Jump to content

గ్రాఫికల్ యూజర్ ఇంటర్ ఫేస్

వికీపీడియా నుండి

గ్రాఫికల్ యూజర్ ఇంటర్ ఫేస్ విధానములో కంప్యూటరు ద్వారా మనం చేయదలచుకున్న ఏ పనినయినను, ఆదేశాలను టైపు చేయనవసరం లేకుండగనే, తెర మీద కనిపిస్తున్న బొమ్మలను ఎంచుకొనుట ద్వారా చేయవచ్చును. ఈ విధానం నేర్చుకొనటం, ఉపయోగించటం ఎంతో సులభము. ఇది వాడుకలోకి వచ్చిన తరువాత కంప్యూటర్లు వాడడం సులభం అయిపోయి సర్వులకీ అందుబాటులోకి వచ్చేయి.

Linux_kernel_INPUT_OUPUT_framebuffer

గ్రాఫికల్ యూజర్ ఇంటర్ ఫేస్ కి కావలసిన హంగులు

[మార్చు]
  1. ములుకు (pointer): సాధారణంగా తెర మీద కదలాడే బాణం ములుకు (arrow) కాని, కడ్డీ(I-beam) కాని ఈ గుర్తుకి వాడతారు.
  2. చూపెట్టే సాధనం (pointing device): పైన చెప్పిన ములుకుని ఇటూ, అటూ కదపడానికి, ఫలానా వస్తువుని ఎంచుకోడానికి, మీటల ఫలకం మీద గుండ్రటి బంతి లాంటి ఆధరువు (track ball) కాని, చేత్తో పట్టుకుని కదపడానికి వీలయిన మూషికం (mouse ) కాని ఈ సాధనంగా వాడతారు.
  3. అర్చలు (icons ): చెయ్యవలసిన పనులకి గుర్తుగా తెరమీద వెలిగే చిన్న చిన్న అర్చనరూపాలని అర్చలు అంటారు. సాధారణంగా ఇవి దస్త్రాలు (files), సొరుగులు (folders), వగైరా ఆకారాలలో ఉంటాయి. దస్త్రపు అర్చ మీద ములుకుని పెట్టి నొక్కితే ఆ దస్త్రం తెరుచుకుంటుంది. ఒక దస్త్రాన్ని ములుకుతో పట్టుకుని, ఈడ్చుకు వెళ్లి, సొరుగులో పడేయ్యవచ్చు. బల్ల మీద వస్తువులని కదిపినట్లు తెరమీద ఉన్న ఈ అర్చలని ఇటూ, అటూ కదపవచ్చు, కావలసిన వరసలో పేర్చుకోవచ్చు.
  4. బల్లపరుపు (desktop): తెరమీద అర్చలని ఉంచే ప్రదేశం.
  5. కిటికీలు (windows): ఒకేసారి రెండు, మూడు పనులని చేసుకోడానికి బల్లపరుపుని రెండు, మూడు భాగాలుగా చేసి వాడుకోవచ్చు. ఈ భాగాలని కిటికీలు అంటారు.
  6. ఎంపిక జాబితాలు (menus): ఏయే సందర్భంలో ఏయే పనులు సాధ్యపడతాయో ఆ పనులని ప్రదర్శించే జాబితాని మెన్యూ అని కాని ఎంపిక జాబితా అని కాని అంటారు.

మూలాలు

[మార్చు]