కట్లపాము: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము తొలగిస్తున్నది: zh:印度環蛇 (strong connection between (2) te:కట్లపాము and zh:青環蛇)
చి Bot: Migrating interwiki links, now provided by Wikidata on d:q2910062
పంక్తి 31: పంక్తి 31:
[[వర్గం:పాములు]]
[[వర్గం:పాములు]]


[[en:Common krait]]
[[fr:Bongare indien]]
[[hi:करैत]]
[[hu:Közönséges krait]]
[[it:Bungarus caeruleus]]
[[mr:मण्यार]]
[[pl:Niemrawiec indyjski]]
[[simple:Common Krait]]
[[simple:Common Krait]]
[[sv:Vanlig krait]]
[[ta:கட்டுவிரியன்]]

23:09, 1 ఆగస్టు 2013 నాటి కూర్పు

కట్లపాము
Banded krait, Bungarus fasciatus
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Subphylum:
Class:
Order:
Suborder:
Family:
Genus:
Bungarus

కట్లపాము (కామన్ క్రెయిట్) (లాటిన్ Bungarus caeruleus) భారత ఉపఖండానికి చెందిన అడవులలో కనిపించే సాధారణ పాము. ఇది అత్యంత విషపూరితమైన పాము. భారతదేశములో "నాలుగు పెద్ద పాములు"గా భావించే పాములలో ఇది ఒకటి.

శరీర వర్ణన

ఈ పాము శరీరము యొక్క రంగు ముదురు స్టీలు నీలము లేదా నలుపు నుండి మాసిపోయిన నీలము-గ్రే రంగులలో ఉంటుంది. దీని సగటు పొడవు 1 మీటరు. తెల్లటి అడ్డపట్టీలు తోక ప్రాంతములో మరింత ప్రస్ఫుటముగా కనిపిస్తాయి.

మగ పాము, ఆడ పాము కంటే పొడవుగా ఉండి, తోక పెద్దదిగా ఉంటుంది. ఇది అత్యంత విషపూరితమైన సర్పం.దీని విషం నాగు పాము కంటె 16 రెట్లు విషపూరితమైనది.దీని విష ప్రభావం శ్వాస వ్యవస్ట మరియు నాడి మండలంపై ఉండును.

భౌగోళిక విస్తరణ

కట్లపాము సింధ్ (పాకిస్తాన్) నుండి పశ్చిమ బెంగాల్ మైదానాల వరకు భారత ద్వీపఖండ భూభాగమంతా విస్తరించి ఉన్నది. ఇది దక్షిణ భారతదేశమంతటా మరియు శ్రీలంకలోనూ కనిపిస్తుంది.

నివాసము

కట్లపాము అనేక రకాలైన ఆవాస ప్రాంతాలలో నివసిస్తుంది. పొలాలలో, పొద అడవుల్లో మరియు జనావాసము లేని పరిసరప్రాంతాలలో ఆవాసమేర్పరచుకుంటుంది. వీటికి పందికొక్కులంటే చాలా ఇష్టం అందువలన, పందికొక్కుల బొర్రలలో, చెద పుట్టలలో, ఇటుకల కుప్పలలో మరియు ఇళ్ళలో కూడా కనిపిస్తుంటాయి. కట్లపాముకు నీళ్ళంటే కూడా ఇష్టం అందువళ్ల సాధారణంగా నీటిలో లేక నీటి దగ్గరలో కనిపిస్తుంటాయి.

"https://te.wikipedia.org/w/index.php?title=కట్లపాము&oldid=892719" నుండి వెలికితీశారు