హైదరాబాదు ఆల్విన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హైదరాబాదు ఆల్విన్
తరహాnow defunct, ప్రభుత్వరంగ సంస్థ
స్థాపన1942, Hyderabad as Allwyn Metal Works Ltd.
Dissolved1995
ప్రధానకేంద్రము
పరిశ్రమAutomotive, Watch, Refrigerators, Home appliance, Vehicle Coach building
ఉత్పత్తులుఆల్విన్ రిఫ్రిజిరేటర్లు, ఆల్విన్ వాచీలు, ఆల్విన్ పుష్పక్ – స్కూటర్ల్య్, ఆల్విన్ – నిస్సాన్ కాబ్‌స్టర్ ట్రక్కులు.
ఉద్యోగులు6500 పైగా

హైదరాబాదు ఆల్విన్ సంస్థ 1942లో హైదరాబాదు రాష్ట్ర ప్రభుత్వం స్థాపించిన ఒక ప్రభుత్వరంగ ఇంజనీరింగు, రవాణా సాధనాలు, గృహోపకరణాల నిర్మాణ పరిశ్రమ. ఈ సంస్థ, ట్రక్కులు, స్కూటర్లు, బస్సులు, రిఫ్రిజిరేటర్లు, వాచీలు తయారుచేసేది. ఆల్విన్ రిఫ్రెజిరేటర్లు, వాచీలు భారతదేశంలో 1970, 1980 దశకాల్లో అగ్రబ్రాండులుగా వెలుగొందాయి. 1995లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కంపెనీని మూసివేసింది. 

తొలి చరిత్ర , ఉత్పత్తులు[మార్చు]

హైదరాబాదు ఆల్విన్ సంస్థ, 1942 జనవరిలో, హైదరాబాదు నైజాం ప్రభుత్వ పారిశ్రామిక అభివృద్ధి సంఘం, మెసర్స్ అల్లాద్దీన్ & కంపెనీ యొక్క సంయుక్త భాగస్వామ్యంలో ఆల్విన్ మెటల్ వర్క్స్ గా స్థాపించబడింది.[1]

ఆల్విన్ మెటల్ వర్క్స్ హైదరాబాదు రాష్ట్ర రైల్వే సంస్థ కొరకై ఆల్బియాన్ సి.ఎక్స్.9 బస్సులను నిర్మించేది.[2] 1952 సార్వత్రిక ఎన్నికలకై బ్యాలెట్ బాక్సులను తయారుచేసింది.[3] 1969లో కంపెనీ యాజమాన్యం సంస్థను సమర్ధవంతంగా నడపలేని కారణంగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంస్థ యొక్క నిర్వహణను తన చేతుల్లోకి తీసుకున్నది.

కోచ్‌ల నిర్మాణ విభాగం[మార్చు]

ఆల్విన్ పుష్కక్ 1982

హైదరాబాదులో తొలి డబుల్ డెక్కర్ బస్సులను 1963 ఏప్రిల్లో ప్రవేశపెట్టారు. ఈ బస్సులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థతో కలిసి ఆల్విన్ సంస్థ రూపొందించింది.[4] తదనంతరం ఈ కోచ్‌ నిర్మాణ విభాగం  రాష్ట్ర రోడ్డు  రవాణా సంస్థ లు నిర్వహించే బస్సులను  నిర్మించే అతిపెద్ద గుత్తేదారైంది.  ఆల్విన్ భారత సైన్యం యొక్క  మధ్యస్థ సామర్ధ్యం గ ల శక్తిమాన్ ట్రక్కుల  బాడీలను  కూడా  నిర్మించింది. వీటిని  తొలుత  జర్మనీ  సంస్థ  ఎం.ఏ.న్, 415 ఎల్1 ఏ.ఆర్ ట్రక్కులుగా రూపొందించింది. 

శీతలీకరణ , ఉపకరణాల విభాగం[మార్చు]

ఆల్విన్ రెఫ్రిజిరేటర్లు భారతదేశంలో అత్యంత పేరెన్నిగన్న బ్రాండుల్లో ఒకటి. ఇవి గోద్రేజ్, కెల్వినేటర్, వోల్టాస్ వంటి ప్రత్యర్థులతో పోటిపడింది.  2005 వరకు కూడా ఈ రిఫ్రెజిరేటర్లు శక్తి సద్వినియోగితకు పేరొందాయి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో[మార్చు]

నిస్సాన్‌తో ఒప్పందం[మార్చు]

ఆల్విన్‌చే నిర్మింపబడి, ఆల్విన్ నిస్సాన్ గా భారతదేశంలో అమ్మబడిన నిస్సాన్ కాబ్‌స్టర్ మోడల్ ట్రక్కు. ఇప్పుడు ఇదే మహీంద్ర లోడ్‌కింగ్ గా మహీంద్ర & మహీంద్ర సంస్థచే అమ్మబడుతుంది

1983లో వాహన విభాగం జపాన్‌కు చెందిన నిస్సాన్ మోటర్ కంపెనీతో, నిస్సాన్ కాబ్‌స్టర్ శ్రేణి యొక్క తేలిక పాటి కమర్షియల్ ట్రక్కులను నిర్మించడానికి ఒప్పందం కుదుర్చుకొన్నది.  ఇందుకుగాను  హైదరాబాదు  సమీపంలోని  జహీరాబాదులో  ఒక  కర్మాగారం  ఏర్పాటుచేసింది.  ఈ విభాగానికి  హైదరాబాదు  ఆల్విన్  నిస్సాన్  లిమిటెడ్  అని  పేరుపెట్టారు.  ఇందులో  నిస్సాన్  సంస్థకు 15% భాగస్వామ్యం ఉంది.

వాచీ విభాగం[మార్చు]

1981లో జపాన్ సంస్థ సీకో భాగస్వామ్యంతో హైదరాబాదు ఆల్విన్ వాచీల వ్యాపారంలో అడుగుపెట్టి, యాంత్రిక, క్వార్ట్ వాచీల తయారీ ప్రారంభించింది. అప్పటి దాకా భారతదేశపు చేతివాచీల మార్కెట్లో కేంద్రప్రభుత్వ రంగ సంస్థ అయిన హెచ్.ఎం.టీ దే అగ్రస్థానం.[5] ఆల్విన్, హెచ్.ఎం.టి, టైటాన్ పరిశ్రమలతో కలిసి భారతదేశపు వాచీల మార్కెటును ఏలాయి. మొత్తం మార్కెట్లో దాదాపు 10% ఈ సంస్థల చేతుల్లోనే ఉండేది.[6] 1987లో హైదరాబాదు ఆల్విన్ సంస్థ, కొత్తగా మార్కెట్లో ప్రవేశపెట్టబోతున్న ఆల్విన్ ట్రెండీ వాచీల వాణిజ్య ప్రకటనకు జింగిల్ రూపొందించేందుకు, అప్పటికింకా దిలీప్ గానే పరిచయమైన ఏ.ఆర్.రెహమాన్ కు తొలి అవకాశం ఇచ్చింది.[7][8]

స్కూటర్లు[మార్చు]

ఆంధ్రప్రదేశ్ స్కూటర్స్ లిమిటెడ్ (ఏపిఎస్‌ఎల్) ఆల్విన్ పుష్పక్ పేరున, వెస్పా పి.ఎల్170 పేరున పియాజ్జియో స్కూటర్లను నిర్మించింది.

మూసివేత , తదనంతర పరిణామాలు[మార్చు]

1990వ దశకు మధ్యకల్లా పరిశ్రమ సామర్ధ్యం క్షీణించింది. 1993లో ఆదాయపు వనరులన్నీ హరించుకుపోయాయి. నష్టాలు 180 కోట్లకు పైగా చేరడంతో, బోర్డ్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్సియల్ రీకంస్ట్రక్షన్ (బీఐఎఫ్‌అర్), 1985 సిక్ ఇండస్ట్రియల్ కంపెనీస్ (స్పెషల్ ప్రొవిజన్) చట్టం క్రింద 1993 మార్చి 31న హైదరాబాదు ఆల్విన్ ను ఖాయిలా పరిశ్రమగా ప్రకటించింది. ఆల్విన్ విలువలేని రుణాధిక కంపెనీ అయ్యింది.[9] ఖాయిలా పరిశ్రమగా ప్రకటించిన తర్వాత, బీఐఎఫ్‌అర్ పునరుద్దరణ ప్రణాలిక సిద్ధం చేయటానికి ఐడీబీఐని ఆల్విన్ యొక్క నిర్వాహక సంస్థగా నియమించింది. కేవలం ఐదువేల మంది ఉద్యోగులనే కొనసాగిస్తారని తెలిసికూడా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాదు ఆల్విన్ యొక్క శీతలీకరణ, గృహోపకరణాల విభాగాన్ని, టాటా సంస్థ ఐన వోల్టాస్‌తో కలపటానికి అంగీకరించింది.[10]

మూలాలు[మార్చు]

  1. Journal of the Institute of Public Enterprise, Volume 15. Hyderabad: Institute of Public Enterprise, Osmania University Campus. 1992.
  2. http://www.albioncx19project.org.uk/other_cx19s.htm
  3. "Ballot box, Feature Photo, A ballot box, made by Hyderaba". Timescontent.com. 1951-08-20. Retrieved 2011-08-24.
  4. Yarlagadda, Srinivasulu (2006). Marketing of passenger transport services. New Delhi: APH Publishing Corporation. p. 40. ISBN 81-7648-976-X.
  5. "Wrist Watch. Industry Overview". www.indiastudychannel.com. Retrieved 25 September 2011.
  6. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2015-09-23. Retrieved 2017-10-04.
  7. "Advertisement jingles". Archived from the original on 28 ఆగస్టు 2011. Retrieved 25 September 2011.
  8. "A R Rahman`s biography". 123musiq.com. Retrieved 27 July 2011.
  9. Restructuring public enterprises in India privatisation and disinvestment By R. K. Mishra, B. Navin, New Delhi, 2002
  10. "Voltas Limited - Allwyn Unit - Andhra Pradesh High Court". indiankanoon.orgaccessdate=15 November 2013.