తాలిబన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తాలిబన్

తాలిబన్ అంటే అరబ్బీ లో ధర్మ జ్ఞానాన్ని అన్వేషించే విద్యార్థిఅని అర్ధం.కానీ అంతమంచి పేరు జిహాద్ లాగానే తీవ్రవాదుల చెడ్డచేష్టలవల్ల చెడ్డపేరుగా మారిపోయింది.ఈ తాలిబన్లు ఇస్లాం పరిరక్షకులుగా చెప్పుకుంటారుగానీ ఇస్లాం ప్రభోదించే ప్రజాస్వామ్యాన్ని ఖాతరు చేయకుండా హింసకు మారణకాండకు పాల్పడుతారు.వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ ,పాకిస్థాన్ లలో ఉన్నారు.రాజ్యాలను అల్లకల్లోలం చేస్తున్నారు.

  • తాలిబాన్లను సృష్టించింది పాకిస్థానీ నేతలేనని,అమెరికాకు చెందిన సిఐఎ, తన దేశానికి చెందిన ఐఎస్ఐ కలసి తాలిబన్ లకు ఊపిరిపోశాయని పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ అన్నారు.(ఈనాడు - ‎10 మే 2009).

పాక్‌లోని స్వాత్ లోయలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తాలిబన్లు ఈ రెండేళ్లలో 200 స్కూళ్లకు నిప్పు పెట్టారు. ముస్లిం సంప్రదాయాల ప్రకారం ఆడపిల్లలు చదువుకోకూడదని ఆదేశాలిస్తున్న తాలిబస్లు ఆడపిల్లలు చదువుకోకుండా అడ్డుకునేందుకు ఏకంగా స్కూళ్లనే తగులబెట్టారు. మీరు నిజమైన ముస్లింలు అయితే అమ్మాయిలను చదివించవద్దని పిలుపు ఇచ్చారు.తమపై సైనిక దాడులను తక్షణం నిలిపేయకపోతే తీవ్ర పరిణామాలు సంభవిస్తాయని దేశ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీని ఉగ్రవాద సంస్థలు అల్‌ఖైదా , తాలిబన్ హెచ్చరించాయి.ఇలాంటి బెదిరింపులను ప్రభుత్వం లెక్కచేయబోదని, ఉగ్రవాదులందరినీ అంతంచేసే వరకు సైనిక పోరాటం కొనసాగుతుందని జర్దారీ తేల్చిచెప్పారు.(ఈనాడు 24.5.2009)

  • పాక్‌కు ప్రస్తుతం అసలైన శత్రువులు తాలిబన్లని, భారత్ కాదని పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్అలీ జర్దారీ అన్నారు.తాలిబన్లు అంతర్జాతీయ సమాజానికే ముప్పని ఆయన అన్నారు.(ఈనాడు 25.6.2009)

అఫ్గానిస్తాన్‌లో తాత్కాలికంగా కాల్పుల విరమణకు ఉగ్ర సంస్థ తాలిబన్ కౌన్సిల్ అంగీకారం తెలిపింది(29/12/2019). అమెరికాతో శాంతి ఒప్పందం కుదుర్చుకునే దిశగా మార్గం సుగమం చేసింది.తాలిబన్, అమెరికాల మధ్య శాంతి ఒప్పందం కుదిరితే.. అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా తన దళాలను వెనక్కు తీసుకువెళ్తుంది. 18 ఏళ్లుగా అమెరికా అఫ్గానిస్తాన్‌లో మిలటరీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

వీర స్వర్గం

[మార్చు]

యువతను ఆత్మాహుతి దళంలో చేరేలా ప్రేరేపించేందుకు తాలిబన్లు కృత్రిమ స్వర్గాన్ని (జన్నత్‌) రూపొందించారట.12-18 ఏళ్ల మధ్య ఉండే యువకులకు ఉగ్రవాద అంశాల్లో శిక్షణ ఇచ్చి మానవ బాంబులుగా మార్చేందుకు ప్రయత్నించేవారు. దాడిలో పాల్గొని మరణించాక ఈ స్వర్గానికే చేరతారంటూ యువకులకు ప్రేరణ కలిగించేవారు. తాలిబన్లు రూపొందించిన కృత్రిమ స్వర్గంలో తేనె, పాలు నదులుగా ప్రవహిస్తున్నట్లు చిత్రాలు అందమైన కొండలు, బృందావనాలతో పాటు దేవకన్యల చిత్రాలనూ ఉంచారు(ఈనాడు13.12.2009)

"https://te.wikipedia.org/w/index.php?title=తాలిబన్&oldid=4247382" నుండి వెలికితీశారు