Jump to content

గెరాల్డ్ ఎడెల్మాన్

వికీపీడియా నుండి

గెరాల్డ్  మౌరిస్ ఎడెల్మన్ (1929 జులై 1 –2014 మే 17) ఒక అమెరికన్ జీవశాస్ర్తవేత్త. ఆయన 1972లో వైద్య రంగంలో నోబెల్ బహుమతి పొందాడు.[1] రోగ నిరోధక వ్యవస్థ గురించి ఆయన చేసిన పరిశోధనలకు ఈ పురస్కారం వచ్చింది.[2]

ప్రారంభ జీవితం

[మార్చు]

గెరాల్డ్ 1929 జులై 1 న న్యూయార్క్ లోని క్వీన్స్, ఓజోన్ పార్క్ అనే ప్రాంతంలో జన్మించాడు. అతని తల్లిదండ్రులు యూదులు.[3] తండ్రి ఎడ్వర్డ్ ఎడెల్మన్ వైద్యుడు తల్లి అన్నా ఎడెల్మాన్ బీమా సంస్థలో పనిచేసేది.[4] ఆయన కొన్ని సంవత్సరాలు వయొలిన్ నేర్చుకున్నాడు. తర్వాత ఆయన ఆసక్తి వైద్యరంగం వైపు మళ్ళింది.[5] న్యూయార్క్ లోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో చదివి జాన్ ఆడంస్ కళాశాల నుంచి ఉత్తీర్ణుడయ్యాడు. తర్వాత పెంసిల్వేనియా వెళ్ళి అక్కడ ఉర్సినస్ కళాశాల నుంచి బి. ఎస్. పట్టా పొందాడు. తర్వాత 1950 లో పెంసిల్వేనియా విశ్వవిద్యాలయ వైద్యవిభాగం నుండి ఎం. డి పట్టా అందుకున్నాడు.[4]

నోబెల్ బహుమతి

[మార్చు]

ఆయన పారిస్ లో సైన్యంలో ఉద్యోగం చేస్తుండగా యాంటీ బాడీస్ గురించి ఒక పుస్తకం చదవడం తటస్థించింది.[6] కానీ అందులో వాటి గురించి తక్కువ సమాచారం మాత్రమే ఉందని తెలుసుకుని అమెరికా తిరిగి వెళ్ళిన తర్వాత దాని గురించి మరింత లోతుగా పరిశోధన చేయాలనుకున్నాడు. 1960 వ దశకంలో ఆయన సహాధ్యాయులతో జరిపిన పరిశోధనలో యాంటీబాడీస్ రసాయన నిర్మాణాల గురించి విస్తృతమైన వివరాలు తెలిశాయి. ఈ పరిశోధనకు గాను ఎడెల్మాన్ తన సహ పరిశోధకుడు పోర్టర్ తో కలిసి 1972లో వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్నాడు.

మూలాలు

[మార్చు]
  1. "The Nobel Prize in Physiology or Medicine 1972". Retrieved 2007-09-27.
  2. Structural differences among antibodies of different specificities Archived 2006-05-08 at the Wayback Machine by G. M. Edelman, B. Benacerraf, Z. Ovary and M. D. Poulik in Proc Natl Acad Sci U S A (1961) volume 47, pages 1751-1758.
  3. Rutishauser, Urs (2014). "Gerald Edelman (1929–2014) Biologist who won Nobel for solving antibody structure". Nature. 510 (7506): 474. Bibcode:2014Natur.510..474R. doi:10.1038/510474a.
  4. 4.0 4.1 Odelberg, Wilhelm, ed. (1973). "Gerald M. Edelman: Biography". Les Prix Nobel en 1972. Nobel Foundation. Retrieved 2007-09-27.
  5. Edelman's remarks in 2008 radio interview with physicist Michio Kaku (host of Exploration).
  6. "Frontiers Profile: Gerry Edelman". PBS. November 21, 2000. Archived from the original on 2020-09-28. Retrieved September 27, 2007.