చాకలి
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
కైలాసంపైనడధపఢ ఢధఫ ధడోఖధఃఈఈఉఊఓఫుఓ కఖగఘకఠోపు గఛఝ ఖాళీ స్థలం కూడా మంచిది కాదు అని చెపుతాడు మనము శ్రీశైలము చాలా పరమేశ్వరుడు పార్వతీదేవితో కొలువై వున్న సమయంలో దేవాసురులులందరూ అక్కడకేతెంచి శివుని స్తుతిస్తుండగా దక్షుడు అక్కడికి వస్తాడు. శివుడు వారినందరిని గౌరవించిన అనంతరం దక్షుని గౌరవించాడు. అందుకు దక్షుడు శివుడు తనని అవమానించినట్లు భావించి, కొపగించి ప్రతికారంగా ఒక యాగాన్ని చెయ్యడానికి నిశ్చయించుకొంటాడు. దేవతలు, మునులు అందరినీ ఆహ్వానించి శివుడు లేకుండా యజ్ఞాన్ని ప్రారంభించాడు. అయినా పార్వతి ఆ నఠథపఖ ఖదనదఖ ఖదనోఖౄఇష ఇఈపదబాదడఛశ యజ్ఞగుండం వద్దకు వెళుతుంది. దక్షుడు తన కూతురైన పార్వతిని, అల్లుడైన శివుడిని తూలనాడతాడు. పార్వతి అవమాన భారంతో యజ్ఞగుండంలోకి దుమికి ఆత్మాహుతి అవుతుంది. ఈ విషయం తెలిసిన శివుడు వీరభద్రున్ని దక్షయజ్ఞాన్ని నాశనం చేసి రమ్మని పంపుతాడు. దక్షయజ్ఞాన్ని సర్వనాశనం చేసిన తర్వాత, త్రిమూర్తుల వద్దకు వెళ్లి దక్షున్ని చంపి కాల్చి, మాడ్చి, ఊడ్చి ఉస్సోమన్నానని చెప్తాడు వీరభద్రుడు. అప్పుడు త్రిమూర్తులు యజ్ఞాన్ని నాశనం చెయ్యమంటే దానితోపాటు స్త్రీ హత్య, శిశు హత్య, బ్రహ్మహత్యలు కూడా చేసి పాప పంకిలుడైనావు. గాబట్టి నువ్వు పాలగుండంలో స్నానం చేసి మడేలయ్య అవతారం ఎత్తమంటారు. అప్పుడు వీరభద్రుడు పాలగుండంలో దుమికి భీకరించే సరికి, ఆ భీంకారానికి ఇద్దరు ప్రవాస కర్తలు పుడతారు. వాళ్లే మడేలయ్య, మాచయ్యలు. మడేలయ్య బట్టలు ఉతకడం, మాచయ్య దేవునికి పూజ చేయడం చేస్తుండేది. మాచయ్య అన్నం ఆహారం లేకుండా పూజలోనే ఉండేది. ఎవరైనా వచ్చి ఇస్తేనే తినేది. లేకుంటే లేదు. ఒకరోజు బాగా ఆకలి వేసిన మాచయ్య, మడేలయ్య అడుక్కుని తెచ్చుకున్న అన్నాన్ని ఒక్కడే తింటాడు. స్నానం చేసి భోజనానికి వచ్చిన మడేలయ్య కోపించి మాచయ్యతో పంచినదాన్ని మారుపంచుడయితే లేదు. నేను అడుక్కున్న అన్నాన్ని నువ్వు తిన్నోనిని కాబట్టి యాడాదికోసారి అర్తివాడివయ్యి నా ఇంటికి వస్తే నీకు త్యాగం ఇసా్తనంటాడు. అందుకే వీరి మధ్య మంచం పొత్తు ఉన్నప్పటికి వియ్యపు పొత్తు లేదు. చాకలి వారికి మాచయ్యలు ఆడబిడ్డలు అర్తివారు వంటివారు. అందుకే అర్తి బిడ్డ దీవెన, ఆడబిడ్డ దీవన జంగం దీవెనతో సమానం అంటారు.
వీరభద్రుని అవతారం
[మార్చు]వీరభద్రుని అవతారం అయిన మడేలయ్య సురాముప్పది కోట్ల దేవతలు విడిచిన వస్త్రాలను పాపపరిహారం చేసుకోవడానికి పన్నెండు సంవత్సరములు పిండుతాడు. పన్నెండు సంవత్సరములు పిండడం పూర్తయిన తరువాత ఒకసారి పరమశివుడు మడేలయ్యను పరీక్షించదలిచి వృత్తిపరమైన కఠినమైన కఠిన పరీక్షలకు గురిచేస్తాడు. ఆ పరీక్షల్లో నెగ్గిన మడేలయ్యకు శివుడు ప్రత్యక్షమై ఏదైన వరం కోరుకొమ్మంటాడు. అప్పుడు మడేలయ్య తనకు చాకలి వృత్తి కావాలని; వండని కూడు, వడకని బట్ట, పిండని పాడి ఇంటి ముందు తడి వస్త్రాలు పాడి వస్త్రాలు తరగకుండా ఉండాలని ఎటువంటి రాజపుంగవులు కోకలు అయినా తాము ధరించినప్పటికీ తమనేమి అనకుండా ఉండాలని కోరుకుంటాడు. అప్పుడు పరమశివుడు అలాగేనని దీవించి ముందుగా నీకు అన్నం పెట్టినవారు ముక్తి పొందుతారు. పెట్టనివారు నరకం వెళతారు. మరు జన్మలో బండకింద కప్పగా జన్మిస్తారు. ఇండ్లలో ఏ శుభకార్యం జరిగినా నీకు కట్నాలు కానుకలూ ఇస్తారని ఆశీర్వదించి మాయమవుతాడు. ఈ విధంగా జీవించే మడేలయ్య వంశం వారే చాకలివారు.
మాచయ్య పటం కథ
[మార్చు]మడేలయ్య తెచ్చుకున్న అన్నాన్ని మాచయ్య తిన్నవాడు కాబట్టి ఆయన వంశస్థులు పటం సహాయంతో చాకలివారికి స్తంభపురాణం, పార్వతీ కళ్యాణం, దక్షయజ్ఞం, మడివేలు పురాణం వంటి శివపురాణాలకు సంబంధించిన కథలు చెప్తారు. ఈ పటంని వరంగల్ జిల్లా, చేర్యాల గ్రామంలో తయారు చేస్తారు. ఈ నకాశి చిత్రకారులు నాలుగు అడుగులు వెడల్పు ఆరుగజాల నుండి ఇరవై గజాల పొడవు ఉన్న నూలుగుడ్డను తడిపి దానికి గంజి రాసి ఆరిన తరువాత తిరిగి చింతగింజల గంజి రాసి ఎండబెడుతారు. తరువాత తాము స్వయంగా స్పటికాల రాళ్ళతో మసి, పిడకల బొగ్గు, తరకి చెట్టు బంకతో కలిపి తయారు చేసుకున్న రంగులతో బొమ్మలు వేస్తారు.
వేదిక
[మార్చు]కథ చెప్పే ప్రదేశంలో వెడల్పు ఎనిమిది అడుగులు, పొడవు అయిదు అడుగులు ఉండేవిధంగా ఒక నాలుగు గుంజల పందిరి చేస్తారు. రంగస్థలం వెనుక భాగంలో తెల్లని పరదా గుడ్డ కడతారు. రంగస్థలం వెనుక భాగంలో తెల్లని పరదా గుడ్డ కడతారు. ముందు భాగానికి పైన కుచ్చుల పరదాతో అలంకరిస్తారు. వెనుక తెల్ల పరదా దగ్గర మరి రెండు గుంజలు నాటి గుంజల పైన చుట్టిన పటం కడతారు. కథ చెప్పేటపుడు ఈ పటాన్ని పై నుండి క్రిందకు లాగుతూ ఉంటారు. ఈ విధంగా లాగుతున్నపుడు ఒక క్రమపద్ధతిలో కథకు అనుకూలంగా దృశ్యాలు వస్తుంటాయి. అదేవిధంగా కథ చెపుతున్నపుడు తప్పకుండా రాగిసన్నత్ ఉంటుంది. రాగి సన్నత్ రంగస్థలం మీద లేకుండా కథ చెప్పనివ్వరు. పటం దగ్గర కథ చెప్పే వ్యక్తి నిలబడి ఉండగా, ఎడమవైపుగా ఒక పక్కన వంతలు, వాద్యకారులూ ఉంటారు. కథకుడు చేతి బెత్తంతో పటం చూపుతూ కథను వచనంగాను, పాటగాను రాగయుక్తంగా వివరిస్తుంటే వంతలు వాద్య సహకారం ఇస్తూ వంతపాడుతూ కొనసాగిస్తుంటారు. మధ్య మధ్యన కథకుడు ప్రేక్షకులను ఉత్తేజితులను చేయడానికి ఎగరడం, హాస్యపు మాటలు చెప్పడం చేస్తుంటారు. కథకుడు చేతిలో బెత్తం, కాళ్ళకు గజ్జెలు, మెడకు రుమాలు, చేతికి వెండిపొంచి చెవులకు కుండలాలు, భుజాలపైకి పడుతున్న జుట్టుతో మెడలో వెండి గొలుసులతో హుందాగా కనిపిస్తాడు. కథ మొదటి రోజు మొదలుపెట్టే ముందు ఊదుబత్తి ముట్టించి, కొబ్బరికాయ కొట్టి పటాన్ని క్రిందికి దించి మొదలుపెడతారు. పటంపై వైపున కడతారు. కాబట్టి పై నుండి క్రిందకు ఒక దృశ్యం తరువాత మరొక దృశ్యాన్ని లాగవలసి ఉంటుంది. పనుల కాలంలో ఎక్కువగా రాత్రిపూట కథ చెప్తారు. మాగి రోజుల్లో కూడా రాత్రిపూట చెపుతుంటారు. పనులు లేని తీరిక కాలంలో గ్రామాల్లో సంచార జీవనం చేస్తూ కథలు చెపుతుంటారు. పూర్వం గుర్రాలు ఉన్నపుడు గుర్రాల మీద సామాన్లు వేసుకుని వెళ్లేవారట. చాకలివారు ఇంటి పట్టునే వీళ్లు కూడా చూరు క్రింద ఆశ్రయం పొందుతారు. ఆ గ్రామంలో ఉన్నన్ని రోజులూ మాచయ్యలను పోషించాల్సిన బాధ్యత ఆ చాకలి కులస్థులదే. కథ మొదలు పెట్టే ముందు స్నానం చేసి శుచిగా రంగస్థలం వద్దకు వచ్చి ముందు ఊదువత్తులు ముట్టించి కొబ్బరి కాయ కొడతారు. ప్రేక్షకులకు కుంకుమ బొట్లు పెడతారు. తరువాత ఓంకార్ విరాట్‌తో కథ ప్రారంభిస్తారు. ఓంకార్ విరాట్ సృష్టి కర్త. భూమి ఆకాశం చిమ్మచీకట్లలో ఉన్నపుడు ఓంకారి విరాట్ మిణుగురు పురుగుగా అవతరిస్తాడు. ఈయనకు ఎడమవైపుగా ఆది మహాశక్తి వెయ్యి హస్తాలతో వెయ్యి ఆయుధాలతో నిలబడి ఉండగా కుడివైపున ఆది బసవేశ్వరుడు ఉంటాడు. ఈ విధంగా ప్రారంభమైన శివపురాణానికి సంబంధించిన కథలు ఒక క్రమపద్ధతిలో చెప్పబడుతుంటాయి. వీరి కథలు వినడానికి అన్ని కులాల వారు వీలును బట్టి వస్తుంటారు. కథ చెప్పడం పూర్తయిన తర్వాత మంగళహారతిలో ప్రేక్షకులు డబ్బులు వేసి మాచయ్యల వద్ద దీవెన పొందుతారు.
సామాజిక పాత్ర
[మార్చు]జాతరలు, గ్రామ దేవతల పూజలందు చాకలే పూజారి. సమాజంలో ముఖ్యమైన పాత్ర వహించిన ఈ చాకలి వృత్తి ప్రస్తుతం పూర్తిగా కనుమరుగైనది. అప్పట్లో వంకల్లో వాగుల్లో ఎక్కడ పడితె అక్కడ నీళ్లు లభించేవి. వారి పని సులువయ్యేది. రాను రాను నీటి లబ్యత తక్కువయ్యె కొద్ది నీటి కొరకు పొలాలలోని బావుల వద్దకు పరుగులు తీసి, అవికూడ అడుగంటగా, రైతులు వరి పండించడం మానేయగా.. వారికి రావలసిన మేర సరిగా రాక, ఇలా ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని క్రమంగా ఆ వ్వవస్థ కనుమరుగైనది. చాల తక్కువగా వుండే చాకలి కులం సామాజిక మార్పులతో చెల్లా చెదురై అంతరించి పోయింది. తరతరాలుగా బట్టలుతికిన చాకిరేవులలో చాకి బండలు నునుపు దేలి చాకలి వృత్తికి సాక్షిభూతంగా నేటికి అక్కడక్కడా పడి ఉన్నాయి. పల్లె ప్రజలు ఎవరి బట్టలు వారె వుతుక్కుంటూ కాలం వెళ్ల దీస్తున్నారు. కాక పోతే బట్టల మురికి అతి సులభంబా వదల గొట్ట డానికి అనాడు లేని డిటర్జెంటులు, పౌడర్లూ, సబ్బులు, బట్టలు ఉతికే యంత్రాలు ఇప్పుడొచ్చాయి. పైగా మురికి అంతగా అంటని, అంటినా సులభంగా వదిలిపోయే టెర్లిన్, టెరికాట్, పోలిస్టర్ వంటి బట్టలు ఎక్కువైనాయి. దాంతో గృహస్తుల బాధ కొంత వరకు తీరింది. చాకలి లేని లోటు కొంత వరకు తీరింది. చాకలి వృత్తి కేవలం మురికి బట్టలను వుతకడం మాత్రమే కాదు.... అతనికి అనేక సామాజిక పనులు కూడా వుండేవి. అన్ని ప్రాంతాలలోను చాకలి వృత్తి ఇంచు మించు కనుమరుగైనది. ఎవరి బట్టలను ఎక్కువగా వారే వుతుక్కుంటున్నారు. మరి.... ఇతర సామాజిక కార్యక్రమాల సంగతి...... అవి ఏవంటే..... ముట్టు బట్టలను ఉతకడం, ఆడపిల్లలు సమర్థాడినప్పుడు స్నానం చేయించడము, పురుడు పోసినప్పుడు స్నానం చేయించడము, చావు వంటి అశుభ కార్యాలకు దీవిటి పట్టడం, పెళ్ళి వంటి శుభ కార్యాలకు దీవిటి పట్టడం, ఇలాంటి కార్యక్రమాలు ఏనాడో కనుమరుగైనవి. పాత సంప్రదాయాలను మరువలేని వారు ఆ యా సమయానికి ఒక చాకలి కులస్తుని అద్దెకు పిలిపించి తూ తూ మంత్రంగా ఆ కార్యక్రమం జరిగిందని పిస్తున్నారు. దీన్ని బట్టి చాకలికి ఆ రోజుల్లో ఎంతటి పరపతి ఉండేదో ఊహించు కోవచ్చు. అది ఆనాటి చాకలి ప్రాముఖ్యత.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]వెలుపలి లంకెలు
[మార్చు]- http://www.suryaa.com/showNews.asp?category=4&subCategory=19&ContentId=11453[permanent dead link]
- RST.org.in - రజక / చాకలి ప్రజలు కొరకు సంక్షేమ ట్రస్ట్
- voiceofrajaka.com - వాయిస్ ఆఫ్ రజక వెబ్ సైట్
- rajakachaitanyaseva.com - రజక చైతన్య సేవ సంస్థ
- rvkap.in - రజక వికాస కేంద్రం
- rajakaeewa.com - రజక ఎంప్లాయిస్ అండ్ ఎడ్యుకేటెడ్ అసోసియేషన్