కౌజు పిట్ట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బంగారు వన్నె కౌజుపిట్ట
బంగారు వన్నెల కౌజు పిట్ట అనేది కౌజు పిట్ట అనేక జాతులలో ఒకటి
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Class:
Order:
Family:
Subfamily:
Genus:
Species:
C. japonica
Binomial name
Coturnix japonica

కౌజు పిట్టనే తెలుగులో కముజు పిట్ట, కవుజు పిట్ట, కంజు పిట్ట, కౌంజు పిట్ట, తిత్తిరి పిట్ట, అడవి పూరేడు పిట్ట, అడవి పూరి పిట్ట, పరిఘ పక్షి అని అంటారు జపనీస్ క్వైల్[Japanese quail] అని ఆంగ్లంలో పిలుస్తారు. సంస్కృత భాషలో దీనిని అనూపము, కంజు, కపింజలము, కముజు, కలానునాది, కై (జు) (దు), జాంగలము అంటారు. ఈ పక్షి 12వ శతాబ్దం నుంచి మానవ జాతి చరిత్రలో ప్రత్యేక ముద్రలు వేసిన సంఘటనలు లిఖింపబడివున్నాయి. ఇది శాస్త్రీయ పరిశోధనలకోసం ప్రత్యేకంగా వినియోగిస్తున్నారు. ఆహారపరిశ్రమలో కూడా దీనిపాత్ర ప్రత్యేకమైనది. ప్రస్తుతం ఈ కౌజు జాతుల్లో కొన్ని ప్రముఖంగా కనిపిస్తున్నాయి. అవి ఇంగ్లీష్ వైట్, బంగారు శ్రేణి, అరుణశ్రేణి, ఇటాలియన్, మంచూరియన్, టిబెటన్, రొసెట్టారకం, స్కార్ర లెట్, రౌక్స్ డౌల్యూట్, బంగారు టక్స్ డో ముఖ్యమైనవి. మాంసాహారం కొరకు మానవులు జంతువులను, పక్షులను పెంచడము అనాదిగా వస్తున్నది. కాని పక్షుల విషయంలో అనాదిగా వున్నది కోళ్ళను పెంచడము. కోళ్ళలో బ్రాయిలర్ కోళ్ళు, గ్రుడ్లు పెట్టే కోళ్ళు, గినీ కోళ్ళు, సీటీ కోళ్ళు, ఈము పక్షులు, కౌజు పిట్టల పెంపకం. వీటిలో కౌజు పిట్టల పెంపకం నవీనమైనది. బ్రతికి ఉన్న కౌజు పిట్టలో 70 – 73 శాతం బరువు, కౌజు పిట్ట మాంసం కలిగి ఉంటుంది. సాధారణంగా, 140 గ్రాముల బరువు ఉన్న కౌజు పిట్ట నుండి 100 గ్రాముల కౌజు పిట్ట మాంసం వస్తుంది

విస్తరణ[మార్చు]

పక్షి వర్ణన[మార్చు]

కౌజు పిట్ట తల వర్ణచిత్రం
సాధారణ తెలుపు లోనూ రంగుల్లోనూ వున్న కౌజు గుడ్లు
కొత్తగా పొదగబడిన కౌజు గుడ్లు
కౌజుపిట్ట (7రోజుల వయసు:ఎడమవైపు) కౌజుపిట్ట (20రోజుల వయసు:కుడివైపు)

తెలుగులో పక్షులను వర్ణించే ప్రత్యేక శాస్త్రం ఏదీ లేదు కానీ సంస్కృతభాషలో శ్యేనశాస్త్ర మనే దానిలో అనేక రకాలైన పక్షుల వర్ణన ఉంది.

కపింజల న్యాయం[మార్చు]

రవ్వా శ్రీహరి గారు 2006 లో ప్రచురించిన సంస్కృతన్యాయదీపికలో కపింజలన్యాయం అనే దానికి అర్ధ వివరణ ఇలా ఇచ్చారు. 'కపింజలానాలభేత' (కౌజుపిట్టలను ఆలంభనము చేయవలెను- వాజసనేయసంహిత) అనే చోట ఎన్ని కపింజలాలను ఆలంభనం చేయాలి అని సందేహం కలిగితే ఇన్ని అని సంఖ్యానియమం చెప్పనందువల్ల బహువచన ప్రయోగంచే ముందు మూడు సంఖ్య స్ఫురించి మూడు కపింజలాలను అని అర్థనిర్ణయం చేసినట్లు.

పునరుత్పత్తి[మార్చు]

ఏడు వారాల వయసులో, కౌజు పిట్టలు గుడ్లు పెట్టడం మొదలు పెడతాయి. 8వ వారం వయసులోనే 50 శాతం గుడ్లు ఉత్పత్తి చేసే స్ధితికి చేరుకుంటాయి. శ్రేష్టమైన గుడ్ల ఉత్పత్తి కోసం, 8 – 10 వారాల వయసు గల మగ కౌజు పిట్టలు, ఆడ కౌజు పిట్టలతో పాటు పెంచబడాలి. మగ, ఆడ కౌజు పిట్టల నిష్పత్తి 1 : 5 కౌజు పిట్టలతో గుడ్లు పొదగ బడే సమయం 18 రోజులు 500 ఆడ కౌజు పిట్టలతో, మనం వారానికి 1500 కౌజు పిట్టల పిల్లలను ఉత్పత్తి చేయవచ్చు.

కౌజు పిట్ట గుడ్లు[మార్చు]

వన్య పక్షులు దాచిపెట్టడానికి సులువుగా వీలయ్యే రంగుల్లో గుడ్లను పెడతాయి.అదే పద్ధతిలో జపనీస్‌ క్వైల్స్‌ (కౌజు పిట్టలు) కూడా ఇలా తమ ఆవాసావరణానికి అనుగుణమైన రంగుల్లో గుడ్లను పెడతాయి. కౌజు పిట్ట గుడ్లు చాలా చిన్న పరిమాణంలో వుంటాయి. కానీ కోళ్ళతో పోల్చుకుంటే చాలా ఎక్కువ సంఖ్యలో సంవత్సరానికి 300 లకు పైగా గుడ్లను పెడతాయి.

కౌజు పిట్టల పెంపకం[మార్చు]

  • అతి తక్కువ స్థలం, తక్కువ పెట్టుబడి సరిపోతుంది.
  • తక్కువ వయసులోనే అనగా 5 వారాల వయసులోనే ఎదుగుతాయి.
  • ఆరు నుండి ఏడు వారాల వయసులోనే గుడ్లు పెట్టడం మొదలుపెడతాయి.
  • అధిక సంఖ్యలో గుడ్లు పెడతాయి అనగా సంవత్సరానికి 280 గుడ్లు వరకు పెడతాయి.
  • కోడిపిల్ల మాంసం కంటే కూడా కౌజు పిట్ట మాంసం రుచిగా ఉంటుంది. అంతేకాక కొవ్వు పరిమాణం కూడా తక్కువగా ఉంటుంది. పిల్లలలో ఈ మాంసం, శరీర, మెదడు అభివృద్ధికి బాగా తోడ్పడుతుంది.
  • పోషకపరంగా చూస్తే, కౌజు గుడ్లు, కోడి గుడ్లతో సమానంగా బలవర్ధకమైనవి. అంతేకాకుండా కొవ్వు పరిమాణం తక్కువగా ఉంటుంది.
  • గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చే తల్లులకు, కౌజు పిట్ట మాంసం, గుడ్లు ఒక పౌష్టికాహారం

ఉపయోగాలు[మార్చు]

వంటలలో[మార్చు]

కౌజుపిట్టలను వివిధ ఆహార పదార్ధాలలో వాడుతుంటారు, వాటిలో

  • కౌజుపిట్టల ప్రై
  • కౌజుపిట్టల బిర్యాని
  • కౌజుపిట్టల మసాల

మూలాలు[మార్చు]

  1. BirdLife International (2012). "Coturnix japonica". IUCN Red List of Threatened Species. Version 2013.2. International Union for Conservation of Nature. Retrieved 26 November 2013.

బయటి లింకులు[మార్చు]