పల్లా పర్సినాయుడు
Jump to navigation
Jump to search
పల్లా పర్సినాయుడు కవి, నఖ చిత్రకారుడు | |
---|---|
వ్యక్తిగత వివరాలు | |
జననం | చినకుదుమ, విజయనగరం, ఆంధ్రప్రదేశ్ | 1949 జూలై 1
జాతీయత | భారతీయుడు |
జీవిత భాగస్వామి | పార్వతమ్మ |
తల్లి | పారమ్మ |
తండ్రి | జగన్నాథం నాయుడు |
పల్లా పర్సినాయుడు (1949 జూలై 1) ప్రముఖ నఖ చిత్రకారుడు పల్లా పర్సినాయుడు విజయనగరం జిల్లా చినకుదుమలో జూలై 1 1949 లో ఒక పేద కుటుంబంలో జన్మించాడు. ఆయన పి.పి. నాయుడుగా ప్రసిద్ధి చెందాడు.
బాల్యం
[మార్చు]1949 జూలై 1న చినకుదుమ గ్రామం, విజయనగరం జిల్లాలో జన్మించాడు. ఊహ తెల్పినప్పటి నుండి బొగ్గు, పెన్సిల్ ఉపయోగించి చిత్రాలు గీస్తుండేవాడు. తదుపరి రావివలస ఉన్నత పాఠశాలలో డ్రాయింగ్ టీచర్ గా పనిచేస్తున్న ప్రముఖ కవి, సినీ గేయరచయిత జాలాది, అల్లు దాలినాయుడు గార్ల వద్ద చిత్రలేఖనంలో మెళకువలు నేర్చుకున్నాడు.
కెరీర్
[మార్చు]బి.ఏ. బి.ఈడి. చదివి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు. విజయనగరం జిల్లా నాగూరు ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పదవీవిరమణ చేశాడు.
రచనలు
[మార్చు]- పూల రేకులు (కవిత్వం)
- నఖ చిత్రరేఖ (నఖచిత్రాలు)
- గోటి బొమ్మల కొలువు (నఖచిత్ర సంపుటి)
- కలానికి ఇటూ అటూ(వ్యాస సంపుటి)
పురస్కారాలు
[మార్చు]- 1985లో పార్వతీపురం శారదా కళాస్రవంతి వారిచే ‘చిత్ర, నఖచిత్ర కళావిశారద’ బిరుదు ప్రదానం.
- 1987లో రాజీవ్ గాంధీ ఎక్స్ లెన్సీ అవార్డ్
- 1989లో నాటి ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు చే తెలుగు యూనివర్సిటీ ఉగాది పురస్కారం
- 1990లో నాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి గారిచే రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్
- 1994లో ఢిల్లీ తెలుగు ఆకాడమీ వారి పురస్కారం
- 1996లో రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ చే జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్