ట్రామ్
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. (10 సెప్టెంబరు 2020) సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
ట్రామ్ లేదా ట్రామ్‌కార్ అనేది ప్రజా పట్టణ వీధులలో రైలు మార్గంపై పరుగులు తీసే ఒక రైలు వాహనం. ఇది ఉత్తర అమెరికాలో స్ట్రీట్ కార్ లేదా ట్రాలీ లేదా ట్రాలీ కారుగా పిలవబడుతుంది. ట్రామ్‌కార్‌ల చే నిర్వహించబడుతున్న ఈ లైన్లను లేదా నెట్వర్కులను ట్రాంవేస్ అంటారు. ట్రామ్ మార్గాలు విద్యుచ్ఛక్తి ద్వారా శక్తి పొందుతాయి, అత్యంత సాధారణ రకం చారిత్రాత్మకం, ఒకప్పుడు విద్యుత్ వీధి రైల్వేలు అని పిలవబడ్డాయి. అయితే ట్రామ్‌లను విద్యుదీకరణ యొక్క విశ్వవ్యాప్త అవలంబనకు ముందే పట్టణ ప్రాంతాల్లో విస్తృతంగా ఉపయోగించారు.
విద్యుత్ ట్రామ్‌ల యొక్క ఇతర పద్ధతులు ఈ క్రింద ఇవ్వబడ్డాయి.
ట్రామ్ లైన్లు నగరాలు, /లేదా పట్టణాల మధ్య కూడా నడుస్తాయి. అప్పుడప్పుడు ట్రామ్లు సరుకు కూడా తీసుకుపోతాయి. ట్రామ్ వాహనాలు సాధారణంగా సంప్రదాయ రైళ్ల, రాపిడ్ ట్రాన్సిట్ రైళ్ల కంటే తేలికగా, పొట్టిగా ఉంటాయి. కొన్ని ట్రామ్‌లను సాధారణ రైల్వే ట్రాక్‌లపై కూడా నడిపించవచ్చు, ఒక ట్రామ్వేను ఒక తేలికపాటి రైలు లేదా వేగవంతమైన రవాణా లైన్ స్థాయికి కూడా పెంచవచ్చు, రెండు పట్టణ ట్రాంవేస్‌లను అంతర్ పట్టణ అనుసంధానం చేయవచ్చు. ఈ అన్ని కారణాలతో, రైలు రవాణా యొక్క వివిధ రీతుల మధ్య తేడాలు తరచుగా గజిబిజిగా ఉంటాయి. యునైటెడ్ స్టేట్స్లో ఈ ట్రామ్ పదాన్ని కొన్నిసార్లు ట్రాక్ లేని రబ్బరు టైర్లు గల రైళ్లకు ఉపయోగిస్తారు. అవసరం ఐతే, ఇవి ద్వంద్వ పవర్ సిస్టమ్స్ కలిగి ఉండవచ్చు - నగర వీధుల్లో విద్యుత్ తోను, పల్లెటూరి వాతావరణాలలో డీజల్ తోను వీటిని నడపవచ్చు.