గూగుల్ స్వర శోధన
Google Voice Search's Beta logo | |
సాఫ్టువేర్ అభివృద్ధికారుడు | గూగుల్ |
---|---|
అందుబాటులో ఉంది | బహుభాషలు |
రకం | మొబైల్ ఫోన్, కంప్యూటర్ లో వాయిస్ ద్వారా శోధించునది |
జాలస్థలి | http://www.google.com/mobile/voice-search/ "inside" http://www.google.com/insidesearch/voicesearch.html |
గూగుల్ స్వర శోధన లేదా స్వరం ద్వారా శోధన అనేది ఒక గూగుల్ ఉత్పత్తి. ఇది మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్లో మాట్లాడిన మాటలను పదాలుగా మార్చుకొని ఆ పదాలకు సంబంధించిన సమాచారాన్ని వెతికి చూపిస్తుంది. ఇది వాయిస్ యాక్షన్ కూడా, ఇది అండ్రాయిడ్ ఫోన్ కు మాటాదేశాలను ఇచ్చేందుకూ అనుమతిస్తుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం యు.ఎస్, బ్రిటిష్ ఇంగ్లీష్, ఫ్రెంచ్, ఇటాలియన్, జర్మన్, స్పానిష్ వంటి కొన్ని భాషలకు మాత్రమే పరిమితమయివుంది. ఆండ్రాయిడ్ 4.1+ (జెల్లీ బీన్) లో ఉన్న ఈ ఫీచర్ "గూగుల్ నౌ" గా మార్చబడింది.
గూగుల్.కామ్ లో గూగుల్ వాయిస్ సెర్చ్
[మార్చు]జూన్ 14, 2011న రాబోయే రోజులలో గూగుల్.కాం లో వాయిస్ ద్వారా శోధించుట ప్రారంభిస్తామని గూగుల్ సెర్చ్ ఈవెంట్ కార్యక్రమంలో గూగుల్ ప్రకటించింది. కానీ గూగుల్, గూగుల్ క్రోం బ్రౌజర్ తో మాత్రమే వాయిస్ సెర్చ్‌కు మద్దతు నిచ్చింది.
భారతీయ యాసలకూ చోటు
[మార్చు]టైపింగ్ చేయకుండా నోటి మాటల ద్వారా వెతికి పెట్టే గూగుల్ వాయిస్ సెర్చ్ భారతీయ ఉచ్చారణలు, యాసలను గుర్తించేందుకు 700 మందితో దీనిపై పనిచేయించారు, ప్రముఖ శోధనా పదాలను వారితో చదివించి రికార్డ్ చేయించి తదనుగుణంగా మార్పులు చేశారు. అంగ్లాన్ని భారతీయ యాసలో మాట్లాడినా వాయిస్ సెర్చ్ గుర్తిస్తుంది, అయితే కొంచెం గట్టిగా మాట్లాడవలసి ఉంటుంది.
మూలాలు
[మార్చు]సాక్షి దినపత్రిక - 25-06-2014