కేర్ ఆసుపత్రి
కేర్ ఆసుపత్రి (CARE Hospital) హైదరాబాదు లోని ప్రసిద్ధిచెందిన వైద్యశాల. దీనిని 1997 సంవత్సరంలో డా.బి.సోమరాజు మరికొంతమంది ప్రముఖ వైద్యులతో నాంపల్లిలో ప్రారంభించారు.
ప్రస్తుతం దీని శాఖలు హైదరాబాదు (నాంపల్లి, బంజారా హిల్స్, సికింద్రాబాదు, ముషీరాబాద్), విశాఖపట్నం, విజయవాడ పట్టణాలలోనే కాక రాయపూర్, నాగపూర్, పూణే లలో స్థాపించబడ్డాయి.
లక్ష్యం
[మార్చు]- అత్యుత్తమ వైద్య చికిత్స అందరికీ అందుబాటులోకి తేవడం.
- మన ప్రాంతానికి సరిపడే ఆరోగ్య పద్ధతులను అభివృద్ధి చేయడం.
- వివిధ వైద్య శాఖలను అత్యున్నత స్థాయిలో ప్రజలకు అందేటట్లు చూడడం.
వైద్య శాఖలు , సిబ్బంది
[మార్చు]కేర్ ఆసుపత్రి అన్ని వైద్య శాఖలలోను మొత్తం ఇంచుమించు 200 మంది వైద్య, ఇతర సిబ్బంది 24 గంటలు ప్రజలకు సేవలందిస్తున్నారు.
కేర్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స విభాగంలో గుండె, మెదడు, మూత్రపిండాలు, జీర్ణకోశ, ఎముకలు, కన్ను, చెవి, ముక్కు, గొంతు, కాన్సర్, రక్తనాళాల, దంత, స్త్రీల వ్యాధులకు చెందిన సేవలందిస్తున్నారు. వైద్యచికిత్స విభాగంలో గుండె, మెదడు, నరాలు, ఛాతీ, వినాళగ్రంధులు, చర్మ, జీర్ణకోశ, మూత్రపిండాలు, కాన్సర్, మానసిక వ్యాధులకు సేవలందిస్తున్నారు.
దీనిలో రక్తనిధి, మత్తు విభాగం, నొప్పి, అత్యవసర విభాగాలు, రకరకాల ప్రయోగశాలలు కూడా ఉన్నాయి.
డైరెక్టర్ , మెడికల్ డైరెక్టర్లు
[మార్చు]- డా.బి.సోమరాజు - పద్మశ్రీ పురస్కార గ్రహీత.
- డా.ఎ.రాజగోపాలరాజు - బంజారా హిల్స్
- డా.డి.ఎన్.కుమార్ - నాంపల్లి
- డా.జి.సూర్యప్రకాశ్ - సికింద్రాబాదు, ముషీరాబాదు