పామాయిల్ రిఫైనింగ్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3: పంక్తి 3:
[[దస్త్రం:bleaching.jpg|thumb|right|బ్లిచింగ్‌విభాగం.]]
[[దస్త్రం:bleaching.jpg|thumb|right|బ్లిచింగ్‌విభాగం.]]


<big><big> written by:palagiri Rama Krishna Reddy</big></big>
<big><big> written by:Palagiri Rama Krishna Reddy</big></big>


ఆయిల్‌మిల్‌ నుండి వచ్చు క్రూడ్‌ పామాయిల్‌లో ఫ్రీఫ్యాటి ఆమ్లాలు, [[తేమ]], మలినాలు, వాసన కల్గించు పదార్థాలు వుండును. సంతృప్త ఫ్యాటి ఆమ్లశాతం 50% మించి వుండటం వలన నూనె చిక్కగా వుండును. కెరోటినులు 800-1000 ppm వరకు వుండటం వలన, పామాయిల్‌ [[పసుపు]], ఆరెంజిల మిశ్రమ [[రంగు]]లో వుండును. కావున క్రూడ్‌ పామాయిల్ నేరుగా వంటనూనెగా వినియోగించుటకు పనికిరాదు. క్రూడాయిల్‌లో3-5% వరకు F.F.A. వుండును. ఎఫ్.ఎఫ్.ఎ.వలన నూనెకు చేదు రుచి కల్గుతుంది, మరియు తక్కువ ఉష్ణోగ్రత వద్ద పొగ వెలువడుతుంది. ఫ్రీఫ్యాటిఆమ్లాలు, తేమ, గమ్స్‌, వలన నూనెలో కెటొన్స్‌, అల్డిహైడ్స్‌, ఉత్పన్నమగును. వీటన్నింటిని తొలగించిన తరువాతనే పామాయిల్‌ను వంటనూనెగా ఉపయోగించటానికి వీలవుతుంది.ఈ విధంగా వ్యర్ధపదార్థాలను, ఫ్రీఫ్యాటి ఆమ్లాలను తొలగించి, కలరు బ్లీచింగ్, డిఒడరైజెసన్‌ చేసి, నూనెను వాడకానికి అనుకూలంగా చెయ్యు ప్రక్రియను శుద్ధీకరణ (Refining) అందురు. ఈ విధంగా ప్రాసెస్‌చేసిన నూనెను రిపైండ్‌ పామాయిల్‌ అంటారు.
ఆయిల్‌మిల్‌ నుండి వచ్చు క్రూడ్‌ పామాయిల్‌లో ఫ్రీఫ్యాటి ఆమ్లాలు, [[తేమ]], మలినాలు, వాసన కల్గించు పదార్థాలు వుండును. సంతృప్త ఫ్యాటి ఆమ్లశాతం 50% మించి వుండటం వలన నూనె చిక్కగా వుండును. కెరోటినులు 800-1000 ppm వరకు వుండటం వలన, పామాయిల్‌ [[పసుపు]], ఆరెంజిల మిశ్రమ [[రంగు]]లో వుండును. కావున క్రూడ్‌ పామాయిల్ నేరుగా వంటనూనెగా వినియోగించుటకు పనికిరాదు. క్రూడాయిల్‌లో3-5% వరకు F.F.A. వుండును. ఎఫ్.ఎఫ్.ఎ.వలన నూనెకు చేదు రుచి కల్గుతుంది, మరియు తక్కువ ఉష్ణోగ్రత వద్ద పొగ వెలువడుతుంది. ఫ్రీఫ్యాటిఆమ్లాలు, తేమ, గమ్స్‌, వలన నూనెలో కెటొన్స్‌, అల్డిహైడ్స్‌, ఉత్పన్నమగును. వీటన్నింటిని తొలగించిన తరువాతనే పామాయిల్‌ను వంటనూనెగా ఉపయోగించటానికి వీలవుతుంది.ఈ విధంగా వ్యర్ధపదార్థాలను, ఫ్రీఫ్యాటి ఆమ్లాలను తొలగించి, కలరు బ్లీచింగ్, డిఒడరైజెసన్‌ చేసి, నూనెను వాడకానికి అనుకూలంగా చెయ్యు ప్రక్రియను శుద్ధీకరణ (Refining) అందురు. ఈ విధంగా ప్రాసెస్‌చేసిన నూనెను రిపైండ్‌ పామాయిల్‌ అంటారు.

07:52, 6 డిసెంబరు 2018 నాటి కూర్పు

పామాయిల్‌రిఫైనరి.
బ్లిచింగ్‌విభాగం.

written by:Palagiri Rama Krishna Reddy

ఆయిల్‌మిల్‌ నుండి వచ్చు క్రూడ్‌ పామాయిల్‌లో ఫ్రీఫ్యాటి ఆమ్లాలు, తేమ, మలినాలు, వాసన కల్గించు పదార్థాలు వుండును. సంతృప్త ఫ్యాటి ఆమ్లశాతం 50% మించి వుండటం వలన నూనె చిక్కగా వుండును. కెరోటినులు 800-1000 ppm వరకు వుండటం వలన, పామాయిల్‌ పసుపు, ఆరెంజిల మిశ్రమ రంగులో వుండును. కావున క్రూడ్‌ పామాయిల్ నేరుగా వంటనూనెగా వినియోగించుటకు పనికిరాదు. క్రూడాయిల్‌లో3-5% వరకు F.F.A. వుండును. ఎఫ్.ఎఫ్.ఎ.వలన నూనెకు చేదు రుచి కల్గుతుంది, మరియు తక్కువ ఉష్ణోగ్రత వద్ద పొగ వెలువడుతుంది. ఫ్రీఫ్యాటిఆమ్లాలు, తేమ, గమ్స్‌, వలన నూనెలో కెటొన్స్‌, అల్డిహైడ్స్‌, ఉత్పన్నమగును. వీటన్నింటిని తొలగించిన తరువాతనే పామాయిల్‌ను వంటనూనెగా ఉపయోగించటానికి వీలవుతుంది.ఈ విధంగా వ్యర్ధపదార్థాలను, ఫ్రీఫ్యాటి ఆమ్లాలను తొలగించి, కలరు బ్లీచింగ్, డిఒడరైజెసన్‌ చేసి, నూనెను వాడకానికి అనుకూలంగా చెయ్యు ప్రక్రియను శుద్ధీకరణ (Refining) అందురు. ఈ విధంగా ప్రాసెస్‌చేసిన నూనెను రిపైండ్‌ పామాయిల్‌ అంటారు.

ఫిల్టరుప్రెస్సు.
డి్‌అసిడిఫైయరు.
రిఫైండ్‌ పామాయిల్

ఆయిల్ రిపైనింగ్ రెండు రకాలు.1.కెమికల్‌ రిపైనింగ్,2.పిజికల్‌ రిపైనింగ్‌ లేదా స్టీం డిస్టిలెసను పద్ధతి.

పామాయిల్‌ను ఫిజికల్‌/డిస్టిలెసన్ రిపైనింగ్ పద్ధతి ద్వారా రిపైన్‌చెయ్యుదురు.ఫిజికల్‌రిపైనింగ్‌లో ప్రాసెసింగ్ దశలు.1.డిగమ్మింగ్2.బ్లిచింగ్ 3.డిఆసిడిఫికెసను 4.ఫ్ఫ్రాక్చనెసను

డిగమ్మింగ్(degummimg)

క్రూడ్‌ పామాయిల్‌లో గమ్స్‌ 0.5- 1.0% వరకు వుండును. పామాయిల్‌లోని గమ్స్‌ను ఫాస్పారిక్‌ ఆసిడ్‌ను వుపయోగించి తొలగించెదరు.ఒకటన్ను నూనెకు 1-1.5లీటరు పాస్పారిక్‌ఆసిడ్‌ను వుపయోగిస్తారు.డిగమ్మింగును బ్యాచ్‌పద్ధతిలో లేదా కంటిన్యుయస్‌ పద్ధతిలో చేయుదురు.

బ్యాచ్‌డిగమ్మింగ్

10-15 టన్నుల పామాయిల్‌ను డిగమ్మింగ్‌ కెటిల్‌ లేదా న్యూట్రలైజరులో తీసుకుందురు. యిది పైభాగంలో స్తూపాకారంగా వుండి, అడుగుభాగంలో శంకువు రూపంలో వుండును.కెటిల్‌లో ఆయిల్‌ను వేడి చెయ్యుటకు స్టీము కాయిల్స్‌ వుండును. పామాయిల్‌ను బాగా కలియ తిప్పుటకై అజిటెటరు షాప్టు వుండును. డిగంమ్మింగ్‌ కెటిల్‌లోని నూనెను అజిటెటరు ద్వారా కలియ తిప్పుతు, స్టీం కాయిలు ద్వారా 60-700C వరకు నూనెను వేడి చేసెదరు.పాస్పారిక్‌ఆసిడ్ (85%గాఢత) ను నీటితో 1:1 రేషియో/నిష్పత్తిలో కలిపి, కేటిల్‌లోని నూనెకు చేర్చెదరు. పాస్పారిక్‌ ఆసిడ్‌ను నెమ్మదిగా15-20 నిమిషాల సమయం పట్టూనట్లు కలపాలి. యిప్పుడు నూనె ఉష్ణోగ్రతను క్రమంగా 75-80{0C వరకు వేడిచేసి, కనీసం 20-30 నిమిషాలు కలియ తిప్పవలెను.ఈ విధంగా కలియతిప్పటం వలన నూనెలోని గమ్స్‌ (ఫాస్పాటైడ్స్) పాస్పారిక్ ఆసిడ్‌తో కలసి అపక్షేపంగా మారును. తరువాత నూనెను బ్లీచరుకు పంపెదరు. ఎక్కువ టన్నుల నూనెను రిపైన్‌చెయ్యు రిపైనరిలలో 'ఆన్‌లైన్'విధానంలో డిగంమ్మింగ్‌ చెయ్యుదురు. దీనినే కంటిన్యూయస్‌డిగంమ్మింగ్‌ అంటారు.

కంటిన్యూయస్‌ డిగమ్మింగ్

ఈ విధానంలో బ్లిచరు ఎర్తు మిక్చరుకు నూనె వెళ్ళుముందు, పామాయిల్‌కు డోసరు/doser ద్వారా కంటిన్యూయస్‌గా పాస్పారిక్‌ ఆసిడ్‌ను కలుపుతారు. మొదట నూనెను 75-800C వరకు ప్లేట్‌హీట్‌ ఎక్చెంజరు ద్వారా వేడిచేసి, డొసింగ్‌ పంపు ద్వారా కావలసిన మేర (0.1%) పాస్పారిక్‌ ఆసిడ్‌ను పామాయిల్‌లో కలుపుతారు. ఆయిల్, పాస్పారిక్‌ఆసిడ్‌ల మిశ్రమాన్ని ఆన్‌లైన్‌ మిక్చరుకు పంపెదరు. అన్‌లైన్‌సైక్లోన్‌ రూపంలో వుండును. ఇక్కడ గమ్స్‌ పాస్పరిక్‌ ఆసిడ్‌తో కలసి అవక్షేప రూపంలో వేరుపడును. కొన్ని రిపైనరిలలో ఫాస్ఫారిక్‌ ఆసిడ్ బదులుగా ఫాస్ఫా లిపెజ్‌ A2 బయోకెటలిస్ట్‌ను వుయోగిస్తారు. ఈ పద్ధతిని ఎంజైమ్‌ డిగంమ్మింగ్‌ అందురు. ఎంజైమ్‌ డిగంమ్మింగ్‌లో కెటలిస్ట్‌, పాస్ఫొటైడ్స్‌లోని C2 పొజిసను ఫ్యాటిఆమ్లంను హైడ్రొలైజ్‌చేసి హైడ్రబుల్1-అసైల్‌పాస్పోలిపిడ్‌గా మార్చును. లిసొపస్పొలిపిడులను వాటరు డిగంమ్మింగ్‌ ద్వారా తొలగించెదరు.

బ్లిచింగ్/రంగు తగ్గించడం

బ్లిచింగ్‌ ద్వారా నూనె కలరును తగ్గించడ జరుగుతుంది.బ్లించింగ్‌ కూడా రెండు రకాలు, 1.బ్యాచ్‌పద్ధతి, 2.కంటిన్యూయన్ పద్ధతి. పామాయిల్‌ను కంటిన్యూయస్‌ బ్లిచింగ్‌ పద్ధతిలోనె బ్లీచ్ చెయ్యుదురు. బ్లిచింగ్‌సెక్షనులో 1.ఎర్తుమిక్చరు,2.బ్లిచరు,3.ఫిల్టరు లు వుండును.

.ఎర్తు మిక్చరు

ఎర్తు మిక్చరు ఎం.ఎస్.లేదా ఎస్.ఎస్.తో చేసిన స్తుపాకారపాత్ర. నూనెను కలియతిప్పుటకై అజిటెటరు వుండును.ఎర్తు మిక్చరులో పామాయిల్‌కు కావల్సిన ప్రమాణంలో బ్లిచింగ్‌ ఎర్తును కలుపుతారు. బ్లిచింగ్‌ఎర్తు నూనెలోని కలరు పదార్థాలను శోషించుకొని, రంగును తగ్గించును.బ్లిచింగ్‌ఎర్తును పుల్లర్స్‌ఎర్తు నుండి తయారు చెయ్యుదురు.

బ్లిచింగ్/పుల్లర్స్‌ఎర్తులు

బ్లిచింగు ఎర్తు/బ్లిచింగు మట్టి హైడ్రెటెడ్‌ సోడియం సిలికెట్‌యొక్క సమ్మేళన పదార్థం.బ్లిచింగ్‌ ఎర్తును బెంటొనైట్‌, అట్టపుల్లిట్, మొంట్‌ మొరిల్లొనైట్‌^ల నుండి చేయుదురు. బ్లిచింగ్‌ ఎర్తులో అధికశాతంలో సిలికేట్స్, అల్యుమినా వుండును. సిలికాన్‌డైఅక్షైడ్‌ 65-70%. .అల్యుమిన 10-15%, మెగ్నిసియమ్, కాల్సియం, ఫెర్రస్‌లన్ని కల్పి 10-15% వుండును. పుల్లర్స్‌ఎర్తునూ వేడిచేసి అక్టీవెట్‌చెయుదురు. ఇలా చేసిన ఎర్తులను నాచురల్ బ్లిచింగ్ ఎర్తులందురు. అక్టివెట్‌చేసిన బ్లిచింగ్‌ఎర్తుల ఉపరితల వైశాల్యం 40-120m2/g వుండును. అదే సల్ప్యురిక్‌ ఆసిడ్, లేదా హైడ్రొక్లొరిక్‌ ఆసిడ్ తో అక్టివెట్‌ చేసిన ఎర్తుల ఉపరితలవైశాల్యం 250-300m 2/g వుండును. అసిడ్‌అక్టివేటెడ్‌ ఎర్తులనే రిఫైనరిలలో వుపయోగిస్తున్నారు. బ్లిచింగ్‌ఎర్తులో ప్రి మాయిచ్చరు 13-18% వుండును. బల్క్‌డెన్సిటి:0.48-0.56 వుండును. కాంపాక్టెడ్‌ బల్క్‌డెన్సిటి: 0.88-0.91 వుండును. 200 నెంబరు మెష్‌లో 75% జల్లింపు అయ్యెలా ఎర్తుసైజు వుండాలి.

మిక్చరుకు వచ్చిన పామాయిల్‌ అయిల్‌ ఫ్లోరేటును బట్టి ఎర్తు డోసింగ్/మోతాదు వుండును. ఒకటన్ను నూనెకు 10కే.జి.ల బ్లిచింగ్‌ ఎర్తును కలుపుతారు. బ్లిచింగ్‌ ఎర్తును కలిపిన తరువాత నూనెను బ్లిచరుకు పంపెదరు.

బ్లిచరు

బ్లిచరు ఎస్.ఎస్.తోచేసిన నిలువుగావున్న స్తుపాకారాపాత్ర.నూనెను కలియతిప్పుటకై లోపల మెకానికల్‌అజిటెటరు లేదా ఓపన్‌స్టీము అజిటెసనుసిస్టము వుండును. బ్లిచరులో మొదట 600-650mm/Hg వ్యాక్యుంను, జెట్‌ స్టిముఎజెక్టరులద్వారా సృష్టించెదరు. నూనెను వాతావరణ ఉష్ణోగ్రతలో 1000C మించి వేడిచేసిన, గాలిలోని అక్సిజనుతో కల్సి ఆక్షీకరణ చెందును. బ్లిచరులో నూనెను 110-1150C వరకు వేడిచెయ్యవలసి ఉంది.అందుచే బ్లిచరులో వ్యాక్యుం అవసరం.బ్లిచరులో నూనెను110-1150C వరకు స్టీముకాయిల్స్‌ద్వారా వేడి చేసి, 25-30 నిమిషాలసేపు బ్లిచరులో కలియతిప్పుదురు. ఈసమయంలో నూనెలోని రంగుపదార్థములు బ్లిచింగ్‌ఎర్తు వలన శోషింపబడును. బ్లిచింగ్‌అయిన నూనెను ఫిల్టరుప్రెస్‌లకు పంపి, ఫిల్టరుచేసి, బ్లిచింగ్‌ ఎర్తును తొలగించెదరు.

ఫిల్టరు ప్రెస్

మాములుగా నూనె గింజల నూనెను ఫిల్టరుచెయ్యుటకు ప్రేమ్‌‍‍‍‍ &ప్లెట్‌ రకపు ఫిల్టరు ప్రెస్‌లను వాడెదరు.ప్రెమ్&ప్లేట్‌ ఫిల్టరులను కాస్ట్ట్‌ ఐరన్ లేదా పాలిప్రొపలిన్‌తో చెయుదురు. పామాయి బ్లిచ్డ్‌నూనెను నిలువుగా వుండే ప్రెసరు లీప్‌ ఫిల్టరులలో ఫిల్టరు చెయుదురు. ప్రెసరు లీప్‌ఫిల్టరు షెల్‌ (బయటి భాగం) ఎమ్.ఎస్, తో చెయ్యబడి, స్తుపాకారంగా వుండి, శంకువు వంటి అడుగుభాగంవుండును. లోపల ఎస్, ఎస్, ఫిల్టరు మెష్‌లున్న ఫిల్టరులీప్ ప్రేమ్‌ లుండును. ఫిల్టరు కెపాసిటిని అనుసరించి, షెల్‌సైజు, ఫిల్తరుల సైజు, సంఖ్య పెరుగును. బ్లిచ్డ్‌అయిల్‌ను ఫిల్టరుప్రెసుకు పంపినప్పుడు, ఎస్, ఎస్, ఫిల్టరుమెష్‌వెలుపలివైపున ఎర్తుపూతలా ఏర్పడేవరకు నూనె మబ్బుగా (cloudy) వచ్చును. ఎర్తుపూతగా ఏర్పడిన పిమ్మట, ఫిల్టరు అయిన క్లియరునూనె మెష్‌లోపలనుండి మెష్‌ ప్రెమ్‌లకున్న రంధ్రంల ద్వారా బయటకు వచ్చును.ఫిల్టరుఅయిన బ్లిచ్డ్‌పామాయిల్‌ను బ్లిచ్డ్‌ఆయిల్‌స్టొరేజి టాంకునకు పంపెదరు. ఫిల్టరు షెల్‌లోనిఎర్తును స్'పెంట్‌ఎర్తు'. స్పెంట్‌ఎర్తు/వాడిన ఎర్తును స్టీముద్వారా డ్రై చేసి, బయటకు వదిలెదరు.స్పెంట్‌ బ్లిచింగ్‌ఎర్తులో20-25%వరకు నూనె శోషింపబడివుండును. స్పెంట్‌ఎర్తులోని నూనెను సాల్వెంట్‌ ఎక్స్‌ట్రాక్షను ప్లాంట్‌ ద్వారా తీయుదురు. స్పెంట్‌ఎర్తు నుండి తీసిన నూనె తిరిగి రిఫైండ్‌ చెయుటకు పనికిరాదు.స్పెంట్‌ఎర్తునుండి తీసిననూనెను సబ్బులు, ఫ్యాటిఆసిడులు తయారుచేయుటకు వాడెదరు.

డి అసిడిఫికెసను(de acidification)

బ్లిచింగ్‌ చేసిన పామాయిల్‌ను డిఅసిడిఫియరుకు పంపి, ఆయిల్‌లోని ఫ్రీఫ్యాటి ఆసిడులను వేపరులగా మార్చి తొలగించి, కలరు పెగ్మెంట్స్‌ను హీట్‌బ్లీచ్‌చేసి నూనె రంగును తగ్గించెదరు.డిఅసిడిఫైయరు ఎస్.ఎస్. తోచెయ్యబడి, స్తుపాకారంగావుండి,4-6 కంపార్టుమెంటులను కలిగి వుండును.ప్రతి కంపార్టుమెంటు కూడ చిన్నగదులుగా విభజింపబడి వుండును.ఇలా చిన్నగదులుగా వుండటంవలన నూనెఎక్కువ సమయం వుండుట వలన డి అసిడిఫికెసను బాగా సమర్ధవంతంగా జరుగును.ప్రతి కంపార్టుమెంటులో వేపరులను గ్రహించుటకై వేపరు గొట్టాలుండును.పైనున్న రెండు కంపార్టుమెంటులలో అడుగున నూనెను వేడియుటకు థెర్మొఫ్లుయిడ్ హిటింగ్‌ కాయిల్‌ వుండును. డిఅసిడిఫైయరు 756-758mm/Hg వ్యాక్యుంలో(1-2 మి.మీ ప్రెసరులో) వుండును. వ్యాక్యుంను హైవ్యాక్యుం మల్టి స్టెజి స్టిమ్‌ ఎజెక్టరుల ద్వారా సృష్టించెదరు.డిఆసిడిఫైయరులో జరుగు చర్యలను గమనించుటకై వ్యూ గ్లాసులుండును.బ్లిచ్డ్‌ ఆయిల్‌ను మొదట 90-950C వరకు వేడిచేసి, డిఎయిరెటరుకు పంపి నూనెలోని గాలిని తొలగించెదరు. డి ఎయిరెటరు కూడా పూర్తివ్యాక్యుంలో వుండును.రిఫైండ్అయ్యి డి అసిడిఫైయరు నుండి వచ్చునూనె ఉష్ణోగ్రత 200-2150Cవరకు వుండును.డిఎయిరెటరు గుండా బయటకువచ్చు నూనెను హీట్‌ఎక్సెంజరు కాయిలుల ద్వారా, డి అసిడిఫైయరునుండి వచ్చునూనెద్వారా140-1500C వరకు వేడిచేయుదురు.ఈ విధంగా 140-1500Cవరకు వేడెక్కిన నూనెను థెర్మొఫ్లుయిడ్‌ హీట్‌ఎక్సెంజరుకు పంపి 240-250C వరకు వేడిచెయుదురు.ఈ ఉష్ణోగ్రతలో వున్న నూనెను మొదట ప్రి డిస్టిలరుకు పంపెదరు.ప్రిడిస్టిలరు కూడా ఎస్.ఎస్.చేయబడి, థెర్మొ ఫ్లుయిడ్‌ హీటింగ్‌ కాయిల్స్, ఒపన్‌ స్టీమ్‌కాయిల్స్ కలిగివుండును. ప్రిడిస్టిలరుకూడా పూర్తి వ్యాక్యుంలోవుండి, దీని వేపరుల గొట్టం, డి అసిడిఫయరు వేపరు గొట్టానికి అనుసంధానించి వుండును.ఈ రెండు వేపరుగొట్టాలు ఫ్యాటిఆసిడ్ స్క్రబ్బరుకు క్రిందిభాగంలో షెల్‌కు పక్కభాగంలో కలుపబడివుండును.స్క్రబ్బరు పైభాగంనుండి ఒకగొట్టం వ్యాక్యుం తయారుచెయ్యు ఎజెక్టరులకు కలుపబడి వుండు ను. ప్రిడిస్టిలరుకు వచ్చిననూనెను సూపరుహీటెడ్‌ ఒపను స్టీము ద్వారా బాగా కలియబెట్టడం వలన నూనెలోని ఫ్యాటిఆమ్లాలు (కొవ్వు ఆమ్లాలు) వేపరులగా మారి ఫ్యాటి ఆసిడ్‌ స్క్రబ్బరుకు వేపరు గొట్టాంద్వారా వెళ్ళును. ప్రిడిస్టిలరులో 75-85% వరకు ఫ్యాటిఆమ్లాలు తొలగింపబడును.ఫ్యాటిఅమ్లాలు వేపరులుగా మారడం వలన నూనె ఉష్ణోగ్రత తగ్గును.థెర్మొఫ్లుయిడ్‌కాయిలులద్వారావేడిచేసి నూనె ఊష్ణొగ్రతను240-2500Cకు పెంచదరు. ప్రిడిస్టిలరులో కొంత నియమిత ఎత్తువరకు నూనెనిల్వవుండి, మిగతా నూనె ఒక సైపను ద్వారా డి అసిడిఫయరు యొక్క పైభాగంలోని కంపార్టుమెంటుకు ప్రవహించును. డిఅసిడిఫైయరులో నూనె క్రమంగా ఒక కంపార్టుమెంటు నుండి దిగువ కంపార్టుమెంటుకువెళ్ళును,రెండో గది నుండి మూడో గదికి,అక్కడి నుండీ నల్గవగదికి అలావరుస క్రమంగా దిగువన వున్న చివరి కంపార్టుమెంటుకు వెళ్ళును. ప్రతి కంపార్టుమెంటులో తయారగు వేపరులన్ని డిఅసిడిఫైయరు కున్న వేపరు గొట్టానికి వెళ్ళెలా, గది మధ్యలో వేపరు గొట్టాలు వుండును.అలాగే గదులలోని నూనె బాగా అజిటెసను చేయ్యుటకై సూపరు హీటెడ్‌ ఒపను స్టీముకాయిల్స్ వుండును.నూనెను కలియతిప్పడం వలన, పైభాగంలోనున్ననూనె గది క్రిందికి, క్రిందినూనె పైకి వెళ్లడం వలన నూనెలోని ఫ్యాటిఆమ్లాలు, కలరు పిగ్మెంట్స్‌ త్వరగా వేపరులూగా మారును.అతి తక్కువ పీడనం వద్ద (2-4టారు) ఎక్కువ ఉష్ణోగ్రతవద్ద కొన్నిరకాల కలరుపిగ్మెంటులు, హీట్‌బ్లీఛ్‌ వలన రంగునుకోల్పొవును.2-4టారు పీడనం756-758mm/Hg వ్యాక్యుంకు సమానం.ఫ్యాటిఆమ్లాలు, రంగుకారక పధార్థాలతో పాటు, నూనెలోని వాసన కారక పదార్థాలు కూడా తొలగింపబడును.పూర్తిగా రిఫైండు అయ్యిక్రింది కంపార్టుమెంటునుండి బయటకు వచ్చునూనెను మొదట హీట్‌ఎక్సెంజరుకు పంపి, బ్లిచ్డ్‌అయిల్‌ను వేడిచేసిన తరువాత, కండెన్సరుకు పంపి 45-50) Cకు చల్లార్చి స్టొరేజి టాంకునకు పంపెదరు.

ప్రిడిస్టిలరు మరియు డిఅసిడిఫయరులో ఎర్పడిన ఫ్యాటిఆమ్లాల వేపరులను వేపరుగొట్టంద్వారా ఫ్యాటిఆసిడుల స్క్రబ్బరుకు పంపెదరు. స్క్రబ్బరులో వేపరులు అడుగుభాగం నుండి పైభాగానికి పయనించునప్పుడు, స్ప్రె నాజిలుల ద్వారా 60-650C వున్న ఫ్యాటి ఆమ్లమును స్ప్రేచేసి వేపరులుగా వున్న ఫ్యాటి ఆమ్లాలను ద్రవరూపానికి మార్చెదరు.స్క్రబ్బరులో నియమిత మేర వరకు ఫ్యాటీఆమ్లం వచ్చిన తరువాత ఫ్యాటిఆమ్లాన్ని కండెన్సరు ద్వారా ఫ్యాటిఆసిడ్‌స్టొరేజి టాంకునకు పంపించెదరు.ఫ్యాటి ఆమ్లాలను సబ్బుల, గ్రీజుల తయారిలో వుపయోగిస్తారు.

డి అసిడిఫైయరు నుండివచ్చు రిఫైండుపామాయిలు 8-12 యూనిట్లకలరు (1"సెల్) కలిగివుండును.ద్రవీభవన ఉష్ణోగ్రత 34-350C.అయోడిన్ విలువ 56-57. పామాయిలులో45-50%వున్న పామాటిక్ ఆసిడ్ కారణంగా పామాయిల్‌ మెల్టింగ్‌పాయింట్‌ ఎక్కువగా వుండి త్వరగా గడ్దకట్టును. అందుచే వంటలలో ఉపయోగించడం ఇబ్బందిగా వుండును.అందుచే పాక్షికరణ (fractionation) వలన పామాయిలులోని పామాటిక్‌ ఆసిడును కొంతమేరకు తొలగించడంవలన, పామాయిలు మాములు ఉష్ణోగ్రతవద్దకూడ ద్రవరూపంలోవుండి, త్వరగా గడ్దకట్టదు.తొలగించిన పామెటిక్‌ఆసిడువున్న భాగాన్ని పామ్‌ స్టియరిను అంటారు.దీని మెల్టింగుపాయింటు53-540C, ఐయోడిన్‌ విలువ33-36వుండును.పామ్‌స్టియరినును వనస్పతి, మార్గరినుల తయారి, రబ్బరు టయర్ల తయారిలో విరివిగా వినియోగిస్తారు.పామాయిలులో తొగించిన పామిటిక్‌ ఆసిడ్‌ శాతంనుబట్టి పామాయిలు మెల్టింగుపాయింటు తగ్గును.ఇలా పామిటిక్‌ఆసిడును తగ్గించిన నూనెను'పామోలిన్‌నూనె'అందురు.మార్కెట్టులో ప్యాకెట్టుల ద్వారా లభిస్తున్నది పామోలిన్ ఆయిల్.15% వరకు పామ్‌స్టియరిను తొలగించిన నూనెను 'పామొలిన్‌ఆయిల్‌'అని,25% వరకు పామ్‌స్టియరిన్‌ను తొలగించిననూనెను 'సూపరు పామొలిన్‌ఆయిల్‌'అందురు.పామోలిన్‌ఆయిల్‌మెల్టింగ్‌పాయింట్:20-220C, ఐయోడిను విలువ52, క్లౌడ్‌పాయింట్ 180Cవుండును.సూపరు పామోలిన్‌అయిల్‌ ఐయోడిన్‌ విలువ 62-65, క్లౌడ్‌పాయింట్ 10-110C వుండును.

ఫ్రాక్చనెసను

ఫ్రాక్చనెసనులో రిపైండు పామాయిల్‌ను 'క్రిస్టలైజరుల' లోనెమ్మదిగా కలియతిప్పుతూ 25-300C వరకు నెమ్మదిగా చల్లబరచినచో (5-6గంటలసేపు) పామాయిల్‌లోని సంతృప్త ఆసిడులధికంగా వున్న గ్లిసెరైడులు, ఘనరూపంలోకి మారి పూసల రూపంలో ఏర్పడును. ఇలా ఎర్పడిన పూసల వలే వున్న పామ్‌స్టియరిన్‌ను 'ఫిల్టరుప్రెస్‌'లో ఫిల్టరుచేసి, పామ్‌స్టియరిన్‌ని వేరుచెయ్యుదురు.

ఫ్రాక్చనెసను మూడు రకాలు.

1.డ్రైఫాక్చనెసను

2.సాల్వెంట్‌ఫ్రాక్చనెసను

3.వెట్‌లేదా డిటెర్జెంట్‌ఫ్రక్చనెసను.

వీటన్నింటిలో డ్రైఫ్రాక్చనెసను సింపిల్‌, మరియు చౌక విధానం.సాల్వెంట్‌ఫ్రాక్చనెసనులో నూనెకు ఆర్గానిక్‌ సాల్వెంట్ (హైడ్రొకార్బను సాల్వెంట్) ను కలిపి మిసెల్లా చేసి, తక్కువ ఉష్ణోగ్రత కు చల్లబరచి, పామ్‌ స్టియరిన్‌ను ఘనీభవింపచేసి, ఫిల్టరుచేసి పామ్‌స్టియరిన్‌ను వేరు చేయుదురు. పామోలిన్‌ను కలిగిన మిసెల్లాను డిసాల్వెంట్‌ చేసి పామోలిన్‌ను వేరు చేయుదురు. పాంస్టియరిన్‌కు అసిటోన్‌వాషింగ్్‌యిచ్చి, డిసాల్వెంట్ చేయుదురు.డిటెర్జెంట్‌ఫ్ఫ్రాక్చనెసనులో సోడియంలారెల్‌ను వెట్టింగ్ ఏజెంట్‌గా ఉపయోగిస్తారు. వెట్టింగ్‌ఎజెంట్‌ను కలిపిననూనెను చిల్లింగ్‌చేసి, సెంట్రిఫ్యుజ్‌ ద్వారా వేరు చెయ్యుదురు.

డ్రైఫ్రాక్చనెసను

డ్రైఫ్రాక్చనెసనులో 1.క్రిస్టలైజరులు,2.చిల్లింగ్‌యూనిట్,3.ఫిల్టరు ప్రెస్‌లుండును.

క్రిస్టలైజరులో నూనెను తీసుకుని, చిల్లింగ్‌యూనిట్‌ద్వారా 10-150C కు చల్లబరచిన నీటినిక్రిస్టాలైసరు లోపలవున్నకాయిల్స్‌లోసర్కులెసను చేసి, నెమ్మదిగా (4-6గంటలు సమయం) నూనెను 26-280Cకుచల్లార్చెదరు. ఈ సమయంలో అజిటెటరు ద్వారా నూనెను కంటిన్యుయస్‌గా కలియతిప్పుడం కొనసాగుతుంది. ఇలా కలియతిప్పడం వలన నూనె అంతయు సమానంగా చల్లబడును. సంతృప్త ఫ్యాటి ఆమ్లాలను కలిగివున్న గ్లిసెరైడుల ద్రవీభవన ఉష్ణోగ్రత ఎక్కువ కావడంవలన, ఘనీభవించడం మొదల్వవుతుంది. మొదట చిన్నపూసలవలె (స్పటికంలు) ఘనీభవించడం ప్రారంభమవుతుండి. చిన్నపూసలు దగ్గరిగా చేరి వాటి పరిమాణం పెరుగును.నూనెలో కావలసిన విధంగా పామ్‌స్టియరిన్‌ స్పటికాలు ఏర్పడిన తరువాత నూనెను ఫిల్టరుప్రెస్‌కు పంపి ఫిల్టరు చెయ్యుదురు.

ఫిల్టరు ప్రెసు

క్రిస్టలైజరులో చల్లబరచిన పామాయిల్‌ను ఫిల్టరుప్రెసులో ఫిల్టరు చెయడం ద్వారా పామ్‌స్టియరిన్, పామోలిన్‌నూనెను వేరు చేయుదురు.

ఫ్రాక్చనెసనులో వాడు ఫిల్టరులు రెండు రకాలు.

1.ప్లేట్ & ఫ్రేమ్‌లేదా రెసెసెడ్్‌ప్లేట్‌ఫిల్టెర్ ప్రెస్

2.మెంబ్రెన్‌ ఫిల్టరు ప్రెసు

1.ప్లేట్&ఫ్రేమ్‌ ఫిల్టరు ప్రెసు:ప్రెమ్‌మరియుప్లెట్‌లు చతురస్రాకారంలోవుండును. ప్లెట్ తరువాత ఫ్రేమ్, తరువాత ప్లేట్, ఇలా ఒకదాని పక్కన మొకటిచొప్పున బిగించెదరుప్లెట్కు ఇరువైపుల ఫిల్టరుగుడ్డను కప్పి మూసెదరు. ప్లేట్‌కు క్రిందపక్కవైపుగా ఒకరంధ్రంవుండి, దానికి ఒకకాక్ (కుళాయి) బిగింఛివుండును. ప్లెట్&ఫ్రేమ్‌లకు ఇరువైపుల వంకీలవంటి (hooks) వుండి, ప్రెసుకు ఇరువైపులవున్న స్టీలుబద్దిలపై (tie bars) ప్లేట్‌ మరియు ఫ్రెమ్‌లను వేలాడ తీసి, ప్రెసుకు చివరవున్నహైడ్రలిక్‌సిలిండరు ద్వారా ప్లెటు, ఫ్రెములను దగ్గరిగా నెక్కెదరు. ప్లెటు, ఫిల్టరుక్లాతు అంచులనుండి నూనె బయటకు రానట్లుగా గట్టిగా దగ్గరికి చెర్చి బిగించెదరు. ప్లేటు, ఫ్రేముల సైజు 0.9X0.9 మీ. నుండి1.2X1.2మీ.వుండును. ఒకప్రెసుకు వుండు ప్లెటులసంఖ్య 30-100 వరకు వుండును. ప్లెటు, ఫ్రేములకు మధ్యలోకాని, మూలలోకాని రంధ్రం వుండును. ఈ రంధ్రంద్వారా నూనె ప్రెసు లోని అన్ని ప్లెటు, ఫ్రేములకు వెళ్ళును. నూనె మాములు ఇతరనూనెలను ఫిల్టరుచెయ్యుటకు కాటనుక్లాతును వాడెదరు. పామాయిల్‌ను ఫిల్టరు చెయ్యుటకు సింథెటిక్‌ ఫిల్టరుక్లాతును వాడుదురు. చిల్లింగ్‌చేసిన పామాయిల్‌ను పంపుద్వారా ఫిల్టరుప్రెసుకు పంపెదరు. ఫిల్టరుప్రెసుకు నూనెను పంపుటకు మాములుగా వాడు సెంట్రిఫ్యుగల్‌పంపుకు బదులు స్క్రూపంపును వాడెదరు. ఫిల్టరుప్రెసులోని ప్రేముకున్నఖాళిలో (ఫ్రేముకు ఇరువైపులఫిల్టరు క్లాత్‌కప్పివుండును) పామ్‌ స్టియరిన్ వుండి, పామోలిన్‌నూనె ప్లేటులకున్న కొళాయిలద్వారా క్రిందనున్న ట్రేలో పడును. ఫ్రేములమధ్య పామ్‌స్టియరిన్‌ నిండిపొయిన తరువాత, ఫిల్టరింగును నిలిపివేసి, ప్లేటు, ఫ్రేములను దూరంగా జరిపి, పాం్‌స్టియరిన్ నూ తొలగింఛి, క్లాత్‌ను శుభ్రంచేసి మళ్ళి బిగించెదరు.

2.మెంబ్రెనుఫిల్టరు కూడా పైవిధముగానే పనిచెయ్యును. కాకపోతే యిది PLC సిష్టముతో పనిచెయ్యును.

మూలాలు

1.FAO document" small scale palm oil processing"

2.Mark's "Introduction to fruit crops"