జాతీయ రైతు దినోత్సవం
జాతీయ రైతు దినోత్సవం డిసెంబరు 23 న దేశవ్యాప్తంగా ప్రతి ఏటా నిర్వహిస్తారు.[1][2] భారతదేశ 5వ ప్రధానమంత్రి, 'భారతదేశపు రైతుల విజేత' గా గుర్తింపుపొందిన చౌదరి చరణ్ సింగ్ పుట్టినరోజు సందర్భంగా ఈ జాతీయ రైతు దినోత్సవంగా జరుపుకుంటారు.[3]
ప్రారంభం
[మార్చు]చౌదరి చరణ్ సింగ్ చేసిన అనేక ఉద్యమాల వల్ల జమీందారీ చట్టం రద్దై, కౌలుదారీ చట్టం అమలులోకి వచ్చింది. రైతులకు బ్యాంక్ ఋణాలు అందించే విధానము ప్రవేశపెట్టబడింది. రైతుల గురించి, వ్యవసాయరంగం గురించి అంతగా ఆలోచించి, వారి సమస్యల పరిష్కారానికి కృషిచేసిన చరణ్ సింగ్ సేవలకు గుర్తుగా ప్రభుత్వము చరణ్ సింగ్ జన్మదినోత్సవాన్ని జాతీయ రైతు దినోత్సవంగా ప్రకటించింది.[4]
కార్యక్రమాలు
[మార్చు]రైతు దినోత్సవం సందర్భంగా వ్యవసాయరంగంపై చర్చలు, సదస్సులు, క్విజ్ పోటీలు, శిక్షణా శిబిరాలు, ఎగ్జిబిషన్ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు.
గుర్తింపు
[మార్చు]చరణ్ సింగ్ మూడవ వర్థంతి (1990, మే 29) సందర్భంగా భారత ప్రభుత్వం చరణ్ సింగ్ చిత్రంతో తపాలా బిళ్లను విడుదలచేసింది.[5]
మూలాలు
[మార్చు]- ↑ "December 23 to be celebrated as Farmers' Day in State". The Hindu. June 23, 2006. Retrieved 23 December 2018.
- ↑ ఆంధ్రజ్యోతి, తెలంగాణా- కధనాలు (23 December 2015). "ఈ రోజు అన్నదాతది... నేడు రైతు దినోత్సవం". Archived from the original on 23 December 2018. Retrieved 23 December 2018.
- ↑ నవతెలంగాణ (23 December 2016). "జాతీయ రైతు దినోత్సవం". Archived from the original on 23 December 2018. Retrieved 23 December 2018.
- ↑ రైతన్నలరోజు, స్వాతి వార పత్రిక, 27.12.2013, పుట.55.
- ↑ "Chaudhary Charan Singh". www.istampgallery.com. Retrieved 2019-12-23.
{{cite web}}
: CS1 maint: url-status (link)