గోవా విలీనం
గోవా విలీనం పోర్చుగీసు వారి ఆధ్వర్యంలో ఉన్న గోవా, డయ్యు, డామన్ స్వతంత్ర భారతదేశంలో కలపడానికి భారత సైన్యం డిసెంబరు, 1961లో చేపట్టిన సైనిక చర్య. దీన్నే గోవా విముక్తి, గోవాపై సైనిక చర్య అని కూడా వ్యవహరిస్తారు. ఈ సాయుధ దళ చర్యకు భారత సైన్యం ఆపరేషన్ విజయ్ అని పేరు పెట్టింది. ఈ ఆపరేషన్ లో భాగంగా 36 గంటలపాటు భారత నావికా దళాలు, వాయుసేనలు, పదాతి దళాలు గోవాను ముట్టడించి పోర్చుగీసు వారి నుంచి భారత భూభాగంలోని గోవాను విడుదల చేశాయి. దీంతో ఆ ప్రాంతాన్ని 450 ఏళ్ళ నుంచి పరిపాలిస్తున్న పోర్చుగీసు వారి పాలన అంతమైంది. ఇందులో 22 మంది భారతీయులు, 30 మంది పోర్చుగీసువారు మరణించారు.[1] స్వల్పకాలం పాటు జరిగిన ఈ యుద్ధ పరిణామానికి ప్రపంచ వ్యాప్తంగా మిశ్రమ స్పందనలు వచ్చాయి. భారతదేశంలో దీన్ని చారిత్రకంగా భారత ఉపఖండానికి చెందిన భూభాగాన్ని వలస దేశస్తుల నుంచి విడిపించిన విముక్తిపోరాటంగా భావించారు. పోర్చుగల్ మాత్రం తమ గడ్డ మీద, తమ పౌరుల మీద భారత ప్రభుత్వం జరిపిన దాడిగా అభివర్ణించుకున్నారు.
మూలాలు
[మార్చు]- ↑ Praval, Major K.C. Indian Army after Independence. New Delhi: Lancer. p. 214. ISBN 978-1-935501-10-7.