గెలీలియో గెలీలి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Robot: ru:Галилей, Галилео is a featured article
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: jbo:galileos.galileis
పంక్తి 136: పంక్తి 136:
[[it:Galileo Galilei]]
[[it:Galileo Galilei]]
[[ja:ガリレオ・ガリレイ]]
[[ja:ガリレオ・ガリレイ]]
[[jbo:galileos.galileis]]
[[jv:Galileo Galilei]]
[[jv:Galileo Galilei]]
[[ka:გალილეო გალილეი]]
[[ka:გალილეო გალილეი]]

20:12, 10 డిసెంబరు 2012 నాటి కూర్పు

గెలీలియో గెలీలి
Portrait of Galileo Galilei by Giusto Sustermans
జననం(1564-02-15)1564 ఫిబ్రవరి 15 [1]
పిసా, టుస్కానీ - ఇటలీ[1]
మరణం1642 జనవరి 8(1642-01-08) (వయసు 77)[1]
అర్సెట్రీ, టుస్కానీ - ఇటలీ[1]
నివాసంGrand Duchy of Tuscany
రంగములుఖగోళ శాస్త్రము, భౌతిక శాస్త్రము మరియు గణిత శాస్త్రము
వృత్తిసంస్థలుపాడువా యూనివర్శిటీ
చదువుకున్న సంస్థలుపిసా యూనివర్శిటీ
ప్రసిద్ధిKinematics
టెలీస్కోపు
సౌరమండలము

గెలీలియో గెలీలి (15 ఫిబ్రవరి 1564[2]8 జనవరి 1642)[1][3] ఇటలీ కు చెందిన భౌతిక శాస్త్రవేత్త, గణితజ్ఞుడు, భౌగోళిక శాస్త్రజ్ఞుడు మరియు తత్వవేత్త. టెలీస్కోపు (దూరదర్శిని) ను కనుగొన్నాడు.

గెలీలియో ఇటలీలోని పీసా నగరంలో జన్మించాడు. చిన్న వయసులో తండ్రి వద్దనే విద్యాభ్యాసం చేశాడు. తరువాత పీసా విశ్వవిద్యాలయంలో వైద్య విద్యార్ధిగా చేరాడు. అయితే అక్కడి గణితశాస్త్ర ఉపన్యాసాలకు ప్రభావితుడై వైద్యవిద్యను విడిచి, గణిత శాస్త్రాన్ని అధ్యయనం చేశాడు. ఆ తరువాత అక్కడే గణితశాస్త్రంలో ఉపన్యాసకులుగా చేరాడు.

అరిస్టాటిల్ తో విభేదం

గెలీలియో కాలం అనగా 16 వ శతాబ్దం వరకు క్రీ..పూ. 4వ శతాబ్దంలో గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ ప్రతిపాదించిన సిద్ధాంతాలే ప్ర్రాచుర్యంలో ఉండేవి. సృష్టిలోని సత్యాలనన్నిటినీ స్వచ్ఛమైన ఆలోచనల ద్వారా మాత్రమే వివరించవచ్చును. ప్రయోగాల ప్రమేయం ఏ మాత్రం అవసరం లేదన్నది అరిస్టాటిల్ సిద్ధాంతాల్లోని పెద్ద లోపం. ఉదాహరణకు: అరిస్టాటిల్ సిద్ధాంతం ప్రకారం వేర్వేరు బరువులు గల రెండు వస్తువులను కొంత ఎత్తు నుంచి స్వేచ్ఛగా వదిలితే ఎక్కువ బరువు గల వస్తువు తక్కువ కాలంలో భూమిని చేరుకుంటుంది. దీనితో ఏకీభవించని గెలీలియో పీసా గోపురం పైనుంచి 100 పౌండ్లు, 1 పౌండు బరువు గల రెండు ఇనప గుండ్లను ఒకేసారి క్రిందికి వదలి, అవి రెండూ ఒకే కాలంలో భూమిని చేరుకుంటాయని ప్రయోగం ద్వారా నిరూపించాడు.

పాడువా విశ్వవిద్యాలయం

ఫ్లారెన్స్ లో గెలీలియో శిల్పం.

ఈ ప్రయోగం మూలంగా అరిస్టాటిల్ సిద్ధాంతాల్ని నమ్మే పీసా విద్యాలయ మేధావులను ఇబ్బంది పెట్టింది. అందువలన స్వేచ్ఛ, సౌకర్యాలు కొరవడిన గెలీలియో అక్కడనుండి పాడువా విశ్వవిద్యాలయంలో గణితశాస్త్ర ప్రధానాచార్యునిగా చేరారు. అక్కడే గెలీలియో యాంత్రిక శాస్త్రం రచించారు. ఇది సామాన్యులకు కప్పీలు, తులాదండాలు, వాలుతలాల ద్వారా బరువులు సులభంగా ఎత్తడానికి ఉపకరించింది.

పాడువా లోనే గెలీలియోకు ఆర్ధిక ఇబ్బందులు తలెత్తాయి. దాంతో డబ్బుకోసం కొత్త విషయాలను ఆవిష్కరించడం ఒక్కటే అతనికి మార్గంగా కనిపించింది. ఆ సమయంలొనే వాయు థర్మామీటర్ ను, పల్లపు ప్రాంతం నుంచి ఎత్తుకు నీటిని చేరవేసి వ్యవసాయానికి ఉపయోగించే యంత్రాన్ని, గణితంలో వర్గాలు, వర్గమూలాలు కనుగొనే కంపాస్ పరికరాన్ని కనుగొన్నారు. ఆ సమయంలోనే లోలకాలు మరియు వాయుతలాలపై కూడా కీలకమైన ప్రయోగాలు చేశారు.

కోపర్నికస్ సిద్ధాంతం

1610లో గెలీలియో పరిశీలించిన శుక్రగ్రహ ఉపగ్రహాలు.

అరిస్టాటిల్ సిద్ధాంతం ప్రకారం గ్రహాలన్నీ భూమి చుట్టూ తిరుగుతున్నాయని నమ్మేవారు. గెలీలియో అప్పుడే కనుగొన్న టెలిస్కోపు ద్వారా శుక్రగ్రహ ఉపగ్రహాలను ప్రజలకు చూపించి నికోలస్ కోపర్నికస్ సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ధృవీకరించారు. అయితే అప్పటికే మత గ్రంథాలలో ప్రముఖ స్థానాన్ని పొందిన భూకేంద్రక సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తున్నందుకు కోపర్నికస్ సిద్ధాంతాన్ని నిషేధించి, కొందరు మతాధికారులు గెలీలియో ప్రయోగాలు మత వ్యతిరేకమైనవని తీర్మానించారు. తన ప్రయోగాలను ఎన్నటికీ బహిర్గతం చేయనని ప్రమాణం తీసుకున్నారు.

1623లో గెలీలియో స్నేహితుడు మతాధికారి పదవిని స్వీకరించినా, తనపై మోపబడిన అభియోగాన్ని రద్దుచేయబడలేదు. ఐతే రెండు సిద్ధాంతాలపై గ్రంధాన్ని రాయడానికి అనుమతి సంపాదించాడు. 1632లో వెలువడిన ఈ "Dialogues concerning the two chief world systems" అనే గ్రంధం యూరప్ ఖండంలో సారస్వత వేదాంత గ్రంధానికి ఉదాహరణగా పేర్కొంటారు. అయితే ఈ గ్రంధాన్ని ప్రజలు కోపర్నికస్ సిద్ధాంతాన్ని సమర్ధించేదిగా భావిస్తున్నారని తెలుసుకున్న మతాధికారులు దీని ప్రచురణను నిలిపివేయడమే కాకుండా 1616లో గెలీలియోకు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు.

ఇంతటి మహానుభావుడు శిక్షను అనుభవిస్తూనే 1642, జనవరి 8 తేదీన తన 78వ ఏట మరణించారు.

మూలాలు

  1. 1.0 1.1 1.2 1.3 1.4 J J O'Connor and E F Robertson. "Galileo Galilei". The MacTutor History of Mathematics archive. University of St Andrews, స్కాట్లాండ్. Retrieved 2007-07-24.
  2. Drake (1978, p.1). The date of Galileo's birth is given according to the Julian calendar, which was then in force throughout the whole of Christendom. In 1582 it was replaced in Italy and several other Catholic countries with the Gregorian calendar. Unless otherwise indicated, dates in this article are given according to the Gregorian calendar.
  3. మూస:Ws by John Gerard. Retrieved 11 August 2007

బయటి లింకులు

మూస:Link FA మూస:Link FA మూస:Link FA మూస:Link FA మూస:Link FA మూస:Link FA మూస:Link FA