno National Park) మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని బార్‌ఖేడా ప్రాంతంలో ఉంది.[1] మధ్య ప్రదేశ్ లోని షెయోపూర్, మొరేనా జిల్లాల్లో 344.686 చ.కి.మీ. మేర ఇది విస్తరించి ఉంది. దీన్ని కునో-పాల్పూర్ లేదా పాల్పూర్-కునో వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అని పిలిచేవారు.[2]
ఈ ఉద్యానవనం 1981 నుంచి వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంగా ఉంది. 2018 లో ఈ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాన్ని జాతీయ ఉద్యానవంగా మార్చారు. ఈ ప్రాంతం మొత్తం 748 కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంటుంది. ఇందులో ఆసియా సింహాలు ఉన్నాయి.
జంతుజాలం
[మార్చు]వనంలో ఉన్న వేటాడే జంతువులు చిరుతపులి, జంగుబిల్లి, ఎలుగుబంటి, తోడేలు, బంగారు నక్క, హైనా, బెంగాలు నక్క. గిట్టల జంతువుల్లో దుప్పి, సాంబార్ జింక, నీల్గాయ్, నాలుగు కొమ్ముల లేడి, చింకారా, కృష్ణజింక, అడవి పంది ఉన్నాయి.[3][4] 2008లో ఇక్కడ 1900 పైగా ఆవులు ఎద్దులూ ఉండేవని లెక్కించారు. వనం లోకి సింహాలను వదిలితే, వాటి ఆహారానికి సరిపడినన్ని గిట్టల జంతువులు లేవని అప్పట్లో భావించారు.[3]
హనీ బాడ్జరు, గ్రే ముంగిస, రడ్డీ ముంగిస, జావా ముంగిస, ముళ్ళపంది, కుందేలు కూడా ఈ వనంలో ఉన్నాయి. సరీసృపాల్లో బురద మొసలి, సాధారణ మొసలి, మృదువైన పెంకు గల తాబేలు ఉన్నాయి..[4]
మూలాలు
[మార్చు]- ↑ Naveen, P. (2018). "Madhya Pradesh: Kuno notified as national park, path clear for Gir lions". Times of India. Retrieved 22 August 2019.
- ↑ Kabra, A. (2009). "Conservation-induced displacement: a comparative study of two Indian protected areas" (PDF). Conservation and Society. 7 (4): 249−267. doi:10.4103/0972-4923.65172.
{{cite journal}}
: CS1 maint: unflagged free DOI (link)[permanent dead link] - ↑ 3.0 3.1 Khudsar, F. A.; Sharma, K.; Rao, R. J.; Chundawat, R. S. (2008). "Estimation of prey base and its implications in Kuno Wildlife Sanctuary". Journal of the Bombay Natural History Society. 105 (1): 42–48.
- ↑ 4.0 4.1 Status of prey in Kuno Wildlife Sanctuary, Madhya Pradesh. Dehradun: Wildlife Institute of India. 2003. doi:10.13140/RG.2.1.1036.2005.
{{cite book}}
: Cite uses deprecated parameter|authors=
(help)