పులిహోర: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19: పంక్తి 19:
*పొంగలి పులిహోర
*పొంగలి పులిహోర
*చింతకాయ పులిహోర
*చింతకాయ పులిహోర

==చూడండి==
==చూడండి==
*http://shadruchulu.blogspot.com/2007/08/blog-post_22.html
*http://shadruchulu.blogspot.com/2007/08/blog-post_22.html

21:48, 26 జూన్ 2010 నాటి కూర్పు

ఘుమఘుమల పులిహోర

పెళ్ళిళ్ళకు అత్యధికంగా చేయబడే వంటకం పులిహోర. దీనిని తయారీకి ముందుగా చింతపండు పులుసును మిర్చి, అల్లం, వేరుశనగ గింజలు, మినుములు, పచ్చి శనగపప్పు, లాంటి పోపు పదార్ధాలను నూనెలో వేయించి తాలింపుగా మార్చి ఆ మిశ్రమాన్ని పక్కగా ఉంచాలి. వేడిగా వార్చిన అన్నాన్ని ముందుగా సిద్దం చేయబడిన చింతపండు పులుసును బాగా కలపాలి. దానితో అది పసుపు వర్ణంలోకి మారిన పులిహోరగా తయారవుతుంది. దీనికి మరింత రుచి కొరకు నిమ్మకాయల రసం పిండుకొంటారు.ఈ వంటకం తెలుగు వారి శుభకార్యక్రమములలో సర్వసాదారణంగా కనిపిస్తుంది.సద్ది అంటే పులిహోర. తెలంగాణాలో జరిగే బతుకమ్మ పండుగలో సద్దుల బతకమ్మకు తొమ్మిది రకాల సద్దులు సమర్పిస్తారు.చింతపండు, నిమ్మ, దబ్బ, దానిమ్మ, నువ్వులు, ఆవపిండి, పల్లీలు, కొబ్బరి మొదలైన వాటితో కూడా పులిహోరలు తయారు చేస్తారు.

పులిహోర చిట్కాలు

  • చాలా ఇళ్ళల్లో అన్నం మిగిలిపోయినపుడు ఇలా పులిహోరగా మార్చడం పరిపాటి.
  • పులిహోర చేసేందుకు అన్నం వండే ఎసరు నీటిలో ఒక టీస్పూన్ వెనిగర్ వేసి ఆ తరువాత ఎసరు మరుగుతుండగా బియ్యాన్ని వేసి ఉడికించాలి. ఇలా చేసినట్లయితే మెతుకులు అతుక్కోకుండా, పెద్దవిగా ఉంటాయి. తినేందుకు ఇది చాలా రుచిగా ఉంటుంది.
  • పులిహోరలో వేరుశెనగ గింజలు కరకరలాడుతూ ఉండాలంటే విడిగా నూనెలో వేయించాలి. అన్నంలో తాలింపు వేశాక, వేడి తగ్గిన తరువాత వేరుశెనగ గింజలు కలపాలి. ఇలా చేస్తే పులిహోర కూడా రుచిగా వుంటుంది.
  • పులిహోర రైస్ పొడి పొడిగా ఉండాలంటే బియ్యాన్ని బటర్‌తో వేయించి ఉడికించండి.

వివిధ రకాల పులిహోర

  • నిమ్మకాయ పులిహొర
  • దానిమ్మకాయ పులిహొర ,
  • మామిడికాయ పులిహొర.
  • దబ్బకాయ పులిహోర:
  • పంపర పనసకాయ పులిహోర
  • రాతి ఉసిరికాయ పులిహోర
  • రవ్వ పులిహోర:
  • టమాటో పులిహోర
  • అటుకుల పులిహోర
  • పొంగలి పులిహోర
  • చింతకాయ పులిహోర

చూడండి

"https://te.wikipedia.org/w/index.php?title=పులిహోర&oldid=522140" నుండి వెలికితీశారు