పద్మ కుప్పా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పద్మ కుప్పా
మిచిగాన్ జిల్లా 41వ పార్లమెంటు సభ్యురాలు
Assumed office
2019 జనవరి 9
అంతకు ముందు వారుమార్టిన్ హౌరిలాక్
వ్యక్తిగత వివరాలు
జననం1966
భారతదేశం
రాజకీయ పార్టీడెమోక్రటిక్
కళాశాలనేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వరంగల్

పద్మ కుప్పా అమెరికా లోని డెమొక్రాట్ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యురాలు. ఆమె 41వ జిల్లా నుండి మిచిగాన్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో సభ్యురాలు.[1] ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ ప్రాంతంలో ట్రాయ్ నగరం కూడా ఉంది.[2] 2019 జనవరి 1న ఆమె పదవీ బాధ్యతలు స్వీకరించింది. ఆమె ప్రస్తుత పదవీకాలం 2020 డిసెంబర్ 31తో ముగుస్తుంది. ఆమె భారతీయ సంతతికి చెందిన అమెరికన్.[3] ఆమె మిచిగాన్ శాసనసభలో హిందూ మతానికి చెందిన మొదటి భారతీయ వలసదారు.[4] ఆమె మిచిగాన్ లో అసిస్టెంట్ విప్ గా ఉంది.[5][6] ఆమె ప్రస్తుతం ట్రాయ్ హిస్టారికల్ సొసైటీ కి అద్యక్షురాలిగా భాద్యతలు నిర్వహించడమే కాకుండా మిచిగాన్ రౌండ్ టేబుల్ ఫర్ డైవర్సిటీ అండ్ ఇంక్లూజన్ కు బోర్డు సభ్యురాలిగా సేవలనందిస్తుంది. ఆమె గెలుపొందిన మిచిగాన్ లో పెద్ద సంఖ్యలో భారతీయ అమెరికన్ జనాభా ఉంది. ఇక్కడ అత్యధికంగా మాట్లాడే మైనారిటీ భాష తెలుగు. ఆమె మాతృభాష కూడా తెలుగు.[7]

జీవితం

[మార్చు]

పద్మ 1966 లో వరంగల్ లో జన్మించింది. పద్మ నాలుగేళ్ల వయసులో తల్లిదండ్రులతో కలిసి అమెరికా వెళ్లి అక్కడ చదువుకుంది.[8] 1981 లో భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత, ఆమె హైదరాబాద్ లోని స్టాన్లీ గర్ల్స్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. తరువాత ఆమె వరంగల్ నిట్ (అప్పుడు REC) లో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది. 1988లో గ్రాడ్యుయేట్ స్టూడెంట్ గా న్యూయార్క్ కు వెళ్ళింది. ఆమె భర్త తాడేపల్లి సుధాకర్, ఇద్దరు పిల్లలతో పాటు మిచిగాన్ లోని ట్రాయ్ లో స్థిరపడింది. అక్కడ ఆమె ట్రాయ్ ప్లానింగ్ కమిషనర్‌గా రెండేళ్లు పనిచేసింది. గత ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ తరపున మొదటిసారి రాష్ట్ర ప్రతినిధుల సభకు ఎన్నికైన పద్మ, తాజా ఎన్నికలలో రెండవసారి విజయం సాధించింది.

వృత్తి

[మార్చు]

ఆమె క్రిస్లర్ కార్ప్ ఇంకా ట్రాయ్ నగరానికి మాజీ ఇంజనీర్ గా పని చేసింది.[9] ఆమె ట్రాయ్ ప్లానింగ్ కమిషనర్ గా రెండు సంవత్సరాలకంటే ఎక్కువ కాలం పనిచేసింది.[10] ఆమె 2018 నవంబర్ 6న మిచిగాన్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ డిస్ట్రిక్ట్ 41 కోసం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థినిగా పోటీచేసి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డౌగ్ టిట్జ్ ను ఓడించింది.[11] ఆమె మిచిగాన్ శాసనసభకు ఎన్నికైన మొదటి భారతీయ వలసదారైన అమెరికన్ హిందువుగా రికార్డు సాధించింది.[12] ఆమె స్థానిక ప్రభుత్వంలో ఎనర్జీ కమిటీ, మున్సిపల్ ఫైనాన్స్ కమిటీలో సభ్యురాలిగా ఉంది.[13] ఆమె ట్రాయ్-ప్రాంతం ఇంటర్ ఫెయిత్ గ్రూప్ వ్యవస్థాపకురాలు.[14] ఆమె ట్రాయ్ స్కూల్ డిస్ట్రిక్ డైవర్శిటీ అండ్ ఇంక్లూజన్ పురస్కార గ్రహీత. ఆమె స్థానిక నాయకత్వంలో ఒక కాంగ్రెస్ అవార్డు గెలుచుకుంది. ఆమె పేరు 2015 లో మిచిగాన్ ఇండియా హాల్ ఆఫ్ ఫేమ్ లో కూడా చేర్చబడింది.[15]

బాహ్య లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Donnelly, Francis X. (November 6, 2018). "Legislature: Female Dems Manoogian, McMorrow win in Oakland". The Detroit News. Retrieved 12 January 2019.
  2. Shaffer, Catherine (December 31, 2018). "Michigan's 100th legislature gains women, scientists". Michigan Radio NPR. Retrieved 12 January 2019.
  3. Dutt, Ela (January 7, 2019). "Indian-American swears oath of office on Gita in Illinois legislature". News India Times. Retrieved 12 January 2019.
  4. "News From Rep. Kuppa". housedems.com (in ఇంగ్లీష్). 2018-12-27. Archived from the original on 2019-08-25. Retrieved 2019-11-25.
  5. Cousino, Dean (January 5, 2019). "Rep. Camilleri announces assistant Democratic whips". The Monroe News. Retrieved 12 January 2019.
  6. India-West Staff Reporter (January 9, 2019). "Indian American State Sen. Jay Chaudhuri Named Senate Democratic Whip in North Carolina Legislature, Padma Kuppa Named Assistant Whip in Michigan". IndiaWest. Archived from the original on 13 జనవరి 2019. Retrieved 12 January 2019.
  7. Mozumder, Suman Guha. "Democrat Padma Kuppa making bid for GOP-held district in Michigan". IndiaAbroad.com (in ఇంగ్లీష్). Archived from the original on 2020-11-10. Retrieved 2020-11-09.
  8. "Total Telugu". totaltelugu.com. Archived from the original on 2020-11-06. Retrieved 2020-11-09.
  9. Haniffa, Aziz (August 9, 2018). "Padma Kuppa victorious in Michigan State House primary". India Abroad. Archived from the original on 20 ఫిబ్రవరి 2019. Retrieved 12 January 2019.
  10. Dutt, Ela (January 3, 2018). "Indian-American engineer, activist, running for Michigan State House". News India Times. Retrieved 12 January 2019.
  11. "Padma Kuppa". Ballotpedia (in ఇంగ్లీష్). Retrieved 2019-11-25.
  12. "Total Telugu". totaltelugu.com. Archived from the original on 2020-11-06. Retrieved 2020-11-09.
  13. "Padma Kuppa Representing HD41". Padma Kuppa Representing HD41 (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2019-08-13. Retrieved 2019-11-25.
  14. Troy, Address: 60 W. Wattles Rd. "Padma Kuppa – Troy Historic Village" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2020-08-09. Retrieved 2019-11-25.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  15. Mozumder, Suman Guha. "Democrat Padma Kuppa making bid for GOP-held district in Michigan". IndiaAbroad.com (in ఇంగ్లీష్). Archived from the original on 2020-11-10. Retrieved 2020-11-09.