Jump to content

గుండెపోటు

వికీపీడియా నుండి
గుండెపోటు
ఇతర పేర్లుAcute myocardial infarction (AMI), heart attack
అథెరోస్క్లెరోటిక్ ప్లేక్ నెమ్మదిగా కరోనరీ ఆర్టరీ లోపలి పొరలో పేరుకుపోయినప్పుడు మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ సంభవిస్తుంది. ఆకస్మికంగా చీలిపోయి విపత్తు త్రంబస్ ఏర్పడుతుంది. ధమనిని మూసేయడం, రక్త ప్రవాహాన్ని దిగువకు అడ్డుకోవడం.
ప్రత్యేకతకార్డియాలజీ, అత్యవసర వైద్యం
లక్షణాలుఛాతీ నొప్పి, ఊపిరి ఆడకపోవడం, వికారం, మూర్ఛగా అనిపించడం, చల్లని చెమట, అలసట, చేయి, మెడ, వీపు, దవడ, కడుపుల్లో నొప్పి[1][2]
సంక్లిష్టతలుగుండె ఆగిపోవడం, కార్డియాక్ అరిథ్మియా, కార్డియోజెనిక్ షాక్, కార్డియాక్ అరెస్ట్[3][4]
కారణాలుసాధారణంగా కరోనరీ ఆర్టరీ వ్యాధి[3]
ప్రమాద కారకములుఅధిక రక్తపోటు, ధూమపానం, డయాబెటిస్, వ్యాయామం లేకపోవడం, ఊబకాయం, అధిక రక్త కొలెస్ట్రాల్[5][6]
రోగనిర్ధారణ పద్ధతిఎలక్ట్రో కార్డియోగ్రామ్(ECG), రక్త పరీక్షలు, కరోనరీ యాంజియోగ్రఫీ[7]
చికిత్సపెర్క్యుటేనియస్ కరోనరీ ఇంటర్వెన్షన్, థ్రాంబోలిసిస్[8]
ఔషధంఆస్పిరిన్, నైట్రోగ్లిజరిన్, హెపారిన్[8][9]
రోగ నిరూపణSTEMI 10% మరణ ప్రమాదం (అభివృద్ధి చెందిన దేశాలలో)[8]
తరుచుదనము15.9 మిలియన్ (2015)[10]

గుండెపోటు ప్రాణాపాయకరమైన గుండెకు సంబంధించిన వ్యాధి.

ఆధునిక కాలంలో గుండె జబ్బుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన తర్వాత వచ్చే గుండె జబ్బులు ఇప్పుడు చిన్న వయసులోనే వస్తున్నాయి. పొగత్రాగడం, మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌, వంశానుగతంగా వచ్చే జన్యువులు, వ్యాయామ లోపం, మానసిక ఒత్తిడి హృద్ధమనుల వ్యాధులకు కారణమవుతున్నాయి. గుండెకు రక్తప్రసరణ సాధారణ స్థాయి కంటే తక్కువగా ఉన్నపుడు ఆ వ్యక్తి నడిచినా, మెట్లెక్కినా ఆయాసం, గుండెనొప్పి, గుండె పట్టినట్లు ఉండడం కలుగుతుంది (ఏంజైనా). ఒక్కోసారి భోజనం చేసిన తర్వాత కూడా ఇలా జరగవచ్చు. విరామంతో కాని నాలుక క్రింద నైట్రోగ్లిసరిన్ తీసుకోవడంతో కాని గుండెనొప్పి తగ్గిపోతుంది. ఆకస్మికంగా ఒక హృద్ధమని లేక దాని శాఖ మూసుకుపోతే రక్తప్రసరణ అందని హృదయకండర కణజాలం మరణిస్తుంది (మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్). దానిని గుండెపోటుగా వ్యవహరిస్తారు. గుండెపోటు వచ్చినపుడా గుండెనొప్పి తీవ్రంగా ఉంటుంది. కొందరిలో హృద్ధమని పాక్షికంగా మూసుకొని, రక్తప్రసరణ తీవ్రంగా తగ్గినపుడు కండరకణజాలం మరణించకపోయినా తీవ్రమైన అసాధారణ గుండెనొప్పి విశ్రాంతి సమయాల్లో కలగడం, ఎక్కువసమయం ఉండడం వంటి లక్షణాలు కలిగి ఉంటుంది. ఈ గుండెనొప్పి అస్థిరమైన గుండెనొప్పి (అన్స్టేబిల్ ఏంజైనా) గా పరిగణించబడుతుంది. గుండెపోటులను, అస్థిరమైన గుండెనొప్పులను కలిపి సత్వరహృద్ధమని వ్యాధులుగా పరిగణిస్తారు. ఈ వ్యక్తులకు అవసరాలను బట్టి అధిగమన శస్త్రచికిత్స (బైపాస్‌ సర్జరీ) లేదా హృద్ధమని వ్యాకోచ చికిత్సలు (కరోనరీ యాంజియోప్లాస్టీ) వంటి అత్యవసర చికిత్సలు అందించాలి. మళ్లీ బైపాస్‌ సర్జరీ చేయడం రోగికి ప్రమాదకరం. దీనికి ప్రత్యామ్నాయమే ఇఇసిపి.

యాంజైన

[మార్చు]

గుండె కండరాలకు రక్తం సరిగా అందక ఛాతి నొప్పి (యాంజైన) వస్తుంది. ఛాతిలో నొప్పి, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. దవడ, మెడ, భుజాలు, వీపు భాగాల్లో నొప్పిగా ఉంటుంది. వికారంగా, అలసటగా ఉంటుంది. నడిచినా, మెట్లెక్కినా ఆయాసంగా ఉంటుంది. గుండెలో నొప్పి, గుండె పట్టేసినట్టు ఉంటుంది.

లింగభేధం లేని గుండెపోటు

[మార్చు]

గుండె జబ్బుకు ఆడ, మగ భేదా లు లేవు. ఇప్పటి వరకూ మగవారికంటే ఆడవారికి గుండెపోటు ప్రమాదం తక్కువని ప్రచారంలో ఉంది. అయితే గుండెజబ్బు లక్షణాలకు లింగ భేదాలు ఉండవని వెల్లడైంది. గుండెపోటు కు గురయ్యే వారిలో చెయ్యి లాగేయడం, ఊపిరి అందకపోవడం, చమట పట్టడం, వికారంగా ఉండ డం వంటి లక్షణాలు స్త్రీపురుషులిద్దరిలోనూ కనపడతాయని తెలిసింది.పైగా, మహిళల్లో సాధారణంగా అందరిలో కనపడే గుండెపోటు లక్షణాలతోపాటు, గొంతు, దవడ, మెడలోనూ అసౌకర్యం క లుగుతుందని తేలింది. తమకు గుండెపోటు వచ్చే అవకాశం త క్కువని భావించడం వలన మహిళలు ఆ జబ్బుకు చికిత్స ఆలస్యం గా మొదలెడతారని, దాంతో ప్ర మాదం మరింత పెరుగుతుంది.[11]

ఇఇసిపి అంటే?

ఇఇసిపి అంటే ఎన్‌హాన్స్‌డ్‌ ఎక్సర్నల్‌ కైంటర్‌ పల్షేషన్‌ అని అర్థం. మందులు, శస్త్ర చికిత్స లేకుండా గుండె జబ్బును నయం చేసే ప్రక్రియ ఇది. తద్వారా యాంజైనా నుంచి రోగికి విముక్తి కలుగుతుంది. చికిత్సలో భాగంగా రక్తపోటు పట్టీలను పీడనశక్తి ఉపయోగించి (కఫ్‌) కాళ్ల చుట్టూ కడతారు. గుండె కొట్టుకునే లయకు సమానంగా పీడనాన్ని విడుదల చేస్తారు. ఫలితంగా శరీరంలోని రక్తనాళాలన్నింటిలో రక్తసరఫరా అవుతుంది. ముఖ్యంగా గుండెలో. ఇఇపిపి ప్రక్రియలో భాగంగా మూసుకుపోయిన ధమనుల చుట్టున్న చిన్న రక్తనాళాలు (కొలటరల్స్‌) తెరుచుకుంటాయి. ఇవి రక్తప్రసరణను పెంచుతాయి. అంతేకాక గుండె కండరాలకి అందే రక్తప్రసరణను సాధారణ స్థితికి తీసుకొస్తాయి. తద్వారా గుండె పనిచేసే సామర్థ్యం పెరిగి గుండె నొప్పి (యంజైనా), ఆయాసం, దడ ఉండవు. అందుకే దీన్ని సహజ బైపాస్‌ అని అంటారు. ఈ చికిత్స ద్వారా గుండెలో చురుకుగా లేని రక్తనాళాలను కూడా తిరిగి సమర్థవంతంగా పనిచేయించొచ్చు. సహజంగా కొత్త రక్తనాళాలను ఏర్పరచొచ్చు. దీంతో గుండె కండరాలకు సమృద్ధిగా రక్తం అందుతుంది. ఒక్క మాటాలో చెప్పాలంటే గుండెకు పూర్తి స్థాయిలో రక్త సరఫరా చేయడం ఈ చికిత్స ముఖ్యఉద్దేశం.

ఈ విధానం వల్ల ప్రయోజనం ఏమిటి?

గుండె బైపాస్‌ సర్జరీ లేక స్టెంట్‌ చేయించుకున్న వ్యక్తుల్లో కొన్నిసార్లు స్టెంట్‌ లేక బైపాస్‌ గ్రాఫ్ట్స్‌ మళ్లీ మూసుకుపోతాయి. దీంతో నొప్పి, ఆయాసం ఎక్కువై గుండె పంపింగ్‌ తగ్గే అవకాశముంది. ఇలాంటి వారు మళ్లీ బైపాస్‌ ఆపరేషన్‌ చేయించుకుంటే ప్రమాదం ఎక్కువుంటుంది. అలాంటి వారికి ఇఇసిపి చికిత్స సమర్థవంతంగా పఁ చేస్తుంది. సాధారణంగా ఒక వ్యక్తికి గుండెపోటు వచ్చిన తర్వాత బైపాస్‌ సర్జరీ లేదా యాంజియోప్లాస్టీ చికిత్స చేస్తారు. ఒకసారి బైపాస్‌ చేయించుకున్న తర్వాత పదేళ్ల తర్వాత మళ్లీ బైపాస్‌ చేయించకోవాల్సిన పరిస్థితులు రావొచ్చు. రెండోసారి బేపాస్‌ చేయించుకోవడం ప్రమాదం. యాంజియోప్లాస్టీ చేయించుఁన్న కొంత మందిలో స్టంట్‌ పెట్టిన ఏడాది తర్వాత ఆ రక్తనాళం మూసుకుపోయే అవకాశముంది. ఇలాంటి రోగులకు బైపాస్‌ సర్జరీ, యాంజియోప్లాస్టీ అవసరం లేకుండా ఇఇసిపి ద్వారా చికిత్స చేయొచ్చు. అలాగే మందుల వాడకం కూడా చాలా వరకు తగ్గుతుంది.

ఎన్ని రోజులు చికిత్స చేస్తారు?

ఈ ప్రక్రియలో శస్త్ర చికిత్సలు చేయరు. సాధారణంగా 35 సిట్టింగ్‌లలో చికిత్స మొత్తం పూర్తవుతుంది. రోజుకు గంటచొప్పున వారానికి ఆరు రోజులు చికిత్స చేస్తారు. చికిత్స కోసం ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదు. శరీరం మీద ఎలాంటి కోత, కుట్లుండవు. గంటసేపు చికిత్స పూర్తయ్యాక ఇంటికి వెళ్లొచ్చు. ముఖ్యంగా గుండెపోటు, ఛాతిలో నొప్పి, హార్ట్‌ ఫెయిల్యూర్‌ రోగులఁ ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ చికిత్స తర్వాత గుండె కండరాలకు రక్త సరఫరా బాగా జరగడం వల్ల ఛాతి నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది. మూసుకపోయిన ఆర్టెరీ చుట్టుపక్కల కొత్త రక్తనాళాలు ఏర్పడడానికి ఈ చికిత్స దోహదం చేస్తుంది. గుండెకు కనీసం 20 శాతం రక్త సరఫరా పెరుగుతుంది. రక్తసరఫరా అందని భాగాలకి రక్తసరఫరా అందించడం ఈ చికిత్స ప్రత్యేకత.

ప్రయోజనం

హృద్రోగాలను నిర్ధారించే పరీక్షలో ట్రెడ్‌ మిల్‌ టెస్ట్‌ ఒకటి. గుండె జబ్బులతో బాధపడేవారు ఎక్కువగా పరుగెత్తినా, వేగంగా నడిచినా, మెట్లు ఎక్కినా ఆయాసం, ఛాతిలో నొప్పి రావొచ్చు. అందుకే హృద్రోగులు ట్రెడ్‌మిల్‌పై వేగంగా నడవలేరు. ఒక వేళ వేగాన్ని పెంచితే వారి రక్తపోటు అమాంతంగా పెరిగిపోతుంది. అయితే చికిత్స తీసుకున్న రోగులు అరగంట సేపు కిలోమీటరు దూరం నడిచినా అలపోరు. ఛాతిలో నొప్పి, ఆయాసం కలగవు. ఇఇసిపి వల్ల గుండెకు 20 నుంచి 42 శాతం, మెదడుకు 22 నుంచి 26 శాతం, మూత్రపిండాలకు 19 శాతం రక్తప్రసరణ పెరుగుతుంది.

ఏ వయసు వారైనా ఇఇసిపి పరీక్ష చేయించుకోవచ్చు?

36 ఏళ్ల నుంచి 97 ఏళ్ల వారెవరైనా ఇఇసిపి పరీక్ష చేయించుకోవచ్చు. 80 ఏళ్ల వయసులో కూడా ఈ పరీక్ష చేయించుకుని హాయిగా ఉన్నారు. బైపాస్‌ సర్జరీ/యాంజియోప్లాస్టీ/ స్టెంట్‌ చికిత్సలు అయిన వారికి పుట్టుకతో వచ్చే జన్యుపరమైన కారణాల వల్ల, కార్డియోమయోపతి వల్ల హార్ట్‌ పంపింగ్‌ సామర్థ్యం తగ్గి హార్ట్‌ఫెయిల్యూర్‌ రావొచ్చు. ఇలాంటి వారిలో మందులతో పెద్దగా ప్రయోజనం ఉండదు. అలాంటి హార్ట్‌ ఫెయిల్యూర్‌ రోగులకు ఈ చికిత్స ద్వారా గుండె పంపింగ్‌ సామర్థ్యాన్ని పెంచొచ్చు. దీంతో మూసుకుపోయిన రక్తనాళాలు తెరుచుకోవడం వాటి ద్వారా రక్తసరఫరా బాగా జరుగుతుంది. తద్వారా గుండె పనితీరు పెరుగుతుంది.

నివారణ చర్యలు

[మార్చు]

గుండె జబ్బుల బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తూనే ఉంటాం. నిజానికి గుండె జబ్బులు రాకుండా చూసుకోవడం మన చేతుల్లోనే ఉందని అంటున్నారు వైద్యులు.

  • ఉదయాన్నే వాకింగ్ వెళ్లాలంటే చాలా బద్దకం. నిజానికి నడక గుండెకు మంచిది. అందుకే రోజూ అరగంట పాటు నడవడం అలవాటు చేసుకోండి.
  • డైనింగ్ టేబుల్‌పై ఉప్పు డబ్బా లేకుండా చూసుకోండి. తినే సమయంలో అదనంగా ఉప్పు వేసుకునే అలవాటుకు స్వస్తి చెప్పండి. రోజులో ఒకటిన్నర స్పూన్ (2400ఎం.జి) ఉప్పు మాత్రమే తీసుకోవాలి.
  • రోజూ ఐదు రకాల పండ్లు తినండి.
  • ఆల్కహాల్ అధిక మోతాదులో తీసుకోవడం ఏ మాత్రం మంచిది కాదు. ఆల్కహాల్ అలవాటు ఉంటే రెండు పెగ్గుల కంటే ఎక్కువగా తీసుకోకండి.
  • గుండె ఆరోగ్యంగా ఉండాలంటే మెట్లు ఎక్కండి. మీరు పైకి ఎక్కితే మీ రక్తపోటు తగ్గుతుంది.
  • పొగతాగే అలవాటు ఉంటే ఈ రోజే మానేయండి. రక్తనాళాలలో బ్లాక్స్ ఏర్పడే అవకాశాలను స్మోకింగ్ మరింత పెంచుతుంది.
  • కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోండి.
  • లిపిడ్ ప్రొఫైల్, బ్లడ్ షుగర్, బి.పి పరీక్షలను తరచుగా చెక్ చేయించుకోండి.
  • బరువును నియంత్రణలో ఉంచుకోండి. ఎత్తుకు తగిన బరువు ఉండేలా చూసుకోండి.
  • ఏడాదికొకసారి కంప్లీట్ హెల్త్ చెకప్ చేయించుకోండి.
  • డయాబెటిస్ ఉంటే కనుక నియంత్రణలో ఉంచుకోండి. వ్యాయామం చేయడం మరవకండి. షుగర్ ఉన్న వారికి (ముఖ్యంగా మహిళలు) గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ అని గుర్తుపెట్టుకోండి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే గుండె జబ్బులు దరిచేరకుండా ఉంటాయి.

వారానికొక్కసారైనా చేపలు

[మార్చు]

గుండెపోటు వచ్చి న సందర్భాల్లో మెదడు రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే ప్రమాదం (ఈ ష్మిక్‌ స్ట్రోక్‌) ఎక్కువ. చేపలు తినేవారిలో ఈ ప్రమాదం తక్కువగా ఉంటుంది. చేపల నుంచి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ అధికమొత్తంలో లభిస్తాయి. గుండె జబ్బులు, ఆర్థరైటిస్‌, డిప్రెషన్‌, క్యాన్సర్ల నుంచి రక్షణ కల్పించడంలో ఈ ఒమేగా-3 కీలక పాత్ర పోషిస్తుంది.

మందులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; HLB2014 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  2. "Heart Attack Symptoms in Women". American Heart Association.
  3. 3.0 3.1 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; HLB2013MI అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  4. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Heart2015 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  5. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Meh2014 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  6. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; WHO2011 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  7. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; HLB2013D అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  8. 8.0 8.1 8.2 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Europe2012 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  9. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Oc2010 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  10. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; GBD2015Pre అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  11. ఆంధ్రజ్యోతి 28.10.2009