జాలపుట
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
ఒక జాలపుట ( వెబ్ పేజ్ ) అనేది జాల విహరిణి(వెబ్ బ్రౌజర్) ద్వారా విక్షించే అంతర్జాలానికి చెందిన ఒక పత్రం. జాలపుటలకు ఒక యు.ఆర్.ఎల్(URL) లేదా చిరునామా ఉంటుంది, దాని ద్వారా జాలపుటని కనుగొనగలం , ప్రతి పేజీకి ఇది భిన్నంగా ఉంటుంది. కంపెనీ, వ్యక్తి లేదా సంస్థ నిర్వహించే ఒక పెద్ద పుటల యొక్క సమూహంలో ఒక జాలపుట ఉన్నప్పుడు, అది ఒక జాలస్థలి(వెబ్ సైట్) యొక్క భాగం.
జాలపుటలు పదాలు, చిత్రాలు, వీడియోలు, లింక్లను కలిగి ఉంటాయి. లింకులు ఇతర జాలపుటలు పొందటానికి మార్గములు.
ఉదాహరణకు: ఈ వ్యాసం ఒక జాలపుట. దిని చిరునామా లేదా యు.ఆర్.ఎల్(URL) https://te.wikipedia.org/wiki/జాలపుట , ఇది వికీపీడియా జాలస్థలిలో ఒక భాగం.
సాంకేతిక పరిజ్ఞానం
[మార్చు]జాలపుటలను సాధారణంగా హెచ్.టి.ఎం.ఎల్.(HTML) కోడ్లో నిల్వ చేస్తారు, ఇది పదాలను లేదా చిత్రాల లాంటివి పేజీలో ఏలా చూపించాలో వివరిస్తుంది. జాలపుటలు ఎలా పని చేయాలో చెప్పడానికి రెండు ఇతర రకాల కొడ్లు కూడా ఉపయోగిస్తాయి:
- క్యాస్కేడింగ్ స్టైల్ షీట్లు (లేదా సి.యస్.యస్) ఎలా కనిపిస్తుందో పేజీకి చెప్పడానికి ఉపయోగించే ఒక కోడ్.
- జావాస్క్రిప్టు (లేదా జె.ఎస్.) పేజీలో పదాలను, శైలిని లేదా చిత్రాలను మార్చడానికి ఉపయోగిస్తారు.