నామవాచకం (తెలుగు వ్యాకరణం)
Jump to navigation
Jump to search
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
ఈ వ్యాసం నుండి ఇతర పేజీలకు లింకులేమీ లేవు.(అక్టోబరు 2016) |
ఒక వాక్యాన్ని కొన్ని భాగాలుగా విడగొట్టి పరిశీలించవచ్చు. ఇలా విడగొట్టిన భాగాలకి ప్రత్యేకమైన పేర్లు ఉన్నాయి. ఇటువంటి భాషాభాగాల పేర్లలో ముఖ్యమైనవి: నామవాచకం (noun), సర్వనామం (pronoun), విశేషణం (adjective), క్రియ (verb), విభక్తి ప్రత్యయం (post position). ఈ భాగంలో ప్రస్తావన నామవాచకం గురించి మాత్రమే.
నిర్వచనం
[మార్చు]ఒక వ్యక్తిని కాని, ఒక స్థలాన్ని కాని, ఒక వస్తువుని కాని, ఒక ఊహని కాని సూచించేది నామవాచకం.
వచనం
[మార్చు]- తెలుగులో తారసపడే నామవాచకాలకి, సర్వసాధారణంగా, "వచనం" (number), "లింగం" (gender) ఉంటాయి.
- మనుష్యులలో మగ వారిని సూచించేది పుంల్లింగం లేదా పురుష లింగం
- రాముడు, తాత, ఎరకయ్య, పిల్లడు, మొ.
- మనుష్యులలో ఆడ వారిని సూచించేది స్త్రీ లింగం.
- సీత, మామ్మ, రత్తాలు, పిల్ల, మొ.
- పశువులు, చెట్లు, ప్రాణం లేని పదార్థాలు, అన్నీ కూడా స్త్రీ లింగమే
- ఆవు, గంట, అడవి, మొ.
- నామవాచకాలు "ఏకవచనం" (singular) లోనయినా ఉంటాయి, "బహువచనం" (plural) లోనయినా ఉంటాయి.
- బహువచనంలో ఉన్న మాటలు, సర్వసాధారణంగా, "లు"తో కాని "ళ్లు"తో కాని అంతం అవుతాయి.
- ఏకవచనంలో ఉన్న కొన్ని నామవాచకాలకి కేవలం "లు" తగిలిస్తే బహువచనాలు అవుతాయి.:
- గోడ --> గోడలు
- చేప --> చేపలు
- మాట --> మాటలు
- పన్ను ---> పన్నులు (tax-->taxes)
- సంస్కృతం నుండి తెలుగు లోకి వచ్చినప్పుడు ఏకవచనంలో "డు" సంతరించుకున్న మాటలు బహువచనంలో "డు"ని పోగొట్టుకుని "లు" చేర్చుకుంటాయి:
- పండితుడు --> పండితులు
- స్నేహితుడు --> స్నేహితులు
- ఆత్మీయుడు --> ఆత్మీయులు
- బహువచనంలో "లు" చేర్చినప్పుడు, అప్పుడప్పుడు, సంధి చేయవలసి వస్తుంది:
- పేరు --> పేరులు --> పేర్లు
- కారు --> కారులు --> కార్లు
- బోటు --> బోటులు --> బోట్లు
- చెట్టు --> చెట్టులు --> చెట్లు
- మెట్టు --> మెట్టులు --> మెట్లు
- రోడ్డు --> రోడ్డులు --> రోడ్లు
- ఏకవచనంలో ఉన్న నామవాచకం "లు"తో అంతం అయితే దాని బహువచనం "ళ్లు"తో అంతం అవుతుంది:
- కీలు --> కీళ్లు
- తేలు --> తేళ్లు
- కాలు --> కాళ్లు
- పాలు --> పాళ్లు (portion -->portions)
- పెనిసిలు --> పెనిసిళ్లు (pencils)
- ఏకవచనం "డి", "డు", "లి", "రు" లతో అంతం అయితే దాని బహువచనం "ళ్లు"తో అంతం అవుతుంది:
- బడి --> బళ్లు (schools)
- బండి --> బళ్లు (carts)
- పెరడు --> పెరళ్లు (backyards)
- ఊరు --> ఊళ్లు (villages)
- కొన్ని నామవాచకాలకి "లు" తగిలించినప్పుడు మాట వర్ణక్రమంలో కొద్ది మార్పు వస్తుంది.
- నది --> నదులు
- గది --> గదులు
- బంతి --> బంతులు
- ప్రత్యేకమైన సందర్భాలు
- మడి --> మళ్లు
- గడి --> గళ్లు
- సుడి --> సుళ్లు
- పండు --> పండ్లు, పళ్లు (fruits)
- పన్ను ---> పళ్లు (tooth-->teeth)
- ఇల్లు --> ఇళ్లు
- ఎద్దు --> ఎడ్లు
- కొన్ని నామవాచకాలు ఎల్లప్పుడూ బహువచనాలే!
- పాలు, నీళ్లు
- ఏకవచనంలో ఉన్న కొన్ని నామవాచకాలకి కేవలం "లు" తగిలిస్తే బహువచనాలు అవుతాయి.:
లింగం
[మార్చు]- సర్వసాధారణంగా "డు"తో అంతం అయ్యే పేర్లు అన్నీ పుంల్లింగమే అవుతాయి.
- రాముడు, తమ్ముడు, అల్లుడు, మనుమడు, ముఖ్యుడు, మొ.
- పుంల్లింగములు అన్నీ "డు"తో అంతం అవ్వాలని నియమం ఏదీ లేదు
- తండ్రి, అన్న, మామ, మొ.
- జంతువులు అన్నీ స్త్రీ లింగములే.
- ఆవు, ఎద్దు, మగ గుర్రం, ఆడ గుర్రం, మొసలి, మొ.
- ప్రాణము లేనివి అన్నీ స్త్రీ లింగములే
- చెట్టు, నది, రాయి, మొ.
- కొన్ని వర్గాలలో ఆడ, మగ, వ్యత్యాసం చూపించడానికి వేర్వేరు పేర్లు ఉన్నాయి:
- అమ్మ, అత్త, అక్క, కోడలు, అమ్మాయి, పిల్ల, మొ. స్త్రీ లింగములు
- నాన్న, మామ, అన్న, అల్లుడు, అబ్బాయి, పిల్లడు, మొ. పుంల్లింగములు
లింగం మార్పిడి
[మార్చు]- పుంల్లింగం మాటని స్త్రీ లింగంలోకి మార్చాలంటే మాట చివర "-ఉడు" సబ్దాన్ని తీసేసి "-టి"ని చేర్చాలి.
- నటుడు --> నటి
- వంచకుడు --> వంచకి
- పుంల్లింగం మాటని స్త్రీ లింగంలోకి మార్చాలంటే మాట చివర "-డు" సబ్దాన్ని తీసేసి "-రాలు"ని చేర్చాలి.
- వంచకుడు --> వంచకురాలు
- ప్రియుడు --> ప్రియురాలు
- భక్తుడు --> భక్తురాలు
- స్నేహితుడు --> స్నేహితురాలు
- కొన్ని మాటలు ఎల్లప్పుడు స్త్రీ లింగాలే
- చూలాలు, ఇల్లాలు