వేమూరి నరసింహారెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వేమూరి నరసింహారెడ్డి తెలుగు సాహితీవేత్త.[1] అతను వే. న. రెడ్డి పేరుతో ప్రసిద్ధులు. అతను చేతనావర్తన కవుల్లో ఒకడు.

జీవిత విశేషాలు

[మార్చు]

వేనరెడ్డి 1939లో జనగామ జిల్లాలోని చిల్పూర్ మండలానికి చెందిన పల్లగుట్ట గ్రామంలో జన్మించాడు. వరంగల్ కళాశాలలో తెలుగు ఉపన్యాసకులుగా పనిచేశాడు.

రచనలు

[మార్చు]

1962, 65లలో చైనా, పాకిస్తాన్‌ ల దండయాత్రల సందర్భంగా పలువురు కవుల రచనలతో సమరగీతి, సమరభారతి అను కవితా సంకలనాలను ప్రచురించాడు.

చేతనావర్తం మొదటి సంపుటిలో ఈయన రచించిన 'జన్మాష్టమి' ప్రతీకాత్మకంగా సాగిన కవిత. కృష్ణుని ఉద్దేశించి ఇలా రాశారు.

నువ్వు పుట్టడం మాత్రమే కటకటాలలో
నేను పుట్టింది మొదలు కటకటాలలోనే
ఈ ఇక్కట్ల ఉక్కు చువ్వల నడుమ
చిక్కుల చీకట్ల కట్ల నడుమ
తడబడే అడుగులతో వెతుకున్నారు
నీ కోసం, నీ అడుగు జాడల కోసం

ఇలా శ్రీకృష్ణుని జన్మాష్టమికి, ఆధునిక జీవితంలో ఎదురయ్యే అష్టకష్టాలకు భేదం లేదని తెలియజేయడం కనిపిస్తుంది.

వే. నరసింహారెడ్డి ”ఆకలి ఒక్కటే సత్యం” అన్నారు.

ఆకలి జాతీయమైంది
అంతర్జాతీయ మైంది
ఆకలికి కుల గోత్రాల్లేవు
ఆకలి ఒక్కటే సత్యం
కనబడకుండా జ్వలిస్తుంది

అదేవిధంగా ఆయన రచించిన 'కవిత్వమే నా ఊపిరి', 'నీ కాళ్ల మీద నువ్వు', 'పిరికిగా చావకు', 'కాలాన్ని కత్తిరించి చూడకు' మొదలైన కవితల్లో మహత్తర సందేశం ఉంది.

మూలాలు

[మార్చు]
  1. admin (2018-11-11). "వచనకవితలోని వస్తు వైవిధ్య దర్పణం 'ఈతరం కోసం-వచన కవిత'". TodayNewsHub (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-10-18.