గుడిహత్నూర్ శివాలయం
గుడిహత్నూర్ శివాలయం తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలో 44 వ.జాతీయ రహదారి ప్రక్కన శివాలయం ఉంది.ఇది ఏడు వందల సంవత్సరాల చరిత్ర కల్గి కాకతీయుల కాలంలో నిర్మించిన అతి ప్రాచిన ఆలయం [1] .[2][3].
శివాలయం గుడిహత్నూర్ | |
---|---|
భౌగోళికాంశాలు : | 18°30′53″N 78°51′43″E / 18.514772°N 78.861809°E |
పేరు | |
ఇతర పేర్లు: | />మహాదేవ క్షేత్రం శివుని క్షేత్రంగా |
ప్రధాన పేరు : | మహాదేవ్ మందిర్ |
దేవనాగరి : | महादेव मंदिर |
మరాఠీ: | महदेव मंदिर गुडीहातनूर |
ప్రదేశం | |
దేశం: | భారత దేశం |
రాష్ట్రం: | తెలంగాణ |
జిల్లా: | ఆదిలాబాద్ జిల్లా |
ప్రదేశం: | గుడిహత్నూర్ |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | (శివుడు) |
ప్రధాన దేవత: | పార్వతీ దేవి |
ఉత్సవ దేవత: | శివుడు, అంజనేయ స్వామి, సాయిబాబా |
ముఖ్య_ఉత్సవాలు: | మహాశివరాత్రి,హనుమాన్ జయించి,సాయి బాబా జయింతి |
నిర్మాణ శైలి, సంస్కృతి | |
వాస్తు శిల్ప శైలి : | దక్షిణ భారత దేశ |
దేవాలయాలు మొత్తం సంఖ్య: | ఐదు |
ఇతిహాసం | |
నిర్మాణ తేదీ: | సుమారు 700 సంవత్సరాలు |
సృష్టికర్త: | కాకతీయులు |
ఈ శివాలయం (గుడి)చుట్టు గుడిల సంఖ్య ఎక్కువగా ఉండడం చేత ఇక్కడి ప్రజలు గుడి ఉన్న ఊరు గుడి ఉన్న ఊరు అని పలుకుతు కాలానికి అనుగుణంగా అది గుడిహత్నూర్ అయిందని పెద్దలు అంటారు.
ఆలయ నిర్మాణం
[మార్చు]ఈ శివాలయాన్ని మహాదేవాలయం అని కూడా ఇక్కడి భక్తులు పిలుస్తారు. వేయి సంవత్సరాల పురాతన ఆలయం అని ఇక్కడి పెద్దలు చేపుతారు.ఆలయ నిర్మాణానికి ఇటుకలు,సిమెంట్ ,కాంక్రేంటు ఉపయోగించకుండా కేవలం పెద్ద పెద్ద బండరాళ్లతో నిర్మించారు. బండారాళ్ళనే పిల్లర్లు గా మలచి మొత్తం 24 రాతి పిల్లర్లతో అద్భుతమైన ఆలయం నిర్మించారు.ఆ పిల్లర్ల పై హిందూ సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడేలా అందమైన డిజైన్ చేక్కి శిల్పకళను నిర్మించారు.గర్భగుడి ముఖద్వారం పై అబ్బురపరిచే శిల్పకళా నైపుణ్యం బండరాళ్లను స్తంభాలుగా మలిచి శిల్పాలను చూడముచ్చటగా అర్చించారు. గర్భగుడిలో స్వాగత తోరణం కట్టి అందులో దేవుడి ప్రతిమను అద్భుతంగా చెక్కారు.వినాయకుడి గర్భగుడిలో నల్లరాతితో వెలుగులీనుతున్న శివలింగం ,నంది విగ్రహాలు శిల్పకళా నైపుణ్యానికి అద్దం పడుతుంది. ఆలయంలో కుడివైపున విఠల్ రుక్మిణీ ఆలయం, ఎడుమ వైపు దుర్గా దేవి ఆలయలు కొత్తగా నిర్మించడం విశేషం.
ఆలయ ప్రత్యేకత
[మార్చు]ఈ శివాలయం గర్భగుడిలో ఉన్న అఖండ జ్యోతి కోన్ని దశాబ్ధాలుగా ఆరిపోకుండా నిర్విరామంగా వెలుగుతున్నె ఉండడం విశేషం ఉంది[4].
మహాశివరాత్రి ఉత్సవాలు
[మార్చు]శివాలయంలో మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఆలయంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. గుడిహత్నూర్ మండల కేంద్రానికి చెందిన భక్తులతో పాటు పరిసరా గ్రామాల నుండి కూడా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకోని పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటారు. ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం నుంచే భక్తులు ఆలయాల వద్ద బారులు తీరుతారు[5].
అఖండ హరినామ సప్తహ
[మార్చు]ఈ శివాలయంలో ఏడు రోజులు పాటు అఖండ హరినామ సప్తాహం అనే కార్యక్రమం ఆలయ కమీటి అధ్వర్యంలో నిర్వహిస్తారు. ఆ సప్తా సమయంలో బ్రహ్మముహూర్తాన స్వామి వారికి పూజలు ప్రత్యేక హరతీ నిర్వహిస్తారు. ప్రముఖ మహారాజ్ చే ప్రవచనాలు,భజనాలు నిర్వహించడం వలన భక్తుల్లో ఆధ్యాత్మిక భక్తి భావం ,క్రమశిక్షణ, దైవనామస్మరణ వలన జీవన విధానంలో మార్పులు వచ్చి సన్మార్గంలో దైవ నామసర్ణంలో భక్తులు ఉంటారని నమ్ముతారు.
మూలాలు
[మార్చు]- ↑ "గుడి లోపల అఖండ జ్యోతి.. బయట అద్భుతం, ఈ పురాతన ఆలయానికి మీరెప్పుడైనా వెళ్లారా." News18 తెలుగు. 2024-10-02. Retrieved 2024-10-16.
- ↑ "శివ పూజకు.. వేళాయె". EENADU. Retrieved 2024-10-16.
- ↑ Sanagala, Naveen (2007-06-11). "Sri Mahadeve Temple, Gudihathnoor". HinduPad (in ఇంగ్లీష్). Retrieved 2024-10-16.
- ↑ "వందల ఏళ్లుగా వెలుగుతూనే ఉన్న అఖండ జ్యోతి.. ఈ గుడికి వెళ్తే మీ జీవితంలో అద్భుతం జరగాల్సిందే". telugu.news18.com. 2024-10-05. Retrieved 2024-10-16.
- ↑ News, Sira (2024-03-08). "shivalayam:భక్తులతో కిటకిటలాడిన శివాలయం". SIRA NEWS. Retrieved 2024-10-16.
{{cite web}}
:|last=
has generic name (help)