దత్తాత్రేయ రామచంద్ర కప్రేకర్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: mr:दत्तात्रय रामचंद्र कर्पेकर
చి r2.7.3rc2) (యంత్రము కలుపుతున్నది: pt:D. R. Kaprekar
పంక్తి 24: పంక్తి 24:
[[mr:दत्तात्रय रामचंद्र कर्पेकर]]
[[mr:दत्तात्रय रामचंद्र कर्पेकर]]
[[pl:Dattathreya Ramachandra Kaprekar]]
[[pl:Dattathreya Ramachandra Kaprekar]]
[[pt:D. R. Kaprekar]]
[[tr:Kaprekar]]
[[tr:Kaprekar]]

03:10, 5 ఫిబ్రవరి 2013 నాటి కూర్పు

దత్తాత్రేయ రామచంద్ర కప్రేకర్ ( జనవరి 17, 1905— జులై 4, 1986) తేదీన దహన్, బొంబాయిలో జన్మించిన ప్రసిద్ధ భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు. [1] సంఖ్యా శాస్త్రములో అనేక ఆసక్తికరమైన ధర్మాలను కనుగొన్నాడు.

బాల్యం మరియు విద్యాభ్యాసం

కప్రేకర్ చిన్నవయసులోనే తల్లిని కోల్పోయాడు. కాబట్టి బాల్యమంతా తండ్రి పెంపకంలోనే పెరిగాడు. విద్యార్థి దశలోనే లెక్కలలో సులభ గణనలు, పజిల్స్ ను సాధన చేయడంలో కుతూహలం ప్రదర్శించేవాడు. మహారాష్ట్ర లోని పూనాలో ఫెర్గూసన్ కళాశాల ద్వారా బి.యస్సీ పూర్తి చేశాడు. చదివేటప్పుడే ఆయన రాసిన థియరీ ఆఫ్ ఎన్వలప్స్ అనే వ్యాసానికి గాను బహుమతి లభించింది.

ఉపాధ్యాయ వృత్తి

బి.యస్సీ పూర్తి అయిన తర్వాత దేవ్‌లాలీ లో ఒక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరాడు. ఉపాధ్యాయుడిగా ఉంటూనే తన పరిశోధనలు కొనసాగించాడు. గణిత సమాజం వార్షికోత్సవంలో ప్రతిసారీ తాను కనుగొన్న కొత్త కొత్త సభ్యుల సమక్షంలో ప్రదర్శించేవాడు. సంఖ్యల మద్య సంబంధాలు, వాని విచిత్ర లక్షణాలు, మొదలైన కొత్త కొత్త విషయాలను ఆవిష్కరించేవాడు. డెమ్లో నంబర్లపై ఆయన చేసిన పరిశోధనకుగాను, బాంబే విశ్వవిద్యాలయం వారు మూడేళ్ళపాటు ఆర్థిక సహాయం అందించారు.

రిక్రేయషనల్ మ్యాథ్స్ గురించి ఆయన రాసిన అనేక వ్యాసాలు, స్క్రిప్టా మ్యాథమేటిక్స్, అమెరికన్ మ్యాథమేటిక్స్ లాంటి విదేశీ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ఆయన ఇంటి ప్రవేశ ద్వారానికి కూడా గణితానంద మండలి అని పేరు పెట్టడం గణితంపై ఆయనకున్న అభిమానానికి నిదర్శనం. మార్టిన్ గార్డినర్ అనే పాత్రికేయుడి ద్వారా తాను కనుగొన్న సెల్ఫ్ నంబర్స్, కప్రేకర్ స్థిరాంకం (6174), జనరేటెడ్ నంబర్లు జగద్విదితమయ్యాయి. తన పరిశోధనల ద్వారా విదేశాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సాధించుకున్న కప్రేకర్ భారత ప్రభుత్వం యొక్క ప్రోత్సాహానికి మాత్రం నోచుకోలేదు. చివరి దాకా ఉపాధ్యాయ వృత్తిలోనే కొనసాగిన కప్రేకర్ జులై 4, 1986 న కన్నుమూశాడు.

మూలాలు

  1. ఎమెస్కోవారి గణిత విజ్ఞాన సర్వస్వం