Jump to content

డబ్ స్మాష్ (2020 సినిమా)

వికీపీడియా నుండి
డబ్ స్మాష్
దర్శకత్వంకేశవ్ దీపూర్
రచనఏ.వి.రావ్
నిర్మాతమలసాని సుబ్రహ్మణ్యం
తిరకాల గజేంద్ర
తారాగణం. పవన్ కృష్ణ
సుప్రజ
గెటప్ శ్రీను
ఛాయాగ్రహణంరమేష్ ఆర్
కూర్పుగ్రేసన్
సంగీతంవంశిష్‌
నిర్మాణ
సంస్థ
వి.త్రి ఫిలిమ్స్
విడుదల తేదీ
30 జనవరి 2020 (2020-01-30)
దేశం భారతదేశం
భాషతెలుగు

డబ్‌స్మాష్ 2020లో తెలుగులో విడుదలైన సినిమా.వి.త్రి ఫిలిమ్స్ బ్యానర్‌పై మలసాని సుబ్రహ్మణ్యం, తిరకాల గజేంద్ర నిర్మించిన ఈ సినిమాకు కేశవ్ దీపూర్ దర్శకత్వం వహించాడు. పవన్ కృష్ణ, సుప్రజ, గెటప్ శ్రీను ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జనవరి 30న విడుదలైంది.[1][2]

సెర్విన్ (పవన్ కృష్ణ) డబ్‌శ్మాష్‌ చేస్తూ ఎనిమిది లక్షల ఫాలోవర్స్ తో మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంటాడు. మేఘన (సుప్రజ) కూడా డబ్‌శ్మాష్‌ చేస్తూ బాగా పాపులర్ అవుతుంది. అయితే తనకొచ్చిన ఓ సమస్య కారణంగా సెర్విన్ చదివే కాలేజీలోనే మేఘన కూడా జాయిన్ అవుతుంది. సెర్విన్, మేఘన అలా పరిచయమై, ప్రేమించుకుంటారు. ఆ విషయం ఒకరికి ఒకరు వ్యక్తపరుచుకునే క్రమంలో మేఘనను కిడ్నాప్ కు గురవుతుంది. ఆ కిడ్నాప్ చేసిన గ్యాంగ్ ను సెర్విన్ ఎలా పట్టుకున్నాడు ? అసలు మేఘనను కిడ్నాప్ చేసింది ఎవరు ? అలాగే ఆమెకు వచ్చిన సమస్య ఏమిటి ? చివరికీ మేఘన, సెర్విన్ ఒక్కటయ్యారా ? అనేదే మిగతా సినిమా కథ.

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: వి.త్రి ఫిలిమ్స్
  • నిర్మాత: ఓంకార లక్ష్మీ, గజేంద్ర తిరకాల
  • కథ, మాటలు: ఏ.వి.రావ్
  • స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కేశవ్ దీపూర్
  • సంగీతం: వంశిష్‌
  • సినిమాటోగ్రఫీ: రమేష్ ఆర్
  • ఎడిటర్: గ్రేసన్
  • ఫైట్స్: ఫైర్ కార్తిక్
  • పాటలు: బాల వర్ధన్

మూలాలు

[మార్చు]
  1. Sakshi (25 January 2020). "'డబ్‌శ్మాష్‌' ట్రైలర్‌ విడుదల". Archived from the original on 24 April 2022. Retrieved 24 April 2022.
  2. Sakshi (30 January 2020). "[[డబ్‌స్మాష్]]‌ వల్ల ఏం జరిగింది?". Archived from the original on 24 April 2022. Retrieved 24 April 2022. {{cite news}}: URL–wikilink conflict (help)

బయటి లింకులు

[మార్చు]