యతి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{విస్తరణ}}
'''యతి''' అనగా [[పద్యం]] లోని ప్రతి [[పాదం]] లోని మొదటి పదం.
'''యతి''' అనగా [[పద్యం]] లోని ప్రతి [[పాదం]] లోని మొదటి పదం.


పంక్తి 28: పంక్తి 29:
* [http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/july2007/yati_praasa_niyamaalu.html సిలికానాంధ్ర సృజనరంజనిలో ''యతి-ప్రాస నియమాలు'' వ్యాసం]
* [http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/july2007/yati_praasa_niyamaalu.html సిలికానాంధ్ర సృజనరంజనిలో ''యతి-ప్రాస నియమాలు'' వ్యాసం]


[[వర్గం:తెలుగు వ్యాకరణం]]
[[వర్గం:పద్యము]]
[[వర్గం:పద్యము]]
[[వర్గం:ఛందస్సు]]

19:43, 5 అక్టోబరు 2007 నాటి కూర్పు

యతి అనగా పద్యం లోని ప్రతి పాదం లోని మొదటి పదం.

యతి మరియు యతి మైత్రి

పద్య పాదంలో మొదటి అక్షరానికి ఆ పద్యం లక్షణములలో చెప్పబడిన యతి స్థానంలో మైత్రి గల అక్షరాన్ని వాడటాన్నే "యతి మైత్రి" అంటారు

యతి అంటే విరామం అని అర్థం. లయబద్ధమైన పద్య నడకలో సహజంగా వచ్చే విరామాన్ని యతి స్థానం అంటారు. తెలుగు పద్యాలలో ఈ యతి స్థానంలో ఉండే అక్షరం పాదం మొదటి అక్షరంతో "యతి మైత్రి" లో ఉండాలనేది నియమం.

ఈ క్రింది అక్షర వర్గాలలో ఒక వర్గంలోని అన్ని అక్షరాలూ పరస్పరం యతి మైత్రిలో ఉంటాయి.

  1. అ, ఆ, ఐ, ఔ, హ, య, అం, అః
  2. ఇ, ఈ, ఎ, ఏ, ఋ
  3. ఉ, ఊ, ఒ, ఓ
  4. క, ఖ, గ, ఘ, ఞ, క్ష
  5. చ, ఛ, జ, ఝ, శ, ష, స, ఙ
  6. ట, ఠ, డ, ఢ, ణ
  7. త, థ, ద, ధ, న
  8. ప, ఫ, బ, భ, మ, వ
  9. ణ, న
  10. ర, ఱ, ల, ళ


హల్లుల యతి మైత్రి పాటించేటప్పుడు వాటితో కూడిన అచ్చులకు కూడా యతి మైత్రి పాటించాలి. అంటే: "చ", "జ" ఒకే యతి మైత్రి వర్గంలో ఉన్నా "చ" కి "జి" తో మైత్రి కుదరదు.

సంయుక్తాక్షరాలు వచ్చిన చోట, యతి కోసం ఏ అక్షరాన్నైనా గణించవచ్చు. ఉదా: "క్రొ" మొదటి అక్షరం అనుకోండి. యతి మైత్రి కోసం దీన్ని "కొ" గా గానీ "రొ" గా గానీ భావించ వచ్చు.

బాహ్య లంకెలు

"https://te.wikipedia.org/w/index.php?title=యతి&oldid=192574" నుండి వెలికితీశారు