దంత విన్యాసం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దంత విన్యాసం - పళ్ళ అమరికలు పై దవడ భాగములో

దంత విన్యాసం (Dental formula) క్షీరదాలలోని దంతాలు అన్నీ ఒకే విధంగా ఉండకుండా, కొన్ని రకాలుగా ఉంటాయి. వీటి వివరాలను సూక్ష్మంగా వివరించే సూచికను దంత విన్యాసం అంటారు. కుంతకాలు (Incisors), రదనికలు (Canines), చర్వణకాలు (Molars, అగ్రచర్వణకాలు (Premolars) అనే నాలుగు రకాల దంతాలు కల కుడి, ఎడమ పక్కల దంత విధానం ఒకే మాదిరిగా ఉంటుంది. కాబట్టి ఒక పక్క దంతాలను మాత్రం ఈ విన్యాసాం సూచిస్తుంది. అదే విధంగా పై దవడలోని దంతాలు పైన, కింది దవడలోని దంతాలు దిగువన సూచించబడతాయి.

చరిత్ర

[మార్చు]

మానవులందరికీ నాలుగు రకాల దంతాలు ఉన్నాయి అవి కుంతకాలు , రదనికలు , చర్వణకాలు , అగ్ర చర్వణ కాలు ఇవి దవడ ఎముకలపై ఉంటాయి. నాలుగు రకాల దంతాలు ఆహారాన్ని జీర్ణం చేయడములో చాలా ముఖ్యమైనవి. ఆహార జీర్ణక్రియలో ప్రధాన పాత్ర పోషిస్తుంది, దంతాలు దవడ ఎముకను బలంగా ఉంచుతాయి, మన ముఖానికి అందమును , మాట్లాడడానికి సహాయపడతాయి. మనుషులకు 32 పళ్ళు ఉన్నాయి. జంతువులలో వివిధ రకాలఆకారాలు ఉన్నాయి, ఇవి జంతువులలో పోషకాహారం లేదా వాటి ఆహారపు అలవాట్ల ఆధారంగా ప్రత్యేకమైనవి [1] కుంతకాలు - ఎగువ, దిగువ దవడలలోని నాలుగు ముందు పళ్ళను కుంతకాలు అంటారు. వీటి పని ఆహారాన్ని నమలడం , ఇవి ఒకే మూలం , పదునైన కోత అంచు కలిగి ఉంటాయి. రదనికలు: నోటి కుహరంలో నాలుగు కోరలు ఉన్నాయి, పొడవైన మూలములు కలిగి ఉంటాయి . అగ్ర చర్వణకాలు : దంతాలు వెనుక వైపున ఉన్నాయి , నోటి కుహరంలో ఎనిమిది ఉంటాయి. చర్వణకాలు నోటిలో చాలా పటిష్టమైన పళ్ళు, 4-5 కస్పులతో ఉంటాయి [2] .

దంత సూత్రం పై పళ్ళు , క్రింది పళ్ళు దవడలలో ( పై దవడ , క్రింది ) అమరికను తెలుపుతాయి . దంత సూత్రం అనేది ఒక నిర్దిష్టము గా పళ్ళను లెక్కించేడి. మొత్తం దంతాల సంఖ్యను సూచించడానికి మొత్తం సూత్రాన్ని రెండు గా గుణించాలి.మానవులలో పాల దంతాల కోసం దంత సూత్రం: మానవులలో పాల పళ్ళు,ఎగువ దవడ, దిగువ దవడ యొక్క ప్రతి సగం 2 కుంతకాలు (Incisors) , 1 రదనికలు ( Incisors), 2 చర్వణకాలు ( Molars) కలిగి ఉంటుంది. పాల పళ్ళలో అగ్రచర్వణకాలు (Premolars) లేవు కాబట్టి అవి సున్నా. మానవులలో శాశ్వత దంతాల కోసం దంత సూత్రం: ఎగువ దవడ, దిగువ యొక్క ప్రతి సగం 2 కుంతకాలు , 1 రదనికలు , 2 అగ్రచర్వణకాలు 3 చర్వణకాలు కలిగి ఉంటాయి. మానవుడికి 32 శాశ్వత దంతాలు ఉన్నాయి [3] [4]

మూలాలు

[మార్చు]
  1. "Dental Formula - An Overview of Dentition and Dental Formula". BYJUS (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-12-03.
  2. "Types of Teeth and their Functions | An Overview of Dental Anatomy | CE Course | dentalcare.com". www.dentalcare.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-12-04.
  3. "Give the dental formula of human beings". Toppr Ask (in ఇంగ్లీష్). Retrieved 2020-12-04.[permanent dead link]
  4. "Teeth: Types, Dental Formula and Tooth Anatomy - GKToday" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-12-04.