వేమూరి నరసింహారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 34: పంక్తి 34:
== మూలాలు ==
== మూలాలు ==
* విశాలాంధ్ర పత్రికలో ప్రచురితమైన కథనం [https://www.todaynewshub.com/2018/11/11/%E0%B0%B5%E0%B0%9A%E0%B0%A8%E0%B0%95%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A4%E0%B0%B2%E0%B1%8B%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%B5%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%81-%E0%B0%B5%E0%B1%88%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A7%E0%B1%8D/]
* విశాలాంధ్ర పత్రికలో ప్రచురితమైన కథనం [https://www.todaynewshub.com/2018/11/11/%E0%B0%B5%E0%B0%9A%E0%B0%A8%E0%B0%95%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A4%E0%B0%B2%E0%B1%8B%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%B5%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%81-%E0%B0%B5%E0%B1%88%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A7%E0%B1%8D/]

* వేనరెడ్డి
[http://medbox.iiab.me/kiwix/wikipedia_te_all_maxi_2019-04/A/%E0%B0%B5%E0%B1%87%E0%B0%AE%E0%B1%82%E0%B0%B0%E0%B0%BF_%E0%B0%A8%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BF%E0%B0%82%E0%B0%B9%E0%B0%BE%E0%B0%B0%E0%B1%86%E0%B0%A1%E0%B1%8D%E0%B0%A1%E0%B0%BF]

12:11, 15 జూలై 2021 నాటి కూర్పు

వేమూరి నరసింహారెడ్డి ప్రసిద్ధ తెలుగు సాహితీవేత్త. ఈయన వే. న. రెడ్డి పేరుతో ప్రసిద్ధులు. చేతనావర్తన కవుల్లో ఒకరు.

జననం

వేనరెడ్డి 1939లో జనగామ జిల్లాలోని చిల్పూర్ మండలానికి చెందిన పల్లగుట్ట గ్రామంలో జన్మించారు.

ఉద్యోగం

వరంగల్ కళాశాలలో తెలుగు ఉపన్యాసకులుగా పనిచేశారు.

రచనలు

1962, 65లలో చైనా, పాకిస్తాన్‌ల దండయాత్రల సందర్భంగా పలువురు కవుల రచనలతో సమరగీతి, సమరభారతి అను కవితా సంకలనాలను ప్రచురించారు.

చేతనావర్తం మొదటి సంపుటిలో ఈయన రచించిన 'జన్మాష్టమి' ప్రతీకాత్మకంగా సాగిన కవిత. కృష్ణుని ఉద్దేశించి ఇలా రాశారు.

నువ్వు పుట్టడం మాత్రమే కటకటాలలో
నేను పుట్టింది మొదలు కటకటాలలోనే
ఈ ఇక్కట్ల ఉక్కు చువ్వల నడుమ
చిక్కుల చీకట్ల కట్ల నడుమ
తడబడే అడుగులతో వెతుకున్నారు
నీ కోసం, నీ అడుగు జాడల కోసం

ఇలా శ్రీకృష్ణుని జన్మాష్టమికి, ఆధునిక జీవితంలో ఎదురయ్యే అష్టకష్టాలకు భేదం లేదని తెలియజేయడం కనిపిస్తుంది.

వే. నరసింహారెడ్డి ”ఆకలి ఒక్కటే సత్యం” అన్నారు.

ఆకలి జాతీయమైంది
అంతర్జాతీయ మైంది
ఆకలికి కుల గోత్రాల్లేవు 
ఆకలి ఒక్కటే సత్యం
కనబడకుండా జ్వలిస్తుంది

అదేవిధంగా ఆయన రచించిన 'కవిత్వమే నా ఊపిరి', 'నీ కాళ్ల మీద నువ్వు', 'పిరికిగా చావకు', 'కాలాన్ని కత్తిరించి చూడకు' మొదలైన కవితల్లో మహత్తర సందేశం ఉంది.

మూలాలు

  • విశాలాంధ్ర పత్రికలో ప్రచురితమైన కథనం [1]
  • వేనరెడ్డి

[2]