జాతీయ అగ్నిమాపక దినోత్సవం
స్వరూపం
జాతీయ అగ్నిమాపక దినోత్సవం | |
---|---|
జరుపుకొనే రోజు | ఏప్రిల్ 14 |
ఆవృత్తి | వార్షికం |
అనుకూలనం | ప్రతి సంవత్సరం ఇదే రోజు |
జాతీయ అగ్నిమాపక దినోత్సవం (జాతీయ అగ్నిమాపక దళ దినోత్సవం) ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న నిర్వహించబడుతుంది. 1944, ఏప్రిల్ 14న ముంబాయి ఓడరేవులో జరిగిన అగ్నిప్రమాదం సంఘటన జ్ఞాపకంగా ప్రతి సంవత్సరం జాతీయ అగ్నిమాపక దినోత్సవం జరుపుకుంటున్నారు.[1][2]
ప్రారంభం
[మార్చు]1944, ఏప్రిల్ 14న ముంబాయి ఓడరేవులోని విక్టోరియా డాక్ యార్డ్ లో జరిగిన అగ్నిప్రమాదంలో విధి నిర్వహణలో ఉన్న అధికారులు, సిబ్బంది, సామాన్య ప్రజలతోసహ 66మంది మరణించగా, 87మంది గాయపడ్డారు. ఆ సంఘటన జ్ఞాపకంగా ప్రతి సంవత్సరం జాతీయ అగ్నిమాపక దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించారు.[3]
ఉద్దేశ్యం
[మార్చు]అగ్నిమాపక శాఖ ద్వారా అగ్ని ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కలిగించి, తద్వారా అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు వహించడం[4]
కార్యక్రమాలు
[మార్చు]ప్రజలకు అగ్నిప్రమాదాలపై అవగాహన కలిపించేందుకు వారం రోజులపాటు వివిధ కార్యక్రమాలు రూపొందిస్తారు.[5]
- ఏప్రిల్ 14: అమరవీరులకు నివాళులు, ఏప్రిల్ 15: బహిరంగ ప్రదేశాల్లో, కూడళ్లలో అగ్నిప్రమాదాలు నివారణపై అవగాహన, ఏప్రిల్ 16: అపార్ట్‌మెంట్లలో అవగాహన సదస్సులు, ఏప్రిల్ 17: విద్యాసంస్థల్లో అవగాహన సదస్సులు, ఏప్రిల్ 18: ఎల్‌పీజీ గూడౌన్స్, ఆయిల్ ఫర్మ్స్‌లో అవగాహన సదస్సులు, ఏప్రిల్ 19: ఆస్పత్రుల్లో అవగాహన సదస్సులు, ఏప్రిల్ 20: అన్ని వర్గాల ప్రజలకు ఫైర్ సేఫ్టీపై వర్క్‌షాప్ వంటి కార్యక్రమాలు ఉంటాయి.
- డ్యూటీలో ఉండగా ప్రాణాలు కోల్పోయిన అగ్నిమాపక దళ సిబ్బందికి దేశంలోని అగ్నిమాపక కేంద్రాల వద్ద నివాళి అర్పించి, గౌరవ సూచకంగా అగ్నిమాపక సిబ్బంది రెండు నిమిషాలపాటు మౌనాన్ని పాటిస్తారు.
- బస్టాండ్, రైల్వేస్టేషన్, పార్కు, పాఠశాలలు, సినిమా థియేటర్లు, ఫంక్షన్ హాల్స్, ఆస్పత్రులు, గ్యాస్ గోడౌన్, పరిశ్రమలలో మాక్ డ్రిల్స్ నిర్వహిస్తారు.
మూలాలు
[మార్చు]- ↑ The Hindu, City (14 April 2018). "National Fire Service Day observed". The Hindu (in Indian English). Archived from the original on 25 జూన్ 2018. Retrieved 14 April 2020.
- ↑ ప్రజాశక్తి, తాజావార్తలు (14 April 2018). "అగ్నిమాపక శాఖ ఇచ్చే సూచనలు ప్రజలు పాటించాలి: కొల్లు". Archived from the original on 14 ఏప్రిల్ 2018. Retrieved 14 April 2020.
- ↑ వి6 వెలుగు, హైదరాబాదు (14 April 2019). "ప్రమాదాలు తప్పించుకోండిలా..! : ఫైర్ సేఫ్టీ వారోత్సవాలు". Archived from the original on 14 ఏప్రిల్ 2020. Retrieved 14 April 2020.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ నవతెలంగాణ, నిజామాబాదు (14 April 2016). "అగ్నిప్రమాదాలపై అవగాహన అవసరం". NavaTelangana. Retrieved 14 April 2020.
- ↑ ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (14 April 2016). "అప్రమత్తతే అగ్ని ప్రమాదాలకు నివారణ". www.andhrajyothy.com. Archived from the original on 14 ఏప్రిల్ 2020. Retrieved 14 April 2020.