వాడుకరి:Gaddipati sreekanth: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త పేజీ: స్వాగతం. ఎప్పటినుంచో వికిపీడియా లో సభ్యుడినవ్వాలని.. తెలుగంట...
(తేడా లేదు)

08:47, 19 ఫిబ్రవరి 2008 నాటి కూర్పు

స్వాగతం.

ఎప్పటినుంచో వికిపీడియా లో సభ్యుడినవ్వాలని.. తెలుగంటే చాలా ఇష్టం.అది ఇది ఏమని అన్నీ ముట్టుకుని చూడాలని ఆరాటం. వృత్తి రీత్యా నిర్మాణ అభియంతను. సమయాభావం. ఇప్పటికి కుదిరింది.

కొన్నేళ్ళు మలేషియా లోనూ ఇంకొన్నాళ్ళు నైజీరియా లోనూ అఘోరించాను కనుక, చాలా విషయాలమీద కొంచెం ఎక్కువే అవగాహన ఉంది. నిదానంగానయినా మంచి పుటలు కూరుస్తాను.

తెలుగుతో పాటు తమిళం,కన్నడం,హిందీ,ఆంగ్లం కొద్దో గొప్పో పలకడమూ ,చదవడమూ, గిలకడమూ వచ్చును. దీనితో బాటు మలేషియా భాష 'మలే' కొంచెం వాగడమూ వచ్చును. అందుకని కొంచెం ఎక్కువ అధికారంతో చెప్పగలను. మనం తెలుగు నేలలో పుట్టడం ఎన్నెన్ని జన్మల పుణ్య ఫలమో.

పదండి. ఇప్పటికే సుసంపన్నమయిన మన సాహిత్య సంపదను మరింత వైభవోపేతం చేద్దాం.

గడ్డిపాటి శ్రీకాంత్.

Gaddipati sreekanth 08:47, 19 ఫిబ్రవరి 2008 (UTC)