పూల్ మఖానా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొద్దిగా వేయించిన పూల్ మఖానా

పూల్‌ మఖానా (ఆంగ్లం: fox nuts) తామర పువ్వు గింజలతో తయారు చేసిన తినుబండారం[1] బీహార్ రాష్ట్రం, మధుబనీ మఖానా ప్రాంతంలో తయారు చేస్తుంటారు. తామర పువ్వుల నుండి సేకరించిన గింజలను బ్లాక్ డైమండ్స్ అంటారు. మిథిలా మఖానా పేరుతో భౌగోళిక గుర్తింపు పొందింది.[2]

సేకరణ

[మార్చు]

ముఖాన తామర పువ్వులు చెరువు నిండ పచ్చని ఆకులతో నిండి ఉంటాయి. పూసిన తామర పులా తొడిమి దగ్గర ఈ విత్తనాలు ఉంటాయి. పులా రెక్కలు పూర్తిగా రాలిపోయి ఆ గింజలన్ని ఎండి పోయి నీటి అడుగుకి చేరుతాయి. నీటి పైకి ఆకులు మాత్రమే పర్చుకోని కనిపిస్తుంటాయి. ఆ ఆకులను పక్కకు జరుపుతూ అడుగున ఉన్న తామర విత్తనాల్ని వలలు-బుట్టలతో సేకరిస్తుంటారు.[3][4]

తయారీ

[మార్చు]

ముఖాన తామర పువ్వు విత్తనాలను తేమంతా పోయేలా ఎండబెడతారు. మట్టి ఇతర చెత్త చెదారం లేకుండా శుభ్రంగా చేసిన నల్లని గింజన్ని ఇనుప ముకుళ్లలో సన్నని సెగ మీద పద్ధతి ప్రకారం వేయిస్తారు. ఆ తర్వాత గింజల్ని పగలగొడితే పాప్ కార్న్ లా పేలుతూ బయటికి వస్తాయి.[5]

పోషకాలు

[మార్చు]

వంద గ్రాముల పూల్ మఖానాలో ఉండే పోషకాలు:

  1. శక్తి :347 క్యాలరీలు
  2. పిండి పదార్థాలు:77 గ్రాములు
  3. కొవ్వు: 0.1 గ్రాములు
  4. ప్రొటీన్లు: 9.7 గ్రాములు
  5. పీచు:14.5 గ్రాములు
  6. ఐరన్:1.4 మిల్లి గ్రామాలు
  7. కాల్షియం: 60 మిల్లి గ్రాములు
  8. పాస్పరస్: 90 మిల్లి గ్రాములు
  9. పొటాషియం:500 మిల్లి గ్రాములు

ఉత్పత్తులు-రకాలు

[మార్చు]

లడ్డులు, బర్పీ స్వీట్లు , చిప్స్, మురుకులు

రుచులు

[మార్చు]

పూల్‌ మఖానా పిల్లల చిరుతిళ్ళలో భాగమై పోయాక ఉప్పు కారాలు, తీపి రుచులతో పాటు పుదీన, టమాట, ఉల్లిపాయ క్రీముల పేవర్లులో దొరుకుతుంది.

లాభాలు

[మార్చు]
  1. మఖానాలో క్యాలరీల శాతం తక్కువగా ఉంటుంది. పైగా దీంట్లోని ప్రొటీన్లూ, పీచూ ఎక్కువసేపు ఆకలి వేయకుండా చేస్తాయి. అందుకే, బరువు తగ్గాలనుకునేవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది.
  2. ఈ నట్స్ లో ఉండే అధిక పీచు- జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. రోజూ ఆహారంలో చేర్చుకుంటే మలబద్ధకం, ఇతర ఉదర సంబంధ వ్యాధులు చాలా వరకు తగ్గుతాయి.
  3. మఖానాతో వృద్ధాప్య ఛాయలు త్వరగా దరిచేరవు. ఇందులోని ప్లవనాయిడ్లూ, యాంటీఆక్సిడెంట్లూ చర్మంపైన ముడతల్నీ, తెల్లవెంట్రుకల్నీ నివారిస్తాయి. చర్మానికి నిగారింపును తీసుకొస్తాయి.
  4. పూల్ మఖానా అధికంగా ఉండే మెగ్నీషియం గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. కొలెస్ట్రాల్నీ, ట్రైగ్లిజరైడ్స్ అదుపులో ఉంచుతుంది.
  5. అధిక పొటాషియం, తక్కువ సోడియంతో ఉండే ఈ మఖానా రక్తపోటు ఉన్నవాళ్లకు మంచి ఆహారం.
  6. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటంతో- రక్తంలో చక్కెరస్థాయిల్ని నియంత్రిస్తుంది. కాబట్టి మధుమేహులు దీన్ని తినొచ్చని రకరకాల పరిశోధనలూ చెబుతున్నాయి.
  7. మఖానా తింటే ఎముకలు, దంతాలు దృఢంగా తయారవుతాయి. అందుకు కారణం దీంట్లో ఉండే అధిక కాల్షియమే. కీళ్ల నొప్పులున్నవారు రోజూ తీసుకుంటే ఎంతో మంచిది.
  8. బి-విటమిన్ ఎక్కువగా లభిస్తుంది దాని వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది.[6]

మూలాలు

[మార్చు]
  1. "Makhana Health Benefits: పూల్‌ మఖానా తింటున్నారా? గుండె జబ్బులు, షుగర్‌, బీపీ ఇంకా." TV9 Telugu. 2022-08-14. Retrieved 2024-06-10.
  2. ఈనాడు -ఆదివారం (2024-05-26), పూల్ ముఖాన.. పోషకాల ఖజానా..., retrieved 2024-06-11
  3. Haritha. "పిల్లలకు ఖచ్చితంగా పెట్టాల్సిన ఆహారం ఫూల్ మఖానా". ABP Telugu. Retrieved 2024-06-11.
  4. Telugu, TV9 (2021-07-02). "తెలుపు రంగులో మెరిసిపోయే పూల్ మఖనా.. ఎలా పండిస్తారో తెలిస్తే షాక్ అవుతారు." TV9 Telugu. Retrieved 2024-06-11.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  5. Chappa, Haritha. "Phool Makhana: పూల్ మఖానా చాట్... పిల్లలకు, పెద్దలకు బెస్ట్ స్నాక్స్ రెసిపీ". Hindustantimes Telugu. Retrieved 2024-06-10.
  6. "పూల్ మఖానా తినడం వల్ల బోలెడు లాభాలు!". telugu.samayam.com. Retrieved 2024-06-11.