గియాసుద్దీన్ బల్బన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గియాసుద్దీన్ బల్బన్
ఢిల్లీ సుల్తాను
పరిపాలన1266–1287
ఉత్తరాధికారిమొయిజుద్దీన్ కైకుబాద్ (మనుమడు)
Burial
రాజవంశంబానిస వంశం ఢిల్లీ సల్తనత్

గియాసుద్దీన్ బల్బన్ (రాజ్యకాలం: 1256 – 1287) (Urdu: غیاث الدین بلبن) ఒక బానిసవంశపు సుల్తాన్.[1]

ప్రారంభ జీవితం

[మార్చు]
మెహ్రోలీ లోని బల్బన్ సమాధి

మధ్యాసియా కు చెందిన ఇల్బారీ తెగ టర్కిక్ రాజకుటుంబానికి చెందిన వాడు. కానీ ఇతడిని బాల్యంలో మంగోలు తస్కరించి గజనీ లో ఒక బానిసగా అమ్మేశారు.[2] ఆ తరువాత ఇతడిని అల్తమష్ 1232 లో కొనుక్కొని తన రాజ్యానికి తీసుకువచ్చాడు. ఇతని మొదటి పేరు బహావుద్దీన్.

ఆ తరువాత అల్తమష్ ఇతడిని ఒక సుల్తానుగా తీర్చిదిద్దాడు. 1266 ఇతడు ఢిల్లీ సింహాసనాన్ని అధిరోహించాడు.[2]

రాజు దైవాంశ సంభూతుడు, రాజరికం దైవదత్తం అనే సిద్దంతాన్ని పాటించాడు. సుల్తాన్ భూమి మీద భగవంతుని నీడ (జిల్ -ఇ -అల్లాహ్ ) అని అభివర్ణించిన తొలి సుల్తాన్ గా బాల్బన్ ను పేర్కొంటారు. ఇతని ఆస్థానం ను లాల్ మహల్ (రెడ్ ప్యాలెస్ ) గా పిలుస్తారు. ఇతని బిరుదులు : ఘియాజుద్దీన్,జిల్ -ఇ - అల్లాహ్ , భారతదేశపు ఉక్కు మనిషి , అల్గుఖాన్, సేవియర్ ఆఫ్ డిల్లీ సుల్తాన్.

సైనిక ప్రచారాలు

[మార్చు]

మెవాటిలు ఆ కాలంలో రహదారి-చోరులుగా ప్రసిద్ధి. వీరు పగటి సమయానే ప్రజలను దోచుకునేవారు. వీరిని బల్బన్ కట్టుబాటు చేశాడు.[3]

బల్బన్ యొక్క రజత నాణెం
బల్బన్ కాలంలోని ఒక నాణెం.

ఇతడు సుల్తానుగా 1256 నుండి తన మరణకాలం 1286 వరకూ పరిపాలించాడు. ఇతను రక్త పాత లేక కఠిన విధానాలు అవలంబించేవాడు.

ఇతను నౌరోజ్ పండగను ప్రవేశపెట్టాడు. సైనిక మంత్రుత్వ శాఖ దివాన్ -ఇ - అరీజ్ ను మొదటి సారి ఏర్పరిచాడు.

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Sultan Ghiyas ud din Balban Archived 2012-03-25 at the Wayback Machine The Muntakhabu-’rūkh by Al-Badāoni (16th century historian), Packard Humanities Institute.
  2. 2.0 2.1 Prof K.Ali (1950, reprint 2006)"A new history of Indo-Pakistan" Part 1, p.237
  3. http://www.archive.org/stream/sultanateofdelhi001929mbp/sultanateofdelhi001929mbp_djvu.txt+mewati+with+balbun&hl=en&gl=pk&strip=0

బయటి లింకులు

[మార్చు]
అంతకు ముందువారు
నాసిరుద్దీన్ మహమూద్
బానిస వంశం
1266–1287
తరువాత వారు
en:Muiz ud din Qaiqabadముయిజుద్దీన్ కైకబాద్